Home Blog Page 33

విశాఖ To పాకిస్థాన్: శత్రుదేశానికి కీలక సమాచారం..ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంచలన ఆపరేషన్..!

భారత రక్షణ స్థావరాలకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ ఏజెంట్లకు లీక్ చేస్తున్న గూఢచర్య ముఠాను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పట్టుకుంది. ఈ దేశద్రోహ కుట్రను ఛేదించే క్రమంలో అధికారులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహించి, మొత్తం 18 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఆధారాలు రుజువు కావడంతో కోర్టు వీరిద్దరికీ అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వారిద్దరూ ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ జైల్లో ఉన్నారు.

గుండెల్ని పిండేస్తున్న వార్త.. ప్రాణాలతో పోరాడుతున్న ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్..!

సోషల్ మీడియా సెన్సేషన్ అగ్గిపెట్టె మచ్చ కిరణ్ అనారోగ్యంపై వస్తున్న వార్తలు నెటిజన్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్నటి వరకూ తనదైన శైలిలో అందరినీ కడుపుబ్బా నవ్వించిన కిరణ్.. ఇప్పుడు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలోని బెడ్‌పై ప్రాణాలతో పోరాడుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన్ని అక్టోబర్ 5న ఆస్పత్రిలో చేర్పించారు. కాకపోతే ఒక్కసారిగా అతని ఆరోగ్యం విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌‌పై ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నట్టు సమాచారం. దీంతో లక్షలాది మంది నెటిజన్లు కిరణ్‌ తిరిగి ఆరోగ్యంగా తీసుకురావాలని కోరుకుంటున్నారు.

తిరుమల: గాజు సీసాల్లో నీళ్ల విక్రయం వ్యాపారంగా మారిందా..? ఈ విషయం తెలియక భక్తులు నష్టపోతున్నారా?

తిరుమలలో భక్తులు రూ.20ల వాటర్ బాటిల్‌ని రూ.50లు పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ గాజు వాటర్ బాటిల్స్ మాత్రమే అమ్ముతారు. ప్లాస్టిక్ బ్యాన్ కారణంగా షాపుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండవు. అయితే బాటిల్స్‌లో వాటర్‌ని తాగేసి ఖాళీ గాజు సీసాను ఆ షాపువారికి ఇచ్చేస్తే.. రూ.30లు రిటర్న్ ఇచ్చేస్తారు. కానీ దూర ప్రాంతాల నుంచి వెళ్లే యాత్రికులు ఆ బాటిల్‌ను తిరిగి ఇవ్వడం మరిచిపోతారు. కొన్ని ప్రమాదవశాత్తు పగిలిపోతాయి. సరిగ్గా దీనినే వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని భక్తులు విమర్శిస్తున్నారు.

బ్రౌన్ ఎగ్స్ vs వైట్ ఎగ్స్.. హెల్త్‌కు ఏది మంచిది?

ఈరోజుల్లో చాలామంది బ్రౌన్ ఎగ్స్‌, వైట్ ఎగ్స్ కంటే ఎక్కువ హెల్తీ అని అనుకుంటున్నారు. కానీ కాదు. అదెలాగో తెలుసుకోండి.

సిల్క్‌ పిల్లో కవర్‌ వాడితే జుట్టుకి లాభమా?

సిల్క్‌ పిల్లో కవర్‌ ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. సిల్క్‌ పిల్లో కవర్‌కు జుట్టుతో రాపిడి తగ్గి జుట్టు రాలడం, జుట్టు బ్రేక్‌ అవ్వడం వంటి సమస్యలు తగ్గుతాయి.

AI కాలంలో రాణించాలంటే నేర్చుకోవాల్సిన స్కిల్స్

AI బూమ్ వల్ల ఉద్యోగం పోతుందని భయంగా ఉందా. అయితే స్కిల్స్ నేర్చుకోండి. AI వల్ల ఎలాంటి నష్టం ఉండదు.

పిల్లలకు నేర్పించాల్సిన డబ్బు పాఠాలు ఇవే

18 ఏళ్లు నిండక ముందే పిల్లలకు నేర్పించాల్సిన డబ్బు పాఠాల గురించి ఇక్కడ వివరించాం. ఈ డబ్బు పాఠాలు నేర్పించడం వల్ల పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.

దసరాకు బెస్ట్ డ్రెస్సులు.. రిచ్ లుక్ కోసం!

దసరా, దీపావళికి మీ డ్రెస్ బాగుండాలా. అయితే ఈ ఎథ్నిక్ కాంబినేషన్ ఐడియాలు చూడండి. మీకు తక్కువ ఖర్చులో రాయల్ లుక్ లభిస్తుంది.

రవితేజ – వివేక్ ఆత్రేయ మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా జేడీ చక్రవర్తి?

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘తులాభారం’లో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి విలన్‌‌గా లేదా కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 1999 నాటి ‘ప్రేమకు వేళాయెరా’ చిత్రంలో జేడీ చక్రవర్తి హీరోగా చేయగా, రవితేజ సహాయ పాత్రలో కనిపించారు. కట్ చేస్తే 26 ఏళ్ల తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన రవితేజతో జేడీ చక్రవర్తి ప్రతినాయకుడిగా తలపడనుండటం విశేషం. దీనిని నెటిజన్లు బండ్లు ఓడలవ్వడం అంటే ఇదే అంటూ పోలుస్తున్నారు. వివేక్ ఆత్రేయ మార్క్‌తో రానున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Jim Jim Tara: నెట్టింట మార్మోగుతోన్న ‘జిమ్ జిమ్ తార’.. ‘పర్ణశాల’ టీమ్ మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్కెచ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోన్న ‘జిమ్ జిమ్ తార’ పాటని హారర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ‘పర్ణశాల’ చిత్రం ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. ఎస్ఎల్టీ ఫిలిమ్స్ పతాకంపై వై.జి. భరత్ దర్శకత్వంలో మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీదేవితో పాడించిన ఈ పాట ఆర్గానిక్‌గా నేరుగా ప్రేక్షకుల నోళ్లలో నానడం విశేషం. ఎలాంటి ఖరీదైన పెయిడ్ ప్రమోషన్లు లేకుండానే వైరల్ అయిన ఈ పాట ట్రెండ్‌ను పట్టుకుని చిత్ర బృందం దీనినే ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకుంది. ఈ వినూత్న మార్కెటింగ్ ఎత్తుగడతో సినిమాకు థియేట్రికల్, బిజినెస్ పరంగా భారీ బజ్ ఏర్పడింది.