Home Blog Page 114

తెలంగాణలో మరో 41 కొత్త బార్లు.. హైదరాబాద్‌లోనే 14, వచ్చే నెల 12 వరకు దరఖాస్తులు

0
తెలంగాణలో కొత్త బార్ లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41 కొత్త 2బీ బార్ లైసెన్సులకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలోని టీసీయూఆర్ ప్రాంతంలోనే 14 బార్లు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష రుసుము చెల్లించాలి. ఈనెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రాంతాన్ని బట్టి వార్షిక ఎక్సైజ్ ఫీజు రూ.30 లక్షల నుంచి రూ.44 లక్షల వరకు నిర్ణయించారు.

రాశిఫలాలు 28 సెప్టెంబర్ 2026: ధ్రువ యోగం ప్రభావంతో మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి!

0
రాశిఫలాలు 28 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ధ్రువ, వ్యాఘతా యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శివయ్యకు అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 28 September 2026: ఈరోజు నక్షత్రం, తిథి, యోగం, శుభ ముహుర్తాలు, రాహుకాలం వివరాలివే

0
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని విధియ తిథి నాడు, సోమవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయా షేర్.. వింటేజ్ మోడ్‌లో విరాట్ విధ్వంసం.. తొలి వన్డేలో విండీస్ చిత్తు..!

0
తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన 296 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 41.4 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (110) క్లాస్ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ (88 బంతుల్లో 139 నాటౌట్, 9 సిక్సర్లు) రౌద్రరూపంతో విరుచుకుపడి తన 55వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

గ్రీవెస్ మెరుపు సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన విండీస్..!

0
తిరువనంతపురంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌కు వెస్టిండీస్ 296 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 295/7 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవెస్ (101) తొలి వన్డే సెంచరీతో చెలరేగగా, జాన్ కాంప్‌బెల్ (62), అమిర్ జంగూ (58 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 40 పరుగులకే 4 వికెట్లు తీసి విండీస్ మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు.

సీఎంను త్వరగా ‘తీసుకెళ్లాలని’ అల్లాను ప్రార్థిస్తా.. బెంగాల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

0
పశ్చిమబెంగాల్లో ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత, ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి తెరలేపాయి. సీఎం సువేందు అధికారి మరణాన్ని కోరతూ ప్రార్ధనలు చేస్తున్నట్టు ఆయన అన్న మాటలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కబీర్ కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో హుమాయున్ కబీర్ వెంటనే మాట మార్చారు. తాను సీఎం దిర్ఘాయువుగా ఉండాలని ప్రార్ధిస్తానని, ఆయన ప్ ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. కానీ కబీర్ చేసిన కామెంట్స్‌పై బెర్హంపూర్ పోలీస్ స్టేషన్‌లో కబీర్‌పై FIR నమోదైనట్టు తెలుస్తుంది.

దేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా.. 40 శాతం తగ్గనున్న డీజిల్ ఖర్చు

0
దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలు పట్టాలు ఎక్కింది. కేంద్రమంత్రి అమిత్ షా ఈ రైలును ప్రారంభించారు. డీజిల్‌తో పాటు ఎల్ఎన్‌జీతో పనిచేసే ఈ రైలులో 1400 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న రెండు డ్రైవింగ్ పవర్ కార్లను వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా డీజిల్ వినియోగాన్ని సుమారు 40 శాతం వరకు ఎల్ఎన్‌జీతో భర్తీ చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఇంధన ఖర్చు, ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. రైల్వే ఆధునీకరణపై మాట్లాడటంతో పాటు కాంగ్రెస్‌పై అమిత్ షా రాజకీయ విమర్శలు చేశారు.

‘అది నా జీవితంలో మానని గాయం.. చెప్పలేని దుఃఖం అనుభవిస్తున్నా’.. తమిళనాడు సీఎం విజయ్ ఎమోషనల్ ట్వీట్

0
గతేడాది తమిళనాడులోని కరూర్‌లో టీవీకే నిర్వహించిన రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్ మృతులకు నివాళులు అర్పించారు. కరూర్ ప్రజలతో పాటు టీవీకే సభ్యులు ఇప్పటికీ మాటల్లో చెప్పలేని దుఃఖాన్ని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అంశంపై సాగుతున్న న్యాయపరమైన ప్రక్రియ కూడా ప్రస్తుతం చర్చలో ఉంది.

విజయ్ సర్కార్ మళ్లీ యూటర్న్.. లా అండ్ ఆర్డర్‌ను RTI నుంచి మినహాయింపు, మళ్లీ ఆదేశాలు

0
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఆర్టీఐపై కీలక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పబ్లిక్‌ విభాగాన్ని ఆర్టీఐ పరిధి నుంచి మినహాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసింది. పబ్లిక్ విభాగాన్ని ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌గా గుర్తిస్తూ మినహాయింపు ఇచ్చారు. దీంతో పోలీసు కాల్పులు, కస్టడీ మరణాలు, పోలీసుల చిత్రహింసలు, సామాజిక-కుల ఘర్షణలు, రాజకీయ, విద్యార్థి, రైతుల ఆందోళనలకు సంబంధించిన సమాచారంపై ఆర్టీఐ ద్వారా పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తాయి. ప్రతిపక్షాలతోపాటు అధికార కూటమి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో తాజా ఉత్తర్వులతో పాత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

విశాఖలో కళ్లు చెదిరే స్కామ్.. రూ.68 లక్షలు, 10 తులాల బంగారం లూటీ.. పాపం డాలర్ల కోసం…

విశాఖపట్నంలో కళ్లు చెదిరే స్కామ్ జరిగింది. డాలర్ల మాయలో పడి బాధితులు రూ.68 లక్షల నగదు, 10 తులాల బంగారం పోగొట్టుకున్నారు. టెక్కలి డ్రైవర్‌‌‌కు.. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి ఇండియన్ కరెన్సీకి డాలర్లు ఇస్తామని నమ్మబలికాడు. ఈ ఆఫర్ ఏదో బాగుందనుకున్న బాధితులు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మి రూ.68 లక్షలు, పది తులాల బంగారంతో ఆ రాజు చెప్పిన చోటుకు వెళ్లారు. అలా వెళ్లగానే వారిపై దాడి చేసి ఆ నగదు బ్యాగులను పట్టుకుని దుండగులు పారిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.