ఉదయాన్నే ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగడం, ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్‌లో వేడి వేడి అన్నం పెట్టుకోవడం మనలో చాలామందికి అలవాటు. అయితే రోజూ మనం వాడే ఈ ప్లాస్టిక్ పాత్రలే మనల్ని నెమ్మదిగా రోగాల బారిన పడేస్తున్నాయని మీకు తెలుసా? ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడితే డయాబెటిస్ ముప్పు కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ప్లాస్టిక్ వల్ల రక్తంలో షుగర్ ఎలా పెరుగుతుంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


