అగ్ని ప్రమాదాలు లేదా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్లను మోహరిస్తారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఈ ఫైర్ ఇంజిన్ సాయంతో ఓ ఎమ్మెల్యే తన బంగ్లాను శుభ్రం చేయించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో దుమారం రేగుతోంది. ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి.. అర్జెంటుగా ఫైర్ ఇంజిన్ పంపాలని కోరారని, తీరా అక్కడకు వెళ్లేసరికి ఇంటిని శుభ్రం చేయమన్నారని అధికారులు తెలిపారు.
ఫైర్ ఇంజిన్‌తో బీజేపీ ఎమ్మెల్యే బంగ్లా క్లీనింగ్.. గుజరాత్‌లో రచ్చరచ్చ.. వీడియో వైరల్
RELATED ARTICLES


