సొంత పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై విచారణకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ప్రకటించింది. ఆయనపై వస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుని జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ కమిటీ లోతైన విచారణ చేసి రిపోర్ట్ ఆధారంగా చిర్రి బాలరాజుపై చర్యలు ఉంటాయని ఆ పార్టీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో చిర్రి బాలరాజు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది.
ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ సీరియస్.. చిర్రి బాలరాజుపై విచారణకు హై లెవల్ కమిటీ, రిపోర్ట్ ఆధారంగా చర్యలు
RELATED ARTICLES


