Home Blog Page 36

లైంగిక వేధింపుల కేసు.. ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్.. 2 నెలల తర్వాత రిలీఫ్

0
తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుమారు 67 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు తాజాగా ఊరట లభించింది. బెయిల్ మంజూరు సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టు కొన్ని షరతులు, నిబంధనలు విధించింది.

ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ.. రూ.15 వేల లంచంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

0
సిద్దిపేట జిల్లాలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కైంది. గ్రామ పంచాయతీలోనే రూ.15వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇళ్ల మ్యుటేషన్ కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా.. చివరికి రూ.15 వేలకు ఓకే చెప్పారు. కాంట్రాక్ట్ కారోబార్‌తో కలిసి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా.. వారిద్దరినీ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.

పెరగనున్న విద్యుత్ ఛార్జీలు, యూనిట్‌కు 50 పైసలు.. రూ.5,420 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీలు.. వ్యవసాయంపై భారం ప్రభుత్వానిదే!

0
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల రూపంలో అదనపు భారం పడనుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కంలకు అనుమతి ఇచ్చింది. మొదటి నెల యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 26 నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ఏటీఎంల సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్..? భద్రతా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి..?

0
శంషాబాద్‌ శాతంరాయిలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో రూ.30 లక్షలకు పైగా నగదు చోరీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఏటీఎంలలో బలమైన వాల్ట్‌లు, సెన్సార్లు, అలారాలు, సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్‌ నిఘా వంటి పలు భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ చోరీలు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లోని ఏటీఎంలు, పాత భద్రతా వ్యవస్థలు, గార్డుల కొరత వంటి అంశాలు చోరీలకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక సర్వైలెన్స్‌ వ్యవస్థలతో భద్రతను పెంచుతున్నా.. వాటి నిరంతర నిర్వహణ కీలకంగా మారిందని అంటున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌లో ‘దాదా’ గిరి షురూ.. హెడ్‌కోచ్‌గా నియామకం..!

0
ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం బిగ్ డెసిషన్ తీసుకుంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని జట్టు నూతన హెడ్ కోచ్‌గా నియమించింది. గత రెండు సీజన్లుగా ఉన్న హేమంగ్ బదానీ స్థానాన్ని దాదా భర్తీ చేయనున్నారు. 2019 నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీతో అనుబంధం ఉన్న గంగూలీ, ఇప్పటివరకు ట్రోఫీ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజేతగా నిలబెట్టేందుకు తన మార్క్ వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నారు.

Harmanpreet Kaur: ‘సారథిగా నా కర్తవ్యం పూర్తయ్యింది’.. కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ గుడ్‌ బై

0
Harmanpreet Kaur India Women Cricket: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె నాయకత్వంలో భారత్ ఇటీవలే 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. అంతకుముందు 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను కూడా అందించింది. కెప్టెన్సీ నుంచి వైదొలిగినా క్రీడాకారిణిగా మరికొంత కాలం ఆటలో కొనసాగున్నట్లు స్పష్టం చేశారు.

హార్దిక్ పాండ్యా కోసం ట్రేడింగ్ వార్.. రేసులో చెన్నై, కేకేఆర్!

0
ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు మళ్లీ తీవ్రంగా మార్మోగుతోంది. ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్‌‌ను దక్కించుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి. గతంలో ముంబై సారథిగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, అతడికి ఉన్న ఆల్‌రౌండ్ నైపుణ్యాలు, గుజరాత్‌ను విజేతగా నిలిపిన లీడర్‌షిప్ సామర్థ్యం ఫ్రాంచైజీలను ఆకర్షిస్తున్నాయి. డిసెంబర్ వేలానికి ముందు నవంబర్ 15 నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆసియాడ్ గోల్డ్ మజా తీరకముందే విండీస్‌తో వార్.. లక్నో వేదికగా నేడు తొలి టీ20!

0
ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఊపులో ఉన్న భారత టీ20 జట్టు, లక్నో వేదికగా వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు కన్సిస్టెన్సీ కాపాడుకోవాలని చూస్తుండగా, పావెల్, హిట్‌మెయిర్ వంటి హిట్టర్లతో విండీస్ గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది. బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో అర్ష్‌దీప్ సింగ్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్ భారత్‌కు కొండంత బలాన్నిస్తోంది.

సీఈసీ రాజీనామాపై ‘ఇండియా’ కూటమి నిరసనలో హైడ్రామా.. ఆకాశవాణి భవన్ వద్ద బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ

0
గతేడాది నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలో ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని, బీజేపీ కుట్రల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ భాగమయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో 13 కోట్ల మంది ఓట్లను కోల్పోయారని, మోదీ ప్రభుత్వం చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారిపోయారని, తక్షణమే ఆయన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఢిల్లీలో చేపట్టిన ఆందోళన ఉద్రికత్తలకు దారితీసింది.

ఫైర్ ఇంజిన్‌తో బీజేపీ ఎమ్మెల్యే బంగ్లా క్లీనింగ్.. గుజరాత్‌లో రచ్చరచ్చ.. వీడియో వైరల్

0
అగ్ని ప్రమాదాలు లేదా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్లను మోహరిస్తారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఈ ఫైర్ ఇంజిన్‌ సాయంతో ఓ ఎమ్మెల్యే తన బంగ్లాను శుభ్రం చేయించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో దుమారం రేగుతోంది. ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి.. అర్జెంటుగా ఫైర్ ఇంజిన్ పంపాలని కోరారని, తీరా అక్కడకు వెళ్లేసరికి ఇంటిని శుభ్రం చేయమన్నారని అధికారులు తెలిపారు.