Home Blog Page 145

OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీ.. సడెన్‌గా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే?

0

OTT Horror Thriller: ఓటీటీలో లేటెస్ట్ తెలుగు మిస్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను జీ5 ఓటీటీ సడెన్ గా అనౌన్స్ చేసింది.

Danny First Strike: నాకు బీచ్ అన్నా అమ్మాయి బ్యాక్ అన్నా చాలా ఇష్టం.. బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌గా డానీ ఫస్ట్ స్ట్రైక్

0

Danny First Strike Released: ‘నాటకం’, ‘కళింగ’ చిత్రాల సక్సెస్‌ఫుల్ కాంబో ఆశిష్ గాంధీ, కళ్యాణ్‌జీ గోగణ కలయికలో వస్తున్న లేటెస్ట్ బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘డానీ’. తాజాగా రిలీజ్ అయిన డానీ ఫస్ట్ స్ట్రైక్ టీజర్.. బోల్డ్ డైలాగ్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో అట్రాక్ట్ చేస్తోంది.

మీ ఇంట్లోని గ్యాస్ పైపును ఎన్నేళ్లకు ఒకసారి మార్చాలో తెలుసా? అసలు రూల్స్ ఇవే!

0
వంటగది ప్రతి ఇంట్లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. కుటుంబం మొత్తానికి ఆహారం సిద్ధమయ్యే ఈ చోటును సురక్షితంగా ఉంచుకోవడం మన బాధ్యత. వంటగదిలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది గ్యాస్ రెగ్యులేటర్ల నాణ్యతపై దృష్టి పెడతారు కానీ, గ్యాస్ హోస్ అదేనండీ పైపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. నాణ్యత లేని పైపులు లేదా పాతబడిన పైపుల వల్ల ఇంట్లో పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఎల్లప్పుడూ ISI మార్క్ ఉన్న నాణ్యమైన పైపులను మాత్రమే ఎంచుకోవాలి. అయితే, చాలా మంది గ్యాస్ పైపును ఏళ్ల తరబడి ఉపగియోగిస్తుంటారు. గ్యాస్ కంపెనీలతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ పైపును ఎన్నేళ్లకి ఒకసారి మార్చాలో తెలుసుకుందాం.

ధర్మవరంలో వినాయక నిమజ్జన విషాదం: DJ హోరు, మద్యం మత్తులో ట్రాక్టర్ బీభత్సం.. చిన్నారి వర్షిత దుర్మరణం!

ధర్మవరం పట్టణంలో వినాయక నిమజ్జనం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం శివనగర్ బ్రహ్మంగారి గుడి పరిధిలోని శారదా నగర్ నుంచి కదిరి గేట్ వైపు జరుగుతున్న ఊరేగింపులో అదుపుతప్పిన ట్రాక్టర్ చిన్నారులపై దూసుకెళ్లడంతో 9 ఏళ్ల చిన్నారి వర్షిత అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారంతా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అసలేం జరిగింది

ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల కథనం ప్రకారం.. విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా ముందు చక్రాలను గాలిలోకి లేపి విన్యాసం చేయబోయాడు. అదే సమయంలో DJ సౌండ్ కు ముందు భాగంలో డ్యాన్స్ చేస్తున్న చిన్నారులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. చిన్నారి వర్షిత తలపై నుంచి ట్రాక్టర్ చక్రం వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయింది.తెర వెనుక ఉన్న వైఫల్యం ఇదే..

1. తాగి తూలిన డ్రైవర్లు, మార్మోగిన DJ సౌండ్: నిమజ్జనం పేరుతో కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు, కమిటీ సభ్యులు మద్యం సేవించి తూలుతూ వాహనాలు నడిపారని, 55 డెసిబుల్స్ కు మించకూడని DJ సౌండ్ ను 150 డెసిబుల్స్ కు పైగా పెట్టి నిబంధనలు ఉల్లంఘించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

2. ఎస్పీ ఆదేశాలు పక్కా.. అమలు మాత్రం శూన్యం: జిల్లా ఎస్పీ గారు నిమజ్జనాల వేళ DJ సౌండ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై పక్కా ఆదేశాలు ఇచ్చినా, టూ టౌన్ పోలీసుల స్థాయిలో అమలు పూర్తిగా విఫలమైంది. ఘటనా స్థలంలో ముందస్తు బందోబస్తు లేదు, బారికేడ్లు లేవు, బ్రీత్ ఎనలైజర్ తనిఖీలు లేవు. ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు.మంత్రి ఇలాకాలోనే అపశృతి.. మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరగడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటన అనంతరం మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.అయితే ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. ప్రాణం పోయిన తర్వాత పరామర్శలు కాదు, ప్రాణం పోకుండా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు?ప్రజల డిమాండ్:మద్యం సేవించి నడిపిన డ్రైవర్ పై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి.నిబంధనలు ఉల్లంఘించిన DJ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి.నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై విచారణ జరపాలి.చిన్నారి వర్షిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించాలి..

నిమ్మకూరులో జేఈఈ, నీట్‌ అకాడమీ ఏర్పాటు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

0
Jee And Neet Academy In Nimmakuru Aprjc: ఏపీ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) 59వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అకడమిక్ ఎక్సలెన్స్ పై దృష్టి సారించాలని అధికారులను, ఉపాధ్యాయులకు సేచించారు. రాష్ట్రంలో 10 ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా అభివృద్ధి చేసేందుకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదం తెలిపింది. నిమ్మకూరులో ఐఐటీ జేఈఈ/నీట్ అకాడమీ ఏర్పాటుకు ఆమోదించారు.

తెలంగాణ పేదలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రాష్ట్రానికి 2 లక్షల PMAY-G ఇళ్లు

0

తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్రం PMAY-G పథకం కింద తొలి విడతగా 2 లక్షల ఇళ్లను కేటాయించింది. రాష్ట్రంలో ఆవాస్ సర్వే ద్వారా 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించగా.. వారికి ఇళ్లను మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతున్న నేపథ్యంలో PMAY-G ఇళ్లు తోడైతే పేదలకు పక్కా నివాసంతోపాటు మరుగుదొడ్డి, ఇతర ప్రాథమిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలతో ప్రయోజనం కలగనుంది.

సికింద్రాబాద్‌-వరంగల్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌‌‌ మార్గంలో 4 రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఆదివారం రోజున రద్దీగా ఉండే కీలక మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్టుగా ప్రకటించింది. మరోవైపు ప్రయాగ్‌రాజ్ – తిరునెల్వేలి వయా ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లునడుస్తాయి.

Residence Certificate Update : ఆధార్, రేషన్ కార్డులే అడ్రస్‌ ప్రూఫ్‌.. రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం లేదు!

తహశీల్దార్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవడంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆధార్, రేషన్ కార్డులను అడ్రస్‌ ప్రూఫ్‌లుగా చూపించవచ్చని తెలిపింది.

కడప జిల్లాకు కేంద్రమంత్రి గడ్కరీ తీపికబురు.. రూ.304 కోట్లతో నాలుగు వరుసల హైవే నిర్మాణం

0
Kopparthi Kadapa Four Lane Road Rs 304 Crores: ఏపీకి సంబంధించి హైవేపై కేంద్రమంత్రి గడ్కరీ తీపికబురు చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాన్ని కడప బైపాస్‌కు అనుసంధానించేలా 4 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రూ.304.44 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 5.8 కిలోమీటర్ల పొడవున ‘యాక్సెస్ కంట్రోల్డ్ హైవే’ను నిర్మించనున్నారు. ఒక ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్, రెండు భారీ వంతెనలు, నాలుగు వెహిక్యులర్ అండర్‌పాస్‌లు.. ప్రస్తుతం ఉన్న కడప బైపాస్‌ను కూడా షోల్డర్స్‌తో అభివృద్ధి చేయనున్నారు.

Bigg Boss 10 Voting: బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు- టాప్ 2 నుంచి టాప్ 1కి ఎగబాకిన హీరో- ఆ ఇద్దరికి డబుల్ ఎలిమినేషన్ గండం!

0

Bigg Boss Telugu 10 Voting This Week: బిగ్ బాస్ ఓటింగ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టాప్ 2 నుంచి టాప్ 1లోకి హీరో ఒక్కసారిగా ఎగబాకాడు. ఇప్పటివరకు టాప్ 1లో ఉన్న కంటెస్టెంట్ కిందకు పడిపోవడం, ఈ వారం ఇద్దరికి డబుల్ ఎలిమినేషన్ గండం ఉండటం మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.