Home Blog Page 119

శ్రీవారి భక్తులకు అలర్ట్.. రూ.300 దర్శన టికెట్లపై TTD ఇచ్చిన తాజా ప్రకటన ఇదే

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లపై టీటీడీ తాజాగా ఒక ప్రకటన ఇచ్చింది. నిమిషాల్లో టికెట్లు అయిపోతుండటంతో సర్వర్లు ఫెయిల్ అవుతున్నాయన్న సోషల్ మీడియాలో ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ మొత్తం ఆధునిక సాంకేతికతో నిర్వహిస్తున్నామని, నిరంతరం నిపుణులు పర్యవేక్షిస్తుంటారని పేర్కొంది. టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో తొందరగా అయిపోతున్నాయని, దీనికి వర్చువల్ క్యూ పద్ధతిని అనుసరిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. టికెట్లు అయిపోవడం, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడం ఒకటిగా చూడొద్దని కోరింది.

సోషల్ మీడియాలో పోస్ట్.. రంగంలోకి పవన్ కళ్యాణ్, పరవాడ కాలుష్యంపై డిప్యూటీ సీఎం సీరియస్ యాక్షన్

పరవాడలో కాలుష్యంపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. దానిపై విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు అనకాపల్లి జిల్లా పరవాడలో పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించి, పరిస్థితలను పరిశీలించారు. అక్కడ శుద్ధి చేయని వ్యర్థాలతో కూడిన నీటిని కాలువల్లోకి విడుదల చేసినట్టు గుర్తించారు. వెంటనే దీనిపై వివరణ కోరుతూ 95 కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. పైగా ఏడు రోజుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని కోరారు.

ఈనెల 30న 24 వేలకుపైగా పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ… ఎక్కడంటే?

ఏపీలో కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 30వ తేదీన విజయవాడలో 24 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలోని పలు కుటుంబాలకు ఈ లబ్ధి చేకూరనుంది. ఆ కుటుంబాలకు యాజమాన్య హక్కుతో పాటు బ్యాంకు లోన్ వచ్చే సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. కాగా ఇప్పటికే విశాఖపట్నంలో 28 వేల కుటుంబాలకు సీఎం చంద్రబాబునాయుడు ఇళ్ల పట్టాలు అందించిన సంగతి తెలిసిందే.

విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయం.. డిజిటల్ కియోస్క్ ప్రారంభం

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ కియాస్క్‌ల ద్వారా పోలీసులకు డైరక్ట్‌గా ఫిర్యాదు చేయవచ్చు. కియాస్క్‌ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇలా ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడానికి ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి ఇబ్బంది పడే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

జగన్ vs ఎంపీ: మాజీ సీఎం పోస్టుకు ఫైర్‌బ్రాండ్ మహువా షాకింగ్ కౌంటర్..!

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మహువా మొయిత్రాల మధ్య Xలో మాటల యుద్ధం సాగింది. దేశంలో ప్రస్తుతం కేంద్ర ఎలక్షన్ కమిషన్ కేంద్రంగా సాగుతున్న దుమారం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్ర నుంచి షాకింగ్ రియాక్షన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేసిందనే విషయంపై ప్రజలకు స్పష్టత అవసరమని పేర్కొన్నారు. ఇందుకే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఆపండంటూ మహువా మొయిత్రా కౌంటర్ ఇచ్చారు.

బాత్‌రూమ్‌లో ఈ వస్తువులు ఉంటే దరిద్రమే!

0
వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు బాత్‌రూమ్‌లో ఉంచకూడదు. దీనివల్ల సమస్యల్లో చిక్కుకుంటారు. ఈ నేపథ్యంలో బాత్‌రూమ్‌లో ఉంచకూడని ఆ వస్తువులు ఏంటో చూద్దాం.

ఇంట్లోని కుండీలో ఉల్లిగడ్డలు పెంచే మార్గాలు

0
మీ ఇంట్లోని కుండీల్లో ఉల్లిగడ్డను సింపుల్‌గా పెంచవచ్చు. దీనికోసం ఎలాంటి మార్గాలు ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.

కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ తగ్గించే అలవాట్లు

0
మీ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ పెరిగితే ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. కాబట్టి ఈ కార్టిసాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. దానికోసం ఏం చేయాలో తెలుసుకుందాం.

వీకెండ్‌లో అతిగా నిద్రపోతే వచ్చే సమస్యలు

0
కొంతమంది వీకెండ్‌లో 10గంటలకు మించి నిద్రపోతారు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.

ముఖంపై చెమటలు ఎక్కువ పట్టేలా చేసే ఆహారాలు

0
కొంతమందికి ముఖంపై చెమటలు ఎక్కువగా వస్తాయి. దీనికి మీరు తినే ఆహారాలు కూడా కారణం. అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి.