Home Blog Page 32

Today Panchangam 07 October 2026: ఈరోజు నక్షత్రం, తిథి, యోగం, శుభ ముహుర్తాలు, రాహుకాలం వివరాలివే

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని ద్వాదశి తిథి నాడు, బుధవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ 4 రాశుల వారు డబ్బును ఆదా చేయడమే కాదు, తమ తెలివితేటలతో ఆర్థికంగా ఎదుగుతారు! ఈ జాబితాలో మీ రాశి ఉందా?

మనలో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. డబ్బు లేనిదే జీవితం అనేదే ముందుకు సాగదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆర్థిక పరంగా బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరు వ్యక్తులు సంపాదించే సమయంలోనే పొదుపు చేస్తే, మరికొందరు తమ దగ్గర ఉన్న డబ్బును జాగ్రత్తగా మ్యానేజ్ చేస్తుంటారు. కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు చేస్తూ, భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేస్తుంటారు. అందుకే ఆర్థిక క్రమశిక్షణ ఉన్న ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గురించి భయపడకుండా నిశ్చితంగా గడిపేస్తుంటారు. ఇంకా కొంతమంది వ్యక్తులు తమ దగ్గర ఉన్న డబ్బును తెలివితేటలతో దాన్ని రెట్టింపు చేసేందుకు ఏదైనా రంగంలో పెట్టుబడి పెడుతుంటారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారికి గ్రహాల ప్రభావం బట్టి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ఏ రాశుల వారు ఆర్థిక పరమైన రంగంలో మెరుగ్గా రాణిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Rahu Ketu Nakshatra Gochar 2026: రాహువు కేతువుల నక్షత్ర మార్పుతో ఈ 4 రాశులకు సొంతింటి, ఉద్యోగావకాశాలు

Rahu Ketu Nakshatra Gochar 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు, కేతువులను ‘‘ఛాయ గ్రహాలు’’గానే కాకుండా అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఎల్లప్పుడూ తిరోగమనంలో సంచారం చేస్తుంటాయి. రాహువు, కేతువులు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేందుకు దాదాపు ఏడాదిన్నర అంటే 18 నెలల సమయం పడుతుంది. ఇవి ఒక వ్యక్తి జీవితంలో అకస్మాత్తుగా పెద్ద మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. కొందరికి ఊహించని లాభాలు రాగా, మరికొందరికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3న రాహువు ధనిష్ఠ నక్షత్రంలో మూడో పాదంలోకి ప్రవేశించాడు. మరోవైపు కేతువు మాఘ నక్షత్రం మొదటి పాదంలోకి మారారు. రాహు కేతువులు ఈ ప్రత్యేక స్థానాల్లో సంచారం చేసే సమయంలో కొన్ని రాశుల వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాహువు, కేతువుల నక్షత్ర మార్పుతో ఏ రాశుల వారికి ప్రయోజనాలు చేకూరనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సెంచరీతో సర్పంచ్ సాబ్ విధ్వంసం.. తొలి టీ20లో విండీస్ చిత్తు..!

0
లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలోనే ఊదేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102* రన్స్ చేసి విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్ (37*)తో కలిసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.

అరంగేట్ర మ్యాచ్‌లో నమన్ ధీర్ సంచలన బౌలింగ్.. 19.1 ఓవర్లలో వెస్టిండీస్ ఆలౌట్..!

0
లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి వెస్టిండీస్‌ను 171 పరుగులకే పరిమితం చేశారు. విండీస్ బ్యాటర్లలో షైయ్ హోప్ (52), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (56) అర్ధశతకాలతో పోరాడినప్పటికీ, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి కట్టడి చేశారు. భారత బౌలింగ్ విభాగంలో నమన్ ధీర్ 3 వికెట్లతో సత్తా చాటగా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

సర్వీస్ కమిషన్ ఆఫీసర్‌‌నని నమ్మించి.. ఆప్ నాయకుడ్ని పెళ్లాడి నగలతో పరారైన కి‘లేడి’

0
తనకు పరిచయమైన మహిళ.. ప్రభుత్వ అధికారిణి అంటే నమ్మి మోసపోయాడు ఓ రాజకీయ నేత. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి అసెంబ్లీ స్పీకర్ సహా రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా హాజరయ్యారు. కానీ, చివరకు ఆమె అతడ్ని నిలువునా ముంచేసింది. ఇంటిలోని బంగారు నగలు, వెండి సహా విలువైన వస్తువులతో ఉడాయించింది. చివరకు ఆమె తనను మోసం చేసిందని ఆలస్యంగా గ్రహించిన అతడు లబోదిబోమంటున్నాడు. విచిత్రమైన ఈ ఘటన పంజాబ్‌లో వెలుగుచూసింది.

తమిళనాడులో SIR‌పై మీ వైఖరేంటి? ఢిల్లీలో నిరసనల వేళ రాహుల్ గాంధీపై డీఎంకే విమర్శలు

0
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తర్వాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దుచేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇందులో తమిళనాడు సైతం ఉంది. అక్కడ విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అయితే, ఈ విషయంలో ఖర్గే వాదనను రాహుల్ ఎందుకు సమర్ధించడం లేదని మాజీ మిత్రపక్షం డీఎంకే ప్రశ్నించింది. అంతేకాదు, తమిళనాడు ఎస్ఐఆర్‌పై ఆయన వైఖరేంటి? అని నిలదీసింది. ఇండియా కూటమి నిరసన వేళ ఈ విమర్శలకు ప్రాధాన్యత ఏర్పడింది.

విజయవాడ దసరా వైభవానికి రండి.. తమిళనాడు సీఎం విజయ్‌కు ప్రతినిధి బృందం ఆహ్వానం

విజయవాడ దసరా ఉత్సవాల్లో పాల్గొనమని కోరుతూ తమిళనాడు సీఎం విజయ్‌కు నిర్వాహక బృందం ఆహ్వానించింది. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ వైభవాన్ని స్వయంగా వీక్షించాలని ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. సీఎం విజయ్‌ని ఆహ్వానించిన బృందంలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీష్ బాలయోగి కూడా ఉన్నారు. కాగా ఇంద్రకీలాద్రిపై ఇప్పటికే దసరా సందడి మొదలైపోయింది. శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఘనంగా జరగనున్నాయి. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల సన్నాహాలు చేస్తున్నారు.

ఏపీ స్థానిక ఎన్నికలు: ఎలక్షన్ వ్యయ పరిమితి ఖరారు, గైడ్‌లైన్స్ జారీ చేసిన ఎస్‌ఈసీ

ఏపీ స్థానిక ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌ని రిలీజ్ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చుపై పరిమితిని ప్రకటించింది. ఎస్‌ఈసీ సూచించిన పరిమితికి మించి ఎవరూ ఖర్చు చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల నోటీఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఓటర్ల ప్రలోభ పెట్టే చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలియజేసింది. డబ్బు, మద్యం, గిఫ్ట్‌లు పంపిణీ చేయడం వంటి వాటిపై నిఘా ఉంటుందని తెలిపింది.

విశాఖ To పాకిస్థాన్: శత్రుదేశానికి కీలక సమాచారం..ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంచలన ఆపరేషన్..!

భారత రక్షణ స్థావరాలకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ ఏజెంట్లకు లీక్ చేస్తున్న గూఢచర్య ముఠాను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పట్టుకుంది. ఈ దేశద్రోహ కుట్రను ఛేదించే క్రమంలో అధికారులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహించి, మొత్తం 18 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఆధారాలు రుజువు కావడంతో కోర్టు వీరిద్దరికీ అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వారిద్దరూ ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ జైల్లో ఉన్నారు.