Home Blog Page 34

Jim Jim Tara: నెట్టింట మార్మోగుతోన్న ‘జిమ్ జిమ్ తార’.. ‘పర్ణశాల’ టీమ్ మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్కెచ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోన్న ‘జిమ్ జిమ్ తార’ పాటని హారర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ‘పర్ణశాల’ చిత్రం ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. ఎస్ఎల్టీ ఫిలిమ్స్ పతాకంపై వై.జి. భరత్ దర్శకత్వంలో మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీదేవితో పాడించిన ఈ పాట ఆర్గానిక్‌గా నేరుగా ప్రేక్షకుల నోళ్లలో నానడం విశేషం. ఎలాంటి ఖరీదైన పెయిడ్ ప్రమోషన్లు లేకుండానే వైరల్ అయిన ఈ పాట ట్రెండ్‌ను పట్టుకుని చిత్ర బృందం దీనినే ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకుంది. ఈ వినూత్న మార్కెటింగ్ ఎత్తుగడతో సినిమాకు థియేట్రికల్, బిజినెస్ పరంగా భారీ బజ్ ఏర్పడింది.

తండ్రి పరువు కోసం కొడుకు ప్రతీకారం…. ఒకే పాయింట్‌తో వచ్చిన సినిమాలు, నిర్మాత కూడా సేమ్

ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, రామ్ ‘ఒంగోలు గిత్త’ చిత్రాలు పైకి భిన్నంగా కనిపించినా, రెండింటి మూల కథ తండ్రి ఆత్మగౌరవం కోసం కొడుకు శత్రువుపై తీర్చుకునే ప్రతీకారమే. అయితే ఆ కథను నడిపించిన విధానంలోనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో హీరో కండబలాన్ని కాకుండా కార్పొరేట్ మైండ్ గేమ్స్‌తో లండన్ బ్యాక్‌డ్రాప్‌లో శత్రువును దెబ్బతీస్తాడు. సుకుమార్ డిఫరెంట్ స్క్రీన్‌ప్లే దీన్ని క్లాస్‌గా మలిచింది. ‘ఒంగోలు గిత్త’లో రామ్ గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో రొటీన్ మాస్ ఫైట్లతో తలపడతాడు. మూల కథ ఒక్కటే అయినా, దర్శకుల ఆలోచనా శైలే ఫలితాల్లో తేడా చూపించింది.

మూకీల యుగానికి స్వస్తి పలికిన ‘ది జాజ్ సింగర్’… సినిమా ప్రేక్షకులతో మాట్లాడి నేటికి 99 ఏళ్లు

1927 అక్టోబర్ 6న విడుదలైన ‘ది జాజ్ సింగర్’ చిత్రంతో ప్రపంచ సినిమా చరిత్రలో మూకీ శకం ముగిసి, టాకీల యుగం ప్రారంభమైంది. వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రంలో అలెక్ జోల్సన్ నటనతో పాటు తెరపై స్వయంగా మాట్లాడి, పాటలు పాడటం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ‘వైటాఫోన్’ సాంకేతికతతో ఫిల్మ్, సౌండ్ డిస్క్‌లను సమన్వయం చేసి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇందులోని “యు ఎయింట్ హర్డ్ నథింగ్ యెట్” అనే సంభాషణ సినీ ప్రపంచ గమనాన్నే మార్చేసింది. ఈ ఒక్క విజయంతో హాలీవుడ్ స్టూడియోలన్నీ శబ్ద సాంకేతికత వైపు మళ్లాయి. సినిమా మాధ్యమానికి సొంత గొంతును అందించిన ఒక చారిత్రక మైలురాయిగా ఈ చిత్రం నిలిచింది.

తెలంగాణ సినిమా, ఆంధ్రా సినిమా అనడం ఫ్యాషన్ అయిపోయింది.. ఉన్నది తెలుగు సినిమా ఒక్కటే – నరేష్

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చిత్రాలను ప్రాంతాలు, యాసల వారీగా విభజించి ప్రచారం చేయడాన్ని సీనియర్ నటుడు వీకే నరేష్ తప్పుపట్టారు. ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర సినిమాలు అనడం పరిశ్రమలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని విమర్శించారు. సంగీతానికి, కథకు ప్రాంతీయ సరిహద్దులు ఉండవని, మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ప్యాషన్‌తో ఆదరిస్తారని స్పష్టం చేశారు. ‘గరివిడి లక్ష్మి’ యావత్ తెలుగువారి మట్టి వాసనను ప్రతిబింబిస్తుందని పేర్కొన్న ఆయన, ఈ దసరాకు సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

టీటీడీ కొత్త ఛైర్మన్ రేసులో ఎవరు? బీఆర్ నాయుడు రెండేళ్ల పదవీకాలంపై సమీక్ష మొదలైందా?

టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు రెండేళ్ల పదవీ కాలం నవంబర్ నెలతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో మరో నాయుడికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు ఎలాంటి సంస్కరణలు చేపట్టారు. ఆయన ఎదుర్కొన్న పరీక్షలు ఏమిటి? ఆయన హయాంలో వచ్చిన ఆరోపణలు, వివాదాలు ఏంటి? అనే అంశాలను ఓ సారి క్లుప్తంగా సమీక్షించే ప్రయత్నం చేద్దాం.

ఉప్పు తగ్గిస్తే సరిపోదు పొటాషియం పెంచితేనే హైబీపి తగ్గుతుంది, ఏ ఫుడ్స్ తింటే రక్తపోటు తగ్గుతుందంటే

0
​ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో పబ్లిష్ అయిన నివేదిక హైబీపి గురించి కొన్ని ముఖ్య విషయాలని వెల్లడించింది. నివేదిక ప్రకారం, బీపిని తగ్గించడానికి సోడియంని తగ్గించడమే కాకుండా పొటాషియం తీసుకోవడం హెల్ప్ చేస్తుంది. కేవలం సోడియం కంటే, సోడియం పొటాషియం నిష్పత్తులు గుండె సంబంధ సమస్యల ఫలితాలని కచ్చితంగా అంచనా వేస్తాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడించాయి. ఎక్కువగా సోడియాన్ని తీసుకుంటే హైబీపి మాత్రమే కాకుండా, గుండె సంబంధ సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి, సోడియాన్ని తగ్గిస్తూనే పొటాషియాన్ని పెంచుకోవాలని చెబుతున్నారు.

ప్రీ డయాబెటిస్ డైట్ చేస్తే సరిపోదు, డాక్టర్ చెప్పినట్లుగా చేస్తేనే బరువు తగ్గుతారు

0
​జాన్ హాప్కిన్స్ చేసిన ఓ అధ్యయనం కొన్ని ముఖ్య విషయాలని చెబుతోంది. అధికబరువు, ప్రీడయాబెటిస్ ఉన్నవారు టైమ్ రిస్ట్రిక్టడ్ డైట్ ఫాలో అయితే త్వరగా బరువు తగ్గుతారని తేలింది. అధ్యయనంలో నార్మల్ డైట్ ఫాలో అయ్యేవారిని 10 గంటల నార్మల్ డైట్‌ ఫాలో అయ్యేవారితో పోల్చింది. ఇందులో రెండు గ్రూపులూ ఒకే సంఖ్యలో కేలరీలు తీసుకున్నాయి. 12 వారాల తర్వాత రెండు గ్రూపులు కూడా బరువు తగ్గాయి. కానీ, రెండింటి మధ్య ఎక్కువ తేడా లేదు. గ్లూకోజ్, జీవక్రియ కొలతలలో కూడా తేడా లేదు.దీని గురించి శ్రీమతి వీణా వి(చీఫ్ క్లినికల్ డైటీషియన్ అండ్ హెచ్‌ఓడి – క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) చెబుతున్నారు.

దసరా + దీపావళి పండుగల వేళ ఇంటికి ఫెస్టివల్‌ లుక్‌ రావాలంటే చేయాల్సిన 5 మార్పులు!

0
పండుగలు వచ్చాయంటే ఇంటిని కొత్తగా, అందంగా మార్చుకోవాలని చాలామందికి అనిపిస్తుంది. దసరా, దీపావళి కూడా దగ్గర పడుతున్నాయి. పండుగంటే వేడుకల్లో బంధువులు, ఫ్రెండ్స్‌ సందడి చేస్తారు. ఈ వేడుకలకు ఇంటిని మరింత అందంగా ముస్తాబు చేయాలి. ఇందుకోసం కొత్త డెకరేషన్‌ వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇప్పటికే ఉన్న కుషన్‌ కవర్లు, కర్టెన్లు, టేబుల్‌ రన్నర్లు, రగ్గులు వంటి టెక్స్‌టైల్స్‌ను మార్చినా ఇంటి లుక్‌ పూర్తిగా మార్చొచ్చు.

ముఖ్యంగా భారతీయ సంప్రదాయ డిజైన్లు, హ్యాండ్‌లూమ్‌ టెక్స్‌టైల్స్‌, ఎంబ్రాయిడరీ వర్క్‌ వంటి వాటిని సరైన ప్రదేశాల్లో ఉపయోగిస్తే పండుగ వాతావరణం మరింత ఆహ్లాదంగా మారుతుంది. అయితే అన్ని వస్తువులకూ ఒకేసారి బోల్డ్‌ రంగులు, డిజైన్లు జోడిస్తే ఇల్లు ఎక్కువగా నిండిపోయినట్లు అనిపించవచ్చు. అందుకే కొన్ని ముఖ్యమైన టెక్స్‌టైల్స్‌ను మాత్రమే మార్చడం మంచిది. మరి ఇంటికి ఫెస్టివల్‌ లుక్‌ తీసుకురావడానికి ఎలాంటి చిన్న మార్పులు చేయవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పాలు తాగడం ఇష్టం లేదా అయినా ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఏమేం తాగొచ్చో తెలుసా

0
మన ముందుతరం వారు ఉన్నంత స్ట్రాంగ్‌గా మనం ఉండట్లేదు. అప్పటివారు ఇప్పటికీ ఎలాంటి కర్ర సాయం లేకుండా నడవగలరు. కానీ, ఇప్పుడు 30 దాటితే చాలు ఎముకల్లో నొప్పి, మోకాళ్ళ నొప్పులు అంటూ కంప్లైంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఎముకల్లో బలం లేకుండా, కావాల్సినంతా బలమైన ఆహారం తినకపోవడమే. ఎముకలు, దంతాలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే కాల్షియం అవసరం. కాల్షియం కేవలం ఎముకలు, దంతాలకే కాదు. గుండె, నరాలు, కండరాల పనితీరుని కూడా మెరుగ్గా చేస్తుంది. అయితే కాల్షియం పొందాలంటే వెంటనే వచ్చే సలహా పాలు తాగండి అని. కానీ, అందరికీ పాలు పడవుగా కొంతమందికి అలర్జీ ఉంటుంది. కొంతమందికి పాలు తాగడం ఇష్టం ఉండదు. అలాంటి వారు, కాల్షియం పొందాలంటే మాత్రం పాల మీద ఆధారపడకుండా కొన్ని ఫుడ్స్‌ని తీసుకోవచ్చో డాక్టర్ సుజాత స్టీఫెన్(చీఫ్ డైటీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) చెబుతున్నారు.

Aadhaar Name Change: వివాహం లేదా విడాకుల తర్వాత.. ఆధార్‌లో ఇంటిపేరు మార్చుకోవడం ఎలా? ఏ డాక్యుమెంట్లు కావాలి?

0
Aadhaar Name Change: భారతీయులకు ఆధార్ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇందులో ఏ చిన్న తప్పు ఉన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యం పేరులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. మరోవైపు.. పెళ్లి అయిన తర్వాత ఆడవారి ఇంటి పేరు మార్చుకుంటారు. అలాగే విడాకులు తీసుకున్న వారు తమ సర్ నేమ్ మార్చుకోవాలనుకుంటారు. మరి ఈ రెండు సందర్భాల్లో ఇంటి పేరు ఎలా మార్చుకోవాలి? ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి? అనే వివరాలు తెలుసుకుందాం.