Home Blog Page 39

Chiranjeevi Kaaka: చిరంజీవి ‘కాకా’ మూవీలో ‘మహారాజ’ విలన్.. పవర్ ఫుల్ రోల్‌లో పవర్ హౌస్..

Chiranjeevi’s Kaaka Movie: చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో కెవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘కాకా’. ఇందులో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘మహారాజ’ చిత్రంలో నెగెటివ్ పాత్రతో మెప్పించిన ఆయన రాకతో ఈ హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌కు మరింత ఇంటెన్సిటీ పెరుగుతుందని దర్శకుడు బాబీ భావిస్తున్నారు. కదిరి కాళిదాస్‌గా చిరంజీవి కనిపిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Jailer 2 Trailer: రజనీకాంత్ ‘జైలర్ 2’ ట్రైలర్.. మళ్లీ వేట ప్రారంభించిన టైగర్ ముత్తువేల్ పాండియన్

Rajinikanth’s Jailer 2 Trailer: సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా అక్టోబర్ 15న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ తిరిగొచ్చిన ఈ సీక్వెల్‌లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి స్పెషల్ రోల్స్ చేశారు.

Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.400 కోట్ల కలెక్షన్స్.. ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ చూశారా!

Hanuman Ansh Telugu Trailer: హిందీలో సంచలనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం తెలుగు విడుదలకి సిద్ధమైంది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ అక్టోబర్ 9న తెలుగులో రిలీజ్ చేయనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా విడుదల చేసిన తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

PNB ఉత్సవ్ ఫెస్టివల్ ఆఫర్.. తక్కువ వడ్డీకే ‘హోమ్, కార్ లోన్లు’.. 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు, వివరాలివే!

0
PNB Festival Loan Offer 2026: దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్ తీసుకొచ్చింది. తక్కువ వడ్డీకే గృహ రుణాలు, కారు లోన్స్ అందించడంతో పాటు 100 శాతం ప్రాసెసింగ్ మాఫీ చేసింది. ఈ రుణాలు తీసుకునే వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. మరి ఈ దసరా, దీపావళి పండుగల సీజన్‌లో పీఎన్‌బీలో ఉన్న రుణ ఆఫర్ల గురించిన వివరాలు తెలుసుకుందాం.

దేశంలోనే తొలిసారి BSNL నుంచి సరికొత్త ప్లాన్.. 25+ ఓటీటీల్లో నచ్చినవి ఎంచుకోవచ్చు.. భారత్ ఫైబర్ కోసం కొత్త పోర్టల్!

0
BSNL Bharat Fiber: దేశంలోనే తొలిసారి సరికొత్త ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. టెలికాం రంగంలోనే మొట్టమొదటి యూజర్ ఛాయిస్ ప్లాన్ లాంచ్ చేసింది. భారత్ ఫైబర్ తీసుకున్న వారు 25కు పైగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో తమకు నచ్చిన ఓటీటీలను ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. అందుకు తగినట్లుగానే ఛార్జీలు చెల్లించే వెసులుబాటు తెచ్చింది. మరి బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ఆఫర్ గురించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Tax Notice: ఒకే బ్యాంకులో 3 ఖాతాల్లో డబ్బులేశాడు.. ట్యాక్స్ నోటీసు పంపిన ఐటీ శాఖ.. 10 ఏళ్ల పోరాటం చేసిన తర్వాత ITAT తీర్పు!

0
Tax Notice: ఏదైనా ఆర్థిక లావాదేవీ నిర్వహించేందుక్ బ్యాంకు అకౌంట్ ఉండాలి. తమ వద్ద ఉన్న డబ్బులను అకౌంట్లో వేసి అవసరమైనప్పుడు వాడుకుంటాం. అయితే, ఒకే బ్యాంకులోని అకౌంట్లలో డబ్బులు జమ చేసినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డారు. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి ఐటీ నోటీసులు వచ్చాయి. వీటిపై దాదాపు 10 ఏళ్ల పోరాటం చేసిన తర్వాత ఐటీఏటీ కీలక తీర్పు ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్ కంపెనీతో సచిన్ టెండూల్కర్ మ్యాజిక్! రూ.5 కోట్లు పెడితే 3 ఏళ్లకే రూ.130 కోట్లు.. ఇంకా దూసుకెళ్తున్న ఆజాద్ ఇంజనీరింగ్ స్టాక్

0
Azad Engineering: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పిచ్ పైనే కాదు పెట్టుబడి వ్యూహాల్లోనూ మాస్టర్ బ్లాస్టరే. ఒక తెలివైన పెట్టుబడి మూడేళ్లలోనే 270 శాతానికి పైగా లాభాలు అందించింది. ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీలో రూ.5 కోట్లతో షేర్లు కొనుగోలు చేయగా ఇప్పుు ఆ విలువ రూ. 130 కోట్లకు పైగా అయింది. చాలా తక్కువ సమయంలో ఈ కంపెనీ స్టాక్ దూసుకెళ్లింది. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

వారసత్వ ఆస్తిపై 55 శాతం పన్ను.. తెరపైకి కొత్త ప్రతిపాదన.. సామాన్యులు, ధనవంతుల్లో ఎవరిపై ప్రభావం?

0
Inheritance Tax: తాతముత్తాతలు, తల్లితండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తిపై భారత్‌లో ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అయితే, ప్రపంచంలోని దిగ్గజ దేశాలకు భారత్ పోటీ ఇవ్వాలంటే వారసత్వంగా వచ్చే ఆస్తిపై పన్ను ఉండాలని, 55 శాతం మేర ట్యాక్స్ విధించాలని హాట్‌మెయిల్ ఫౌండర్ సబీర్ భాటియా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో తీవ్ర చర్చ మొదలైంది. అయితే, ఈ ట్యాక్స్ ధనవంతులు, సామాన్య మధ్య తరగతి ప్రజల్లో ఎవరిపై ప్రభావం పడుతుంది?

కో-పైలట్ తీవ్రవాద భావజాలంపై ముందే హెచ్చరించిన ఒమాన్.. దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు

గతవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో జరిగిన ఘటన మరోసారి ఎయిర్‌లైన్స్‌లో భద్రతపై ఆందోళన రేకెత్తించింది. విమానాన్ని హైజాక్ చేయడానికి కో-పైలట్ ప్రయత్నించి, ఈ క్రమంలో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేశాడు. ఒమాన్ జాతీయుడైన అతడ్ని.. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానం నడపడానికి ఎలా అనుమతించారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమాన్ అధికారులు అతడి గురించి కీలక విషయాలను వెల్లడించారు. ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడవుతున్నట్టు గ్రహించి ఏవియేషన్ రంగానికి దూరంగా ఉంచామని చెప్పారు.

Brain ‘మానవ మెదడు’ రెండు వేర్వేరు అవయవాల కలయిక.. 55 కోట్ల సంవత్సరాల తర్వాత వెలుగులోకి

శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు మెదడును ఒకే అవయవంగా భావిస్తూ వచ్చారు. కానీ, తాజాగా ఓ పరిశోధన.. మనం మెదడు వందల మిలియన్ల సంవత్సరాలుగా స్వతంత్రంగా పరిణామం చెందిన రెండు విభిన్న అవయవాలని వెల్లడించింది. ఈ ఆవిష్కరణ మెదడు అభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న భావనను తలక్రిందులు చేస్తుంది. ప్రారంభ దశలో ఒకే ఒక మూల కణం ఉంటుందని, అదే మొత్తం మెదడుగా రూపాంతరం చెందుతుదననే సిద్ధాంతాన్ని విశ్వసిస్తూ వచ్చారు. కానీ, అది తప్పని తాజా పరిశోధన బయటపెట్టింది.