Gottipati Ravi Kumar On AE And Lineman Posts Recruitment: ఏపీ విద్యుత్‌శాఖలో ఉద్యోగాల భర్తీపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 629 ఏఈ పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు.. ఇటు లైన్‌మెన్ ఉద్యోగాలను కూాడా భర్తీ చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అలాగే విద్యుత్‌శాఖలోకిసచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకున్నామన్నారు మంత్రి రవికుమార్.
తిరుచానూరు ఆలయంలో మావటిపై ఏనుగు దాడి.. శ్రీనిధి కోపంతో దాడి చేయడానికి కారణం ఏంటో తేల్చిన డాక్టర్లు
Tiruchanur Temple Elephant Attacks Caretaker Due To Hormonal Influences: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏనుగు దాడి ఘటనపై టీటీడీ అలర్ట్ అయ్యింది. తిరుపతి ఎస్వీ జూపార్క్ పశువైద్యుల బృందం, గోశాల అధికారులు శ్రీనిధి ఏనుగును పరిశీలించి, అవసరమైన పరీక్షలు నిర్వహించారు. హర్మోన్ల కారణంగానే ఏనుగు మావటిపై దాడిచేసినట్లు నిర్ధారించారు. వారం రోజుల పాటూ ఈ ఏనుగును మనుషులకు దూరంగా ఉంచాలని డాక్టర్లు సూచించారు. మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
కర్నూలులో కొత్తగా UIDAI కేంద్రం ఏర్పాటు.. ఆధార్ సవరణల కోసం హైదరాబాద్ వెళ్లక్కర్లేదు, ఈ సేవలన్నీ అందిస్తారు
New Aadhaar Seva Kendra In Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లావాసుల ఆధార్ కార్డుల కష్టాలు తీరాయి.. ఆధార్ కార్డుకు సంబంధించిన సవరణలతో పాటుగా ఇతర సేవల కోసం హైదరాబాద్ వెళ్లే పని లేకుండా ఏపీ ప్రభుత్వం ఆధార్ సేవ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ ఆధార్ కార్డుకు సంబంధించి అన్ని రకాల సవరణలు చేసుకోవచ్చు. కొత్త ఆధార్ కార్డు నమోదు నుంచి వివరాలు అప్డేట్ చేసుకునే వరకు అన్ని సర్వీసులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు.. జోన్లు, డివిజన్లు, సరిహద్దులివే.. ఉత్తర్వులు జారీ
AP Govt Forms New Police Commissionerates In Four Cities:ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు జీవోలు వచ్చేశాయి. ఐజీ/డీఐజీ స్థాయి అధికారులు కమిషనర్‌లుగా వ్యవహరిస్తారని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన కమిషనరేట్లకు సంబంధించిన జోన్లు, డివిజన్లు, సరిహద్దులపై స్పష్టత ఇచ్చారు. కొత్తగా పోస్టులు ఉండవు.. ఉన్నవారినే సర్దుబాటు చేశారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌పై ద్రోణి ప్రభావం.. నేడు మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
Andhra Pradesh Weather Today: గత నెలలో తీవ్ర వాయుగుండం తర్వాత ఏపీలో మళ్లీ ఎండల తీవ్రత కనిపిస్తోంది. కొద్దిరోజులుగా జనాలు ఎండలతో అల్లాడిపోతున్నారు. తాజాాగా ద్రోణి విస్తరించడంతో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతారణశాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. ఇవాళ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ఏపీలో వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
టీటీడీపై దుష్ప్రచారం.. నెల రోజుల క్రితం జరిగింది.. ప్రజలు నమ్మొద్దు, ఏం జరిగిందో చెప్పిన ఫ్యాక్ట్ చెక్ టీమ్
AP Fact Check Respond On TTD Deaf ITI College Tirupati Incident: తిరుపతిలోని టీటీడీ బధిర ఐటీఐలో విద్యార్థులతోనే వంట, ఇతర పనులు చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల్ని వేకువజామున 3 గంటలకే నిద్ర లేపి పనులు చేయిస్తున్నారని సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగిందన్నారు. ఇప్పటికే తప్పుచేసిన వారిపై చర్యలకు ఆదేశించామని తెలిపారు.
తిరుమల శ్రీవారికి మాజీ మంత్రి భారీ విరాళం.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.కోటి ఇచ్చారు
K Satyanarayana Raju Rs 1 Crore Donation To TTD SV Annaprasadam Trust: తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. మాజీ మంత్రి కె సత్యనారాయణరాజు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ ఈవోొ రవిచంద్రకు విరాళాన్ని డీడీ రూపంలో ఇచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో రవిచంద్ర సమీక్ష నిర్వహించారు..కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
Raaka: తెలుగులో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అల్లు అర్జున్ ‘రాకా’ని ఆస్కార్‌కు తీసుకెళ్తానన్న డైరెక్టర్ అట్లీ
విజయ్ సేతుపతి హీరోగా అట్లీ సమర్పణలో వచ్చిన తమిళ చిత్రం ‘బత్తా’. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా త్వరలోనే తెలుగులో విడుదల కానుంది. ఈ విషయాన్ని అట్లీ కన్ఫార్మ్ చేశారు. ఇక సక్సెస్ మీట్‌లో అట్లీ మాట్లాడుతూ.. ‘బత్తా’తో పాటు అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ చిత్రాన్ని కూడా ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఆస్కార్ స్టేజ్ మీద తమిళంలోనే మాట్లాడతానని మాటిచ్చారు.

