Home Blog Page 117

Telangana Weather Forecast: తెలంగాణలో వర్షాలకు బ్రేక్‌.. నేటి నుంచి పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

0
Telangana Weather: తెలంగాణలో వర్షాలకు తాత్కాలిక విరామం ఏర్పడి వాతావరణం పొడిగా మారనుందని వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరిగి చాలా ప్రాంతాల్లో 34–35 డిగ్రీలకు చేరవచ్చునని తెలంగాణ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 29న కర్ణాటక సరిహద్దు దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అక్టోబర్‌ 2 వరకు మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగవచ్చునని తెలిపారు. ఆ తర్వాత గాలుల ప్రభావంతో ఆగ్నేయ తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

పంజాబ్ వర్సిటీ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్ వార్తలు.. 2 వేలమంది విద్యార్థుల హింసాత్మక ఆందోళన, విధ్వంసం

0
పంజాబ్‌లోని ఎల్‌పీయూలో గ్యాంగ్ రేప్, ఆత్మహత్య జరిగినట్లు వార్తలు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సుమారు 2 వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగగా.. పరిస్థితి క్రమంగా హింసాత్మకంగా మారింది. క్యాంపస్‌లో కిటికీలు, ఇతర సామగ్రిని విద్యార్థులు ధ్వంసం చేయడంతో పాటు కొన్ని వస్తువులకు నిప్పు పెట్టారు. అనంతరం జలంధర్-ఫగ్వారా నేషనల్ హైవేను కూడా దిగ్బంధించారు. అయితే అత్యాచార ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఇప్పటివరకు ఆధారాలు కూడా లభించలేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ కూడా ఈ ప్రచారం అంతా తప్పు అని ఖండించింది.

‘త్వరలోనే చెబుతా తమ్ముడు..’ పేర్ని కిట్టుకు … బండ్ల గణేష్ సాలిడ్ కౌంటర్.. అసలేం జరిగిందంటే?

వైసీపీ నేత పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు మాటలపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. పేర్ని కిట్టు బండ్ల గణేష్ వ్యాపారం దృష్ట్యా మాత్రమే పవన్ కళ్యాణ్2ను పొగుడుతుంటారని పేర్ని కిట్టు అన్నారు. ఈ కామెంట్స్ బండ్ల గణేష్ దృష్టికి వెళ్లాయి. దాంతో ఆయన తనదైన శైలీలో కిట్టుకు రిప్లై ఇచ్చారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో, స్థానం ఏమిటో అర్థమయ్యేలా చెబుతా తమ్ముడు పేర్ని కిట్టి అంటూ ట్వీట్ చేశారు. ఇదిప్పుడు వైరల్ అవుతుంది.

బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు.. ఎన్ఆర్ఐల భూములే టార్గెట్.. పక్కా స్కెచ్‌తో భూ కబ్జా

కృష్ణా జిల్లా పెనమలూరులో మోసం బయటపడింది. ఎన్ఆర్ఐల భూములే టార్గెట్ చేస్తూ వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్‌గా విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన బిక్కిన సుబ్బారావుకు సంబంధించిన 800 గజాల భూమిని కొట్టేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేసి ముఠాను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో ఇంకొందరు పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

బొత్స నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్.. మూకుమ్మడిగా నేతల రాజీనామా .. చిన్న శ్రీను ఎఫెక్టేనా?

స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట వైసీపీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో మెరకముడిదాం వైసీపీ మండల అధ్యక్షుడుతో పాటు.. 13 గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలు పార్టీని వీడారు. పైగా వీరంతా చిన్న శ్రీను అడుగుజాడల్లోనే నడుస్తామని చెప్పారు. త్వరలోనే వారంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

భక్తుల అసంతృప్తిని తగ్గించలేకపోయిన టీటీడీ వివరణ.. రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్ సమస్యపై మరింతగా గళమెత్తిన నెటిజన్లు..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్లో టీటీడీ రిలీజ్ చేసే రూ.300 ప్రత్యేక కోటా దర్శనం టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నించిన చాలా మందికి చేదు అనుభవం ఎదురవుతోంది. నెలలుగా ప్రయత్నించినప్పటికీ తమకు టికెట్లు దొరకడం లేదని సోషల్ మీడియాలో వాపోతున్నారు. దీంతో టీటీడీ సోషల్ మీడియా ద్వారా భక్తులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే టీటీడీ ఇచ్చిన వివరణతో నెటిజన్లు సంతృప్తి చెందడం లేదని కామెంట్లను బట్టి అర్థమవుతోంది.

SRI KASHI NAYANA DAILY

గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ టాప్ 1000 నగరాలు.. ఏపీ నుంచి నాలుగు నగరాలు, ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్థ ర్యాంకింగ్స్

Andhra Pradesh Four Cities Ranked In Global Cities Index: గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌లో టాప్‌-1,000 నగరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు నగరాలు ర్యాంకింగ్స్ సాధించాయి. గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడకు స్థానాలు దక్కాయి.. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ 421వ స్థానంలో నిలిచింది. బెంగళూరు 311వ స్థానంలో , చెన్నై 381వ స్థానంలో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ 268వ స్థానంలో నిలిచింది.

SRI KASHI NAYANA DAILY – 27 సెప్టెంబర్ 2026 (డిజిటల్ ప్రెస్ కార్డ్స్)

NRIలకు అద్భుత అవకాశం.. తిరుమల శ్రీవారి హుండీలోని విదేశీ నాణేలు తీసుకోవచ్చు.. త్వరపడండి

APNRTS Foreign Coins From Tirumala Srivari Hundi: తిరుమల శ్రీవారి హుండీలో విదేశాలలో స్థిరపడిన భారతీయులు అక్కడి కరెన్సీ నోట్లు, నాణేలను కానుకలుగా సమర్పిస్తుంటారు. హుండీలలోని విదేశీ కరెన్సీని బ్యాంకులు స్వీకరిస్తున్నాయి.. కానీ విదేశీ నాణేలు మాత్రం తీసుకోవడం లేదు. అందుకే ఈ నాణేలను ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ కొనుగోలు చేసి ఎన్ఆర్ఐలకు అందిస్తోంది. ఈ నాణేలు కావాల్సిన వారు తాడేపల్లిలోని ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ కార్యాలయానికి వెళ్లి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.