Home Blog Page 120

The Paradise: బైక్ నడపడమే నాకు తెలిసిన స్కిల్.. హీరో కాకపోయింటే ర్యాపిడో డ్రైవర్ అయ్యేవాణ్ణి: నాని

0
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో రాపిడో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు బైక్ డ్రైవింగ్, కొత్త వ్యక్తుల కథలు వినడం అంటే ఎంతో ఇష్టమని, ఒకవేళ సినీ పరిశ్రమలోకి రాకపోతే బైక్ టాక్సీ డ్రైవర్‌గానే స్థిరపడేవాడినని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే “మీరు హీరోగా పరిచయమైనప్పుడు అసలు రాపిడోనే లేదు కదా” అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. మరోవైపు, మిశ్రమ స్పందనలు వ్యక్తమైనప్పటికీ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి నాని కెరీర్‌లోనే సరికొత్త రికార్డు నమోదు చేసింది.

బిగ్ స్క్రీన్‌పై కేసీఆర్ స్వాగ్… ‘ది ప్యారడైజ్’కి కేటీఆర్ మద్దతు, చాలాకాలం తర్వాత థియేటర్‌కి

0
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న పీరియడ్ డ్రామా ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని చూసేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ థియేటర్‌కు వెళ్లనున్నారు. చాలా సంవత్సరాల తర్వాత తన అభిమాన నటుడు నాని నటించిన ఈ సినిమాను థియేటర్‌లోనే వీక్షించబోతున్నట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. సినిమాలో ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకర్ అన్న’ పాత్ర తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాడీ లాంగ్వేజ్, ఆహార్యాన్ని పోలి ఉండటం, ఇప్పటికే కేసీఆర్ మనవడు హిమాన్షు రావు థియేటర్‌లో ఈ చిత్రం చూడటంతో కేటీఆర్ రాక రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఒక్క డైలాగ్‌తో ట్రోలర్స్‌ని ‘తొక్కేసిన’ చిరంజీవి.. నెగెటివ్ ప్రచారంపై మెగాస్టార్ సెటైరికల్ పంచ్

0
సందీప్ కిషన్ నటించిన ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి సరదాగా మాట్లాడుతూ… “విశ్వంభర సినిమాలో నువ్వు నా పక్కన నటించకపోవడానికి హైట్ కారణం కాదు. నన్ను అవాయిడ్ చేశావా? నన్నేమైనా తొక్కేయాలని చూస్తున్నావా ఏంటి?” అంటూ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ‘బాస్ తొక్కేశాడు’ అంటూ తనపై జరుగుతున్న నెగెటివ్ క్యాంపెయిన్‌ను చిరంజీవి చాలా నిశితంగా గమనిస్తున్నారని ఈ పంచ్‌తో తేలిపోయింది.

రెండు రోజుల్లోనే రూ.114 కోట్లు… నిమజ్జనం రోజున కూడా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ ర్యాంపేజ్

0
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన రా అండ్ రస్టిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజు మిక్స్‌డ్ టాక్, సోషల్ మీడియా ట్రోల్స్ ఎదురైనప్పటికీ, కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలంగాణలో వినాయక నిమజ్జనం సందడి ఉన్నప్పటికీ, రెండో రోజు సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. అనిరుధ్ అందించిన పాటలకు థియేటర్లలో ప్రేక్షకులు డ్యాన్సులు వేస్తూ రచ్చ చేస్తున్నారు. ‘జడల్’గా నాని చూపించిన నట విశ్వరూపానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటంతో సినిమా మంచి జోరుతో దూసుకుపోతోంది.

The Paradise: డిజాస్టర్ టాక్‌ను తొక్కిపడేసిన నాని క్రేజ్.. టైర్-2 హద్దులు దాటి టైర్-1 రేసులోకి నేచురల్ స్టార్!

0
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ తొలిరోజే నెగెటివ్ టాక్, ట్రోలింగ్ బారిన పడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. టాక్‌తో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రెండో రోజు తెలంగాణ, నైజాం ప్రాంతాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్స్‌తో కళకళలాడుతూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తోంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా టైర్-2 విభాగంలో గతంలో ఏ హీరో సాధించని స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టి, నాని టైర్-1 స్టార్ల రేసులోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారని సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఫుడ్స్, ఏం తింటే కొవ్వు కరిగి గుండె సమస్యలు దూరమవుతాయో తెలుసా

0
మన శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అది ధమని గోడల్ని బలహీనపరిచి అథెరోస్క్లెరోటిక్ ఫలకాన్ని ఏర్పరుస్తుంది. దీనినే అథెరోస్క్లెరోటిస్ అంటారు. దీంతో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెకి రక్తప్రసరణని నిలిచిపోతుంది. పెరిఫెరల్ వ్యాధి అంటే కాళ్ళు, చేతులకి రక్తప్రసరణ తగ్గుతుంది. కెరోటిడ్ ఆర్టరీ వ్యాధి అంటే బ్రెయిన్‌కి బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వంటి సమస్యలొస్తాయి.
కొలెస్ట్రాల్ పెరగ్గానే వెంటనే మనకి తెలియదు. చాలా సంవత్సరాల పాటు తెలియకుండానే మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే, కొలెస్ట్రాల్ లెవల్స్‌ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. లేదంటే ప్రాణాలకి ప్రమాదంగా మారే గుండె పోటు, పక్షవాతం వచ్చే సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలకి కారణమయ్యే కొలెస్ట్రాల్‌ని నేచురల్‌గా తగ్గించుకునేందుకు కొన్ని ఫుడ్స్ హెల్ప్ చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. సంతృప్త కొవ్వుల బదులు హెల్దీగా ఉండే అసంతృప్త కొవ్వులని తీసుకుంటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడతాయి. ఆ ఫుడ్స్ ఏంటంటే

కందిపప్పు త్వరగా ఉడకాలంటే పాటించాల్సిన 5 సింపుల్‌ చిట్కాలు!

0
మన భారతీయ ఇళ్లలో కందిపప్పు లేని రోజును ఊహించుకోవడం కష్టమే. రోజువారీ వంటల్లో పప్పు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ప్రతిరోజూ చేసే పప్పు రుచిగా ఉండటమే కాదు. త్వరగా ఉడకడం కూడా చాలా ముఖ్యం. అయితే ఒక్కోసారి కందిపప్పు ఎంత సమయం ఉడికించినా మెత్తగా అవ్వక ఇబ్బంది పెడుతుంటుంది. దీనివల్ల వంట ఆలస్యం కావడమే కాకుండా గ్యాస్‌ కూడా వృథా అవుతుంది. కొన్నిసార్లు అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు లేదా ఆఫీస్‌కు సమయం మించి పోతున్నప్పుడు పప్పు త్వరగా ఉడకాలి అనిపిస్తుంది.

కొన్నిసార్లు అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు లేదా ఆఫీస్‌కు సమయం మించిపోతున్నప్పుడు, పండుగలు, పార్టీలు జరుగుతున్న సమయంలో పప్పు త్వరగా ఉడకాలి అనిపిస్తుంది. సరైన చిట్కాలు తెలిస్తే కందిపప్పును చాలా తక్కువ సమయంలో వెన్నలా మెత్తగా ఉడికించుకోవచ్చు. అలాంటి సమయాన్ని, గ్యాస్‌ని ఆదా చేసే అద్భుతమైన చిట్కాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కొడుకులా లేదా కూతుళ్లా, ఎవరి వల్ల తల్లిదండ్రులు ఎక్కువ సంతోషంగా ఉంటారో తెలుసా?

0
ఏ ఇంట్లో అయినా సరే పిల్లలు ఉండటం తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్నిస్తుంది. కొందరికి కొడుకులంటే ప్రాణమైతే.. మరికొందరికి కూతుళ్ల అంటే చాలా ఇష్టం. అయితే, మన భారతదేశంలో చాలా మంది అబ్బాయిలు పుడితే తెగ సంతోషపడుతుంటారు. కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలు పుడితే.. ఇంటికి సాక్ష్యాత్తూ లక్ష్మీదేవి వచ్చిందని సంబరపడుతుంటారు.

పిల్లల్లో కొడుకులు లేదా కూతుళ్లు ఉండటం వల్ల తల్లిదండ్రుల ఆనందంలో ఏమైనా మార్పు ఉంటుందా? అనే అంశంపై చైనాలో జరిగిన ఒక సరికొత్త అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఎక్కువ సంతోషంగా ఉన్నారా? లేదంటే కూతుళ్లు ఉన్న పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా అని అధ్యయనం నిర్వహించారు. మరీ ఆ అధ్యయనంలో ఏం తేలిందో తెలుసుకుందాం.

పాత న్యూస్‌పేపర్‌ని అమ్మొద్దు, పారేయొద్దు, ఫోన్ కవర్స్ నుంచి ఫోటోఫ్రేమ్‌లా ఎన్నో విధాలుగా వాడేయొచ్చు

0
కాదేది కవితకి అనర్హం అన్నట్లుగా.. కాదేది క్రియేటివిటీకి అనర్హం. మనం పనికి రాదని చూసే న్యూస్‌పేపర్‌తో కూడా ఎన్నో వస్తువుల్ని చేసి పెట్టేయొచ్చు. ఇంట్లో డెకరేట్ చేసి పెట్టే వస్తువుల నుంచి యాక్సెసరీస్ వరకూ చేతులతో ఎన్నో రకాల కళాఖండాలని తయారుచేసి పెట్టొచ్చు.
మనకి ఇంట్లో వాడే వస్తువులుగా వాటిని మలపొచ్చు. అంతేనా, ఎన్నో రకాలుగా న్యూస్‌పేపర్‌ని రీయూజ్ చేయొచ్చు. దానికి కాస్తా క్రియేటివిటీ ఉంటే చాలు. చిన్న చిన్న బ్యాగ్స్ దగ్గర్నుంచీ ఎన్వలాప్‌లా ఇలా ఎన్నో రకాలుగా వాడొచ్చు. అంతేకాకుండా మరెన్నో వస్తువుల్ని కూడా తయారుచేయొచ్చు. మరి పేపర్‌తో చేయగలిగే ఆ వస్తువులు ఏంటి? దానిని మళ్లీ ఎలా రీయూజ్ చేయాలో ఇప్పుడు చూడండి.

Motivational Quotes By Elon Musk: లక్ష్య సాధనకు మస్క్ చెప్పిన పవర్ ఫుల్ కోట్స్, జీవితంలో ఎదగాలంటే ఓ లుక్కేయండి!

0
ఎలాన్ మస్క్ స్టైలే వేరు. రోజంతా ఒకే పనిపై దృష్టి పెట్టకుండా, తన రోజువారీ క్యాలెండర్‌ను 5 నిమిషాల విభాగాలుగా విభజించుకుని ప్రతి నిమిషాన్ని అత్యంత కచ్చితత్వంతో వినియోగిస్తారు. విలువ చేకూర్చని పెద్ద పెద్ద మీటింగ్‌లు సమయం వృధా అని మస్క్ భావిస్తారు. ఏదైనా మీటింగ్‌లో మీ ఉనికి ఎవరికీ ఉపయోగపడటం లేదనిపిస్తే, వెంటనే మర్యాదగా బయటకు వెళ్లిపోవాలని తన ఉద్యోగులకు సూచిస్తారు. సుదీర్ఘ చర్చల కంటే వేగంగా ఒక నిర్ణయం తీసుకుని, అది తప్పయితే అంతే వేగంగా సరిదిద్దుకోవడం ఉత్తమమని ఆయన నమ్ముతారు.