పండుగలు వచ్చాయంటే ఇంటిని కొత్తగా, అందంగా మార్చుకోవాలని చాలామందికి అనిపిస్తుంది. దసరా, దీపావళి కూడా దగ్గర పడుతున్నాయి. పండుగంటే వేడుకల్లో బంధువులు, ఫ్రెండ్స్ సందడి చేస్తారు. ఈ వేడుకలకు ఇంటిని మరింత అందంగా ముస్తాబు చేయాలి. ఇందుకోసం కొత్త డెకరేషన్ వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇప్పటికే ఉన్న కుషన్ కవర్లు, కర్టెన్లు, టేబుల్ రన్నర్లు, రగ్గులు వంటి టెక్స్‌టైల్స్‌ను మార్చినా ఇంటి లుక్ పూర్తిగా మార్చొచ్చు.
ముఖ్యంగా భారతీయ సంప్రదాయ డిజైన్లు, హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్, ఎంబ్రాయిడరీ వర్క్ వంటి వాటిని సరైన ప్రదేశాల్లో ఉపయోగిస్తే పండుగ వాతావరణం మరింత ఆహ్లాదంగా మారుతుంది. అయితే అన్ని వస్తువులకూ ఒకేసారి బోల్డ్ రంగులు, డిజైన్లు జోడిస్తే ఇల్లు ఎక్కువగా నిండిపోయినట్లు అనిపించవచ్చు. అందుకే కొన్ని ముఖ్యమైన టెక్స్‌టైల్స్‌ను మాత్రమే మార్చడం మంచిది. మరి ఇంటికి ఫెస్టివల్ లుక్ తీసుకురావడానికి ఎలాంటి చిన్న మార్పులు చేయవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..


