ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం బిగ్ డెసిషన్ తీసుకుంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని జట్టు నూతన హెడ్ కోచ్‌గా నియమించింది. గత రెండు సీజన్లుగా ఉన్న హేమంగ్ బదానీ స్థానాన్ని దాదా భర్తీ చేయనున్నారు. 2019 నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీతో అనుబంధం ఉన్న గంగూలీ, ఇప్పటివరకు ట్రోఫీ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజేతగా నిలబెట్టేందుకు తన మార్క్ వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నారు.


