Home Blog Page 115

తిరువనంతపురంలో ‘కింగ్’ రికార్డుల వేట.. సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్!

0
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ద్వారా సరికొత్త మైలురాయిపై కన్నేశాడు. ప్రస్తుతం వన్డేల్లో 14,941 పరుగులతో ఉన్న విరాట్, తొలి మ్యాచ్‌లో మరో 59 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ తర్వాత 15,000 వన్డే పరుగులు సాధించిన ప్రపంచంలోనే రెండో బ్యాటర్‌గా నిలుస్తాడు. అలాగే స్వదేశంలో సచిన్ పేరిట ఉన్న అత్యధిక వన్డే పరుగుల రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి మరో 110 పరుగులు అవసరం. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేటి నుంచే భారత్ vs వెస్టిండీస్ వన్డే సమరం.. రుతురాజ్‌కు లక్కీ ఛాన్స్..!

0
తిరువనంతపురంలో భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న కరీబియన్ జట్టు భారత్‌పై సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు టీమిండియా ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా బెంచ్ బలాన్ని పరీక్షించనుంది. గిల్‌కి దెబ్బ తగిలినా కోలుకోవడంతో కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో నాలుగో స్థానంలో రుతురాజ్ ఆడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Ranabaali Movie: ‘రణబాలి’ వినూత్న ప్రమోషన్స్.. విజయ్ దేవరకొండ ‘ది ట్రూత్ సిరీస్’ డాక్యుమెంటరీ సిరీస్

0
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ వినూత్న ప్లాన్‌తో ముందుకొచ్చారు. బ్రిటీష్ ఇండియా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం వెనుక ఉన్న నిజాలను వివరించడానికి ‘ది ట్రూత్ సిరీస్’ పేరుతో 4 ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది.

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ BMS రేటింగ్స్ డిజేబుల్.. నెగెటివ్ రివ్యూలను అడ్డుకోడానికేనా?

0
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో 33 లక్షల టిక్కెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే బుక్‌మైషో యాప్‌లో రేటింగ్స్, రివ్యూస్ ఇచ్చే ఆప్షన్‌ను డిజేబుల్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫేక్ అకౌంట్లు, బోట్ల ద్వారా వస్తున్న ఉద్దేశపూర్వక నెగెటివ్ రేటింగ్‌లను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు నాని ఈ విమర్శలను, ట్రోల్స్‌ను పాజిటివ్‌గా స్వీకరిస్తూ పోస్ట్ పెట్టడం గమనార్హం.

బూతులు తిడుతూ నన్ను చచ్చిపోమంటున్నారు.. ఇదేనా మీ సంస్కారం?: రేణూ దేశాయ్ సంచలన పోస్ట్

0
వినాయక నిమజ్జనం పేరిట అర్ధరాత్రి వేళల్లో మోగుతున్న మితిమీరిన డీజే శబ్దాలు, ప్రజల ఇబ్బందులపై మాట్లాడిన నటి రేణూ దేశాయ్‌పై కొందరు నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. “చెవులు చిల్లులుపడే శబ్దాల వల్ల నరకం చూస్తున్న వృద్ధులు, పసిపిల్లలు, రోగుల తరఫున మాట్లాడినందుకు నన్ను నేరుగా ‘చచ్చిపో’ అని శపిస్తున్నారు” అంటూ మండిపడ్డారు. అసభ్యకర బూతులు తిడుతూ తన చావును కోరుకుంటున్నారని, ఇలాంటి వారికి తల్లిదండ్రులు ఎలాంటి సంస్కారాన్ని నేర్పించారో అర్థం కావడం లేదని అన్నారు.

The Paradise: 3 గంటల సినిమాలో కేసీఆర్ 4 నిమిషాలు కనిపిస్తేనే థియేటర్లు షేక్ అవుతున్నాయ్ – కేటీఆర్

0
రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ ప్రజల్లో మాజీ సీఎం కేసీఆర్‌పై అభిమానం చెక్కుచెదరలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కేసీఆర్‌ను పోలిన పాత్ర కనిపించేది నాలుగు నిమిషాలే అయినప్పటికీ, థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ వేరే లెవల్‌లో ఉందని చెప్పారు. శాంతిభద్రతలు గాలికొదిలేసి డీజేలను బంద్ చేయడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్‌కు ఈ సినిమా మరో షాక్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. గడ్డిపోచ కూడా గడ్డపారలా మారి తిరగబడే నేల ఇదని హెచ్చరించిన కేటీఆర్, కేసీఆర్ స్థానం ప్రజల గుండెల్లో పదిలమని స్పష్టం చేశారు.

Nani: మూడు రోజుల్లో రూ.136 కోట్ల కలెక్షన్స్… బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ దూకుడు

0
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన మాస్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వీ సినిమాస్ అధికారికంగా వెల్లడించింది. తొలి రోజున రూ.88 కోట్లు, రెండో రోజుతో కలిపి రూ.114 కోట్లు రాబట్టిన ఈ సినిమా, ఆదివారం నాటికి ఏకంగా రూ.136 కోట్ల మైలురాయిని అధిగమించింది. విమర్శకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వ్యక్తమైనప్పటికీ, సింగిల్ స్క్రీన్లలో మాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ‘జాదల్ జమానా’ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది.

ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీళ్లు, ప్లాస్టిక్‌ టిఫిన్‌ బాక్స్‌లో వేసిన వేడి పదార్థాలు ఎందుకు తినకూడదు?

0
ఉదయాన్నే ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగడం, ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్‌లో వేడి వేడి అన్నం పెట్టుకోవడం మనలో చాలామందికి అలవాటు. అయితే రోజూ మనం వాడే ఈ ప్లాస్టిక్ పాత్రలే మనల్ని నెమ్మదిగా రోగాల బారిన పడేస్తున్నాయని మీకు తెలుసా? ప్లాస్టిక్‌ వస్తువులు ఎక్కువగా వాడితే డయాబెటిస్‌ ముప్పు కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ప్లాస్టిక్ వల్ల రక్తంలో షుగర్ ఎలా పెరుగుతుంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఓ నిమ్మకాయ ఉంటే చాలు, వంటగది నుంచి బాత్రూమ్ వరకు మొండి మరకలు, దుర్వాసన మాయం!

0
మన ఇంటితో వంటగది, బాత్రూమ్‌ని క్లీన్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వీటి మీదే ఇంటి ఆరోగ్యం మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే, వంటగదితో పాటు బాత్రూమ్‌ని క్లీన్ చేయడానికి మనం ఖరీదైన ప్రొడక్ట్స్, కెమికల్స్ వాడుతుంటాం. అయితే, వీటికి బదులు వంటగదిలో దొరికే నిమ్మకాయ ఎన్నో పనుల్ని చేసేస్తుంది. సాధారణంగా నిమ్మకాయ పులుపురుచితో ఉంటుంది. నిమ్మకాయలోని పులుపుదనానికి కారణం సిట్రిక్ యాసిడ్. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది.

దీనివల్ల నిమ్మరసం బ్యాక్టీరియాను చంపడానికి, బూజు తొలగించడానికి, తుప్పును వదిలించడానికి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, నిమ్మ తొక్కలోని సహజ నూనెలు జిడ్డు మరకల్ని కరిగించి ఉపరితలాలను మెరిసేలా చేస్తాయి. రసాయనాలతో కూడిన క్లీనర్లు చర్మ వ్యాధులు, తామర, శ్వాసకోశ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. నిమ్మకాయ పూర్తిగా సహజమైంది, తక్కువ ఖర్చుతో లభించే సురక్షితమైన ప్రత్యామ్నాయం. మరీ, నిమ్మకాయను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా?

నెయ్యి కొనేటప్పుడు డబ్బా, ప్యాకెట్‌పై గమనించాల్సిన అంశాలు!

0
ప్రస్తుతం మార్కెట్‌లో సాధారణ నెయ్యితో పాటు A2 నెయ్యి, బిలోనా నెయ్యి, కల్చర్డ్ గీ పేర్లతో ఎన్నో ఉత్పత్తులు కనిపిస్తున్నాయి. వీటిలో A2 నెయ్యి ఆరోగ్యానికి మరింత మంచిదని భావించి ఎక్కువ ధర చెల్లించేవారు కూడా ఉన్నారు. మరి మంచి నెయ్యిని ఎంచుకోవాలంటే ఏ వివరాలు చూడాలి? A2, బిలోనా అంటే అసలు ఏమిటి? నెయ్యి వల్ల లభించే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.