Home Blog Page 116

మ్యూచువల్ ఫండ్ SIPలో హైరిటర్న్స్ ఇచ్చిన టాప్-4 ఫోకస్డ్ ఫండ్స్.. 10 ఏళ్లలో రూ.10 వేలకు ఎంతొచ్చిందంటే?

0
Focused Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తమకు అనువైన ఫండ్ ఎంచుకుని దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. ప్రస్తుతం మనం ఫోకస్డ్ ఫండ్ కేటగిరీలోని టాప్-4 స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. గత 10 సంవత్సరాల్లో సగటున 16 శాతం చొప్పున రాబడులు అందించాయి. మరి ఆ ఫండ్స్ ఏవి, రూ.10 వేల సిప్ పెట్టుబడికి ఎంతొస్తుంది? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రైతులకు గుడ్‌న్యూస్.. దసరాకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.2000 జమ.. పీఎం కిసాన్ 24వ విడత లబ్ధిదారుల లిస్ట్ చెక్ చేయండిలా!

0
PM Kisan: దేశంలోని కోట్లాది మంది రైతులకు అదిరే శుభవార్త వచ్చింది. దసరా పండగకు ముందే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 27వ తేదీన రైతు పెట్టుబడి సాయం అందించనున్నట్లు నివేదికలు వస్తున్నాయి. అదే రోజున పీఎం కిసాన్ నిధులు సైతం విడుదల అయ్యేందుకు అవకాశం ఉంది. మరి అందుకు సంబంధించిన వివరాలు, లబ్ధిదారుల జాబితా చెకింగ్ వివరాలు తెలుసుకుందాం.

రూ.30 వేల బిల్ UPIలో చెల్లించినా MDR ఛార్జీలు పడవు.. SBI చెప్పిన ‘పేమెంట్స్ ఫ్యాక్ట్స్’ ఇవే.. ఏం చేయాలంటే?

0
SBI UPI MDR: యూపీఐ చెల్లింపుల రూ.2000 పైన చేసినట్లయితే ఎండీఆర్ ఛార్జీలు పడతాయనేది ఇప్పుడు జరగుతున్న చర్చ. అయితే, మీరు రూ.30 వేల బిల్ చేసినా ఒక్క రూపాయి కూడా ఎండీఆర్ ఛార్జీలు చెల్లించకుండా చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చెబుతోంది. అందుకోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరిస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. రూ.2000 పైన బిల్ యూపీఐ చేసిన ఎండీఆర్ చెల్లించకుండా ఎలా తప్పించుకోవచ్చు అంటే..

Bonus Shares: ఇన్వెస్టర్లకు పండగే.. 100 షేర్లు కొంటే మరో 100 షేర్లు ఉచితం! బోనస్ షేర్లు ఇస్తున్న స్మాల్ క్యాప్ స్టాక్!

0
Bonus Shares: మెడికల్ ఎక్విప్మెంట్ సెక్టార్‌లోని స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ మాస్ట్రోస్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ సిస్టమ్స్ బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ 1:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించింది. రికార్డు డేట్ అక్టోబర్ 01గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఆలోపు 1 షేరు కొంటే మరో షేరు, అదే 100 షేర్లు కొంటే మరో 100 షేర్లు ఉచితంగా లభిస్తాయి. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

ATM ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు రద్దు.. SBI సహా ప్రభుత్వ బ్యాంకుల వెల్లడి.. సమ్మె సమయంలో ఖాతాదారులకు ఊరట!

0
ATM Charges: ఐదు రోజుల పని దినాలు కల్పించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 28 నుంచి సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా బ్యాంకులు చర్యలు చేపడుతున్నాయి. సమ్మె సమయంలో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు రద్దు చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ మేరకు ఇప్పటికే ప్రకటనలు చేశాయి. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

బంగ్లాదేశ్‌లో హిందూ నగల వ్యాపారి దారుణ హత్య.. డ్రమ్ములో కుక్కి నీటిలో పడేసిన దుండగులు

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. ఓ నగర వ్యాపారిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కి.. నీటిలో పడేశారు. అయితే నీటిపై తేలుతున్న డ్రమ్మును గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో ముందుగా హత్య చేసి, ఆ తర్వాత డ్రమ్ములో పెట్టి నీటిలో పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జేబులో లభించిన కోఆపరేటివ్‌ క్రెడిట్‌ యూనియన్‌ టోకెన్‌ ఆధారంగా మృతుడిని గుర్తించారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం.. భారత్‌కు రష్యా మద్దతు.. కానీ చైనాలాగే కొత్త మెలిక పెట్టిన మాస్కో..!

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు మన మిత్రదేశమైన రష్యా మద్దతు ప్రకటించింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ ప్రకటన చేశారు. భారత్‌తోపాటు బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న లావ్రోవ్.. జర్మనీ, జపాన్‌లకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. అయితే భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ కలిసి శాశ్వత సభ్యత్వం పొందే విషయమై పరస్పరం మద్దతు ప్రకటించుకున్నాయి.

మేడారం మినీ జాతర తేదీలు వచ్చేశాయ్.. 4 రోజుల పాటు ఉత్సవాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..!

0
మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర 2027 తేదీలు ఖరారు అయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు 4 రోజుల పాటు మినీ జాతర నిర్వహించనున్నట్లు పూజారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 17న సారలమ్మను గద్దెపైకి తీసుకురావడం, 18న సమ్మక్కను గద్దెపైకి తీసుకురావడం, 19న భక్తులు దర్శనాలు, మొక్కులు.. 20న జాతర ముగుస్తుంది. మహాజాతర లేని ఏడాదిలో జరిగే ఈ మినీ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు.

ప్రపంచ టూరిజం డెస్టినేషన్‌గా తెలంగాణ.. పెట్టుబడులకు కొత్త పాలసీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

0
వరల్డ్ టూరిజం డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కోటలు, జలపాతాలు, అడవులు, వన్యప్రాణి ప్రాంతాలు, జానపద కళలు, పండుగలను ప్రపంచ పర్యాటక పటంలో మరింతగా పరిచయం చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రామప్ప, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి, అలంపూర్, మేడారం, హైదరాబాద్‌ హెరిటేజ్‌ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. టూరిజం పాలసీ 2025-30 ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తూ ఎకో, టెంపుల్, మెడికల్, హెరిటేజ్, అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణలో ULC పెండింగ్ దరఖాస్తులకు మోక్షం.. 22A భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు..!

0
తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీవో నెం.455, 456, 747, 92 కింద ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హమైన కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరోవైపు 22A భూముల సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. జీవో 118, 76కు అనుగుణంగా చర్యలు చేపట్టామని, మిగిలిన సమస్యలను కూడా వేగంగా పరిష్కరిస్తామని వెల్లడించింది.