తిరువనంతపురంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌కు వెస్టిండీస్ 296 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 295/7 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవెస్ (101) తొలి వన్డే సెంచరీతో చెలరేగగా, జాన్ కాంప్‌బెల్ (62), అమిర్ జంగూ (58 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 40 పరుగులకే 4 వికెట్లు తీసి విండీస్ మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు.


