Aadhaar Name Change: భారతీయులకు ఆధార్ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇందులో ఏ చిన్న తప్పు ఉన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యం పేరులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. మరోవైపు.. పెళ్లి అయిన తర్వాత ఆడవారి ఇంటి పేరు మార్చుకుంటారు. అలాగే విడాకులు తీసుకున్న వారు తమ సర్ నేమ్ మార్చుకోవాలనుకుంటారు. మరి ఈ రెండు సందర్భాల్లో ఇంటి పేరు ఎలా మార్చుకోవాలి? ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి? అనే వివరాలు తెలుసుకుందాం.
“లేఆఫ్స్‌లో 35 లక్షల ఉద్యోగం పోయినా.. అతని ముందు చూపుతో నెలకు 93 వేల ఆదాయం వస్తోంది”
Layoffs Job Lost: ఇటీవలి కాలంలో దిగ్గజ కంపెనీలు భారీగా లేఆఫ్స్ చేస్తున్నాయి. లక్షల జీతాలు ఉండి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వారు ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చేశారు. దీంతో కొందరు ప్రత్యామ్నాయాలు వెతుకుతూ చాలా తక్కువ జీతానికి పని చేస్తున్నారు. కానీ, ఒక ఉద్యోగి మాత్రం తన ముందు చూపుతో చేసిన తెలివైన పెట్టుబడితో ఇప్పుడు ఇంటి వద్ద ఉంటూనే నెలకు రూ.93 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
పోస్టాఫీస్‌లో డబ్బులేస్తున్నారా? PPF, సుకన్య, MIS పథకాల వడ్డీ చెల్లింపుల్లో కొత్త మార్పు.. అందుబాటులోకి HIRAM సిస్టమ్!
Post Office HIRAM: పోస్టాఫీస్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. పోస్టాఫీస్ పొదుపు పథకాలు, పీపీఎఫ్, సుకన్య యోజన, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వంటి పథకాలకు సంబంధించిన వడ్డీ సర్దుబాటు ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇందుకోసం HIRAM అనే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. పొదుపు పథకాల్లో వడ్డీ సర్దుబాటులో జరుగుతున్న పొరపాట్లను సవరించేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఈ కొత్త సిస్టమ్ తెచ్చింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
Cricket to Business: హైదరాబాద్ నగరంలో క్రికెటర్ల బిజినెస్ దూకుడు.. సచిన్, కోహ్లీ, ధోనీ సహా ఇంకెందరో!
MS Dhoni 7Padel: భారత్ తరఫున క్రికెట్ ఆడుతూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన క్రికెటర్లు మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఒకరిద్దరనే కాదు పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం ఆడుతున్నవారు కూడా రెస్టారెంట్లు, స్పోర్ట్స్ అకాడమీలు, పాడెల్ కేంద్రాలు, టెక్, తయారీ సంస్థల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కూడా జూబ్లీహిల్స్‌లో 7Padel ప్రారంభించడంతో హైదరాబాద్‌లో క్రికెటర్ల బిజినెస్ మరోసారి తెరపైకి వచ్చింది. మరి ఏయే క్రికెటర్ హైదరాబాద్ కేంద్రంగా ఎలాంటి బిజినెస్ నిర్వర్తిస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం.
DLC 2026: పెన్షనర్లూ.. అక్టోబర్ 1 నుంచే మొదలైన లైఫ్ సర్టిఫికెట్ సబ్మిషన్.. ఎవరికి వర్తిస్తుంది? గడువు తేదీ వివరాలివే!
Jeevan Pramaan 2026: ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందడానికి ప్రతి సంవత్సరం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అయితే, అక్టోబర్ 1, 2026 నుంచి ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ప్రక్రియ మొదలైంది. మరి పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి అర్హులా? లేక కొందరికే ఈ అవకాశం ఉందా? పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం అర్హతలు, గడువు తేదీలు తెలుసుకుందాం.
ఐస్‌క్యూబ్ ప్రయోగానికి భౌతిక శాస్త్రంలో నోబెల్.. బెల్జియం శాస్త్రవేత్తకు అత్యున్నత పురస్కారం
ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి బెల్జియం శాస్త్రవేత్త ఎంపికయ్యారు. అంతరిక్షం నుంచి వచ్చే అత్యధిక శక్తి కలిగిన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ ఏడాది నోబెల్‌కు ఎంపిక చేశారు. దక్షిణ ధ్రువంలో 1980ల నుంచి ఫ్రాన్సిస్ హోల్జెన్ పరిశోధనలు కొనసాగుతున్నాయి. అక్కడ ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటులో ఆయన అత్యుత్తమ సేవలను అందించారు. దీంతో ఈ ఏడాది ఆయనను నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ఆయనపై కమిటీ ప్రశంసలు కురిపించింది.
పాకిస్థాన్‌లో సైనిక పోస్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ చేపల వలలు.. ఏమైనా ఐడియానా సర్ జీ..!?
పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారారు. ముప్పేట దాడి చేస్తూ.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా చీప్‌గా లభించే డ్రోన్లతో ఔట్ పోస్టులపై దాడి చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తున్నారు. దీంతో డ్రోన్ల దాడికి విరుగుడుగా పాకిస్థాన్ చేపల వలలను తెరమీదకు తీసుకొస్తోంది. ఔట్ పోస్టుల చుట్టూ చేపల వలలను ఏర్పాటు చేయడం ద్వారా డ్రోన్ దాడులకు చెక్ పెట్టాలని యోచిస్తుంది.
170 మంది ప్రయాణికులు ఉండగానే.. ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేసేందుకు సిద్ధపడిన ఇజ్రాయెల్!
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఒమన్ జాతీయుడైన కోపైలట్ కెప్టెన్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఘటన తీవ్ర అలజడి సృష్టించింది. 170 మందికి పైగా ప్రయాణికులు ఉన్న ఆ విమానం నుంచి అత్యవసర సంకేతాలు రావడంతో 9/11 తరహా ఉగ్రదాడిగా భావించిన ఇజ్రాయెల్.. తమ గగనతలాన్ని మూసివేసి విమానాన్ని ఆకాశంలోనే కూల్చివేసేందుకు యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. కానీ అంతలోపే భారత కెప్టెన్ కో పైలెట్ దాడిని అడ్డుకుని.. సౌదీలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో.. ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి తగ్గాయి.
‘మక్కా ఒప్పందం’ యాక్టివేట్.. సౌదీ అరేబియాకు బలగాలను పంపిన పాకిస్థాన్, టర్కీ
సౌదీ అరేబియా భద్రతకు హౌతీలు, ఇతర ప్రాంతీయ శక్తుల నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. నూతన త్రైపాక్షిక ‘మక్కా ఒప్పందం’ అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా సౌదీ అరేబియాలో తమ సైనిక దళాలను, రక్షణ సామర్థ్యాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్, టర్కీ అంగీకరించాయి. రియాద్‌లో జరిగిన విదేశాంగ, రక్షణ మంత్రుల అత్యవసర సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
కేసీఆర్, రేవంత్ కుటుంబాల ఆస్తులపై విచారణ జరపండి.. హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు రఘునందన్‌రావు లేఖ
సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీలకు సంబంధించిన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ అందించారు. కేసీఆర్ కుటుంబంపై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు.. సీఎం రేవంత్ రెడ్డిపై రూ.50 వేల కోట్ల సంపాదనకు సంబంధించిన ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల కంటే అదనంగా ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించాలని కోరారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా ఫిర్యాదు పంపనున్నట్లు తెలిపారు.

