Home Blog Page 118

మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌ను మార్చేసిన జగన్.. వేమారెడ్డిని పక్కన పెట్టి సోమిరెడ్డికి బాధ్యతలు

Mangalagiri Ysrcp In Charge Burramukku Venugopala Somireddy: మంగళగిరి నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తను మార్చేసింది. ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని నియమించింది. వైఎస్ జగన్ ఆదేశాలతో సోమిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో తెలిపింది. వేణుగోపాల సోమిరెడ్డిది మంగళగిరి నియోజకవర్గమని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న దొంతిరెడ్డి వేమారెడ్డిని పక్కన పెట్టారు. మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

AP Rains: మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

తీవ్ర వాయుగుండం కారణంగా చేపల వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర వరద పరిస్థితులపై విదేశాల నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాకినాడ నుంచి వేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్‌కు సురక్షితంగా చేరినట్లు అధికారులు తెలిపారు. హిరమండలం లిఫ్ట్‌ పనులు వేగవంతం చేయాలని, కృష్ణా వరద జలాల నిల్వకు బ్యారేజీలు, ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని చంద్రబాబు సూచించారు.

‘ద ప్యారడైజ్’ కోసం నన్ను పిప్పి పిప్పి చేశాడు.. శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

0
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో విడుదలైన ‘ద ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రంలో భయంకరమైన ప్రతినాయకుడు ‘సికంజ మాలిక్’గా అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలేకరుల సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన 50 ఏళ్ల కెరీర్‌లో 500కు పైగా సినిమాలు చేసినా, ఇంతటి క్రూరమైన పాత్రను ఎప్పుడూ చేయలేదని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకే సీన్‌కు పది టేకులు తీసుకుంటూ, గానుగలో చెరుకును పిండినట్లు తన నుంచి నటనను రాబట్టాడని తెలిపారు. అలాగే ఈ వయసులో బేర్ బాడీ ఫైట్ కోసం జిమ్‌లో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఆలుగడ్డలు ఫ్రిజ్‌లో ఉంచితే క్యాన్సర్‌ వస్తుందా, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

0
ఆలుగడ్డలు దాదాపు ప్రతి ఇంట్లో రోజూ వాడే అత్యంత ప్రజాదరణ పొందిన వెజిటెబుల్‌. అయితే చాలా మంది మిగిలిన కూరగాయలతో పాటు ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఆరోగ్యంపూ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వీటిలోని పదార్థాలు రసాయనిక మార్పులకు గురై విషపూరితంగా మారే అవకాశం ఉంది.

ఇది ఆహార రుచిని మార్చడమే కాకుండా దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే వీటిని నిల్వ చేసే విధానంపై సరైన అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదో, ఒకవేళ పెడితే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, మరి ఆలుగడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

ది బీస్ట్’కు పోటీగా అమెరికాలోకి అడుగుపెట్టిన చైనా సీక్రెట్‌గా తయారుచేసిన ‘హాంగ్‌చీ’!

ప్రపంచంలోనే అగ్రదేశంగా చెలామణి అవుతోన్న అమెరికాకు చైనా నుంచి గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత వాహనాన్ని తీసుకొచ్చారు. ఈ అత్యాధునిక వాహనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడుతున్న బీస్ట్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఒకప్పుడు విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకునే చైనా.. ఇప్పుడు సొంతంగా ఇటువంటివి తయారుచేసుకుంటోంది.

రాశిఫలాలు 27 సెప్టెంబర్ 2026: హంస, మాళవ్య రాజయోగాల వేళ మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు సూర్యదేవుని ఆశీస్సులు!

0
రాశిఫలాలు 27 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ, హస్తా నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. తులా రాశిలో బుధుడు, శుక్రుడి కలయిక జరగనుంది. మరోవైపు గురుడు, కుజుడితో కలిసి కర్కాటక రాశిలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో చంద్రుడు గురుడితో నవపంచమ యోగాన్ని ఏర్పరచనున్నారు. అంతేకాదు కర్కాటకంలో హంస రాజయోగాన్ని, శుక్రుడు తన సొంత రాశిలో మాళవ్య రాజయోగాన్ని, బుధ, శుక్రులు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ శుభ యోగాల ప్రభావంతో మిథునం, కన్య సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 27 September 2026: ఈరోజు నక్షత్రం, తిథి, యోగం, శుభ ముహుర్తాలు, రాహుకాలం వివరాలివే

0
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని పాడ్యమి తిథి నాడు, ఆదివారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకే తరహా గాయాలతో ఐదుగురు పేసర్లు ఔట్.. సౌతాఫ్రికా క్రికెట్‌లో ఏం జరుగుతోంది?

0
ఓ పక్క ఆస్ట్రేలియాతో సిరీస్‌ జరుగుతుండగా సౌతాఫ్రికా క్రికెట్‌ను తీవ్రమైన హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు వేధిస్తున్నాయి. జట్టులోని టాప్ పేసర్లు కగిసో రబాడా, లుంగీ ఎంగిడి, క్వేనా మఫాకా, ఒట్నీల్ బార్ట్‌మాన్, లుథో సిపామ్లా హ్యామ్‌స్ట్రింగ్ సమస్యలతో జట్టుకు దూరమయ్యారు. ఒకే సమయంలో ఐదుగురు బౌలర్లు తీవ్రంగా గాయపడటాన్ని డాక్టర్లు ‘హ్యామ్‌డెమిక్’గా అభివర్ణించారు. ఆస్ట్రేలియా తరహాలో బౌలర్ల పనిభారాన్ని సరిగ్గా ప్లాన్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

‘ఇదే నా చివరి వన్డే ప్రపంచకప్..’: విరాట్ కోహ్లీ భావోద్వేగ ప్రకటన!

0
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు భావోద్వేగ ప్రకటన చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్ భారత్ తరఫున తనకు చివరిదని స్పష్టం చేశాడు. 54 వన్డే శతకాలతో అత్యధిక సెంచరీల రికార్డును కలిగి ఉన్న కోహ్లీ, కప్పు గెలవడానికి తన శక్తివంచన లేకుండా శ్రమిస్తానని చెప్పాడు. రోహిత్ శర్మ కూడా మరో ప్రపంచ కప్ సమరానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో ఈ ‘రో-కో’ జోడీ ఆఖరి వరల్డ్ కప్ సమరంపై ఉత్కంఠ నెలకొంది.

ఈసీ కీలక సమావేశం.. ఎన్నికల కమిషనర్ల మధ్య విబేధాలపై వార్తల వేళ స్పష్టత

0
దేశంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాల ఆరోపణలతో వివాదాస్పదమవుతోంది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్యంగా సీఈసీ నిర్ణయాలను ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారని ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనంతో మరింత అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలో ఈసీ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. ముగ్గురు కమిషనర్లతో కూడి ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేసింది. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని స్పష్టత ఇచ్చింది.