తిరువనంతపురంలో భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న కరీబియన్ జట్టు భారత్‌పై సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు టీమిండియా ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా బెంచ్ బలాన్ని పరీక్షించనుంది. గిల్‌కి దెబ్బ తగిలినా కోలుకోవడంతో కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో నాలుగో స్థానంలో రుతురాజ్ ఆడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.


