HomeEntertainmentతెలంగాణ సినిమా, ఆంధ్రా సినిమా అనడం ఫ్యాషన్ అయిపోయింది.. ఉన్నది తెలుగు సినిమా ఒక్కటే -...

తెలంగాణ సినిమా, ఆంధ్రా సినిమా అనడం ఫ్యాషన్ అయిపోయింది.. ఉన్నది తెలుగు సినిమా ఒక్కటే – నరేష్

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చిత్రాలను ప్రాంతాలు, యాసల వారీగా విభజించి ప్రచారం చేయడాన్ని సీనియర్ నటుడు వీకే నరేష్ తప్పుపట్టారు. ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర సినిమాలు అనడం పరిశ్రమలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని విమర్శించారు. సంగీతానికి, కథకు ప్రాంతీయ సరిహద్దులు ఉండవని, మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ప్యాషన్‌తో ఆదరిస్తారని స్పష్టం చేశారు. ‘గరివిడి లక్ష్మి’ యావత్ తెలుగువారి మట్టి వాసనను ప్రతిబింబిస్తుందని పేర్కొన్న ఆయన, ఈ దసరాకు సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments