వినాయక నిమజ్జనం పేరిట అర్ధరాత్రి వేళల్లో మోగుతున్న మితిమీరిన డీజే శబ్దాలు, ప్రజల ఇబ్బందులపై మాట్లాడిన నటి రేణూ దేశాయ్‌పై కొందరు నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. “చెవులు చిల్లులుపడే శబ్దాల వల్ల నరకం చూస్తున్న వృద్ధులు, పసిపిల్లలు, రోగుల తరఫున మాట్లాడినందుకు నన్ను నేరుగా ‘చచ్చిపో’ అని శపిస్తున్నారు” అంటూ మండిపడ్డారు. అసభ్యకర బూతులు తిడుతూ తన చావును కోరుకుంటున్నారని, ఇలాంటి వారికి తల్లిదండ్రులు ఎలాంటి సంస్కారాన్ని నేర్పించారో అర్థం కావడం లేదని అన్నారు.
బూతులు తిడుతూ నన్ను చచ్చిపోమంటున్నారు.. ఇదేనా మీ సంస్కారం?: రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
RELATED ARTICLES


