Home Blog Page 121

నిఫ్టీ 50 కి ఆరేళ్లలో ఇదే తొలిసారి.. వరుసగా 7వ వారం నష్టాలు.. FII అమ్మకాలు, క్రూడ్ సెగ!

0
Nifty 50 Weekly Loss: భారత స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 50 వరుసగా ఏడో వారం నష్టాల్లో ముగిసింది. గత ఆరేళ్లలో ఇలా సుదీర్ఘంగా నిఫ్టీ 50 నష్టపోవడం ఇదే తొలిసారి. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ గరిష్ఠ స్థాయిలకు పెరగడం, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ఎఫ్ఐఐ అమ్మకాలు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. వచ్చే వారం ఇంకా యూఎస్ ఫెడ్ నిర్ణయాలు, ఆర్థిక డేటా వంటివి కీలకం కానున్నాయి.

Ethanol Car: పెట్రోల్ బదులు పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు.. లీటరుకు ఖర్చు రూ. 25 మాత్రమే.. గడ్కరీ కీలక ప్రకటన

0
Toyota Innova Ethanol Car: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై చర్చ నడుస్తున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరో కీలక ప్రకటన చేశారు. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారును తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవా అక్టోబరులో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఇంకా నడుస్తున్న సమయంలో విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు.

బ్యాంకింగ్ సెక్టార్‌లో విలీనాల జోరు.. రెండు ప్రైవేట్ బ్యాంకుల విలీనం! వేలాది ఉద్యోగుల సంగతేంటి?

0
Federal Bank Jana SFB Deal: కొంత కాలంగా దేశంలో బ్యాంకుల విలీనం ప్రక్రియ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా ప్రభుత్వ బ్యాంకులు విలీనం అవుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కొన్నింట్లో ఇతర విదేశీ సంస్థలు కూడా వాటాల్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో మరో విలీనం జరుగుతుందన్న అంచనాలు పెరిగాయి. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు- ఫెడరల్ బ్యాంకులో విలీనం కానుందని చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం.

Tata Cliq: టాటా గ్రూప్‌ ఇ- కామర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా తగ్గుతున్న నష్టాలు.. పెరిగిన ఆదాయం!

0
Tata Cliq Loss Reduction: టాటా గ్రూప్‌కు చెందిన ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ టాటా క్లిక్ నిర్వహణ సంస్థ టాటా UniStore 2025-26 ఆర్థిక సంవత్సరంలో నష్టాల్ని 19 శాతానికి తగ్గించుకుంది. రూ. 314 కోట్లుగా ఉన్న నికర నష్టం రూ. 253 కోట్లకు తగ్గగా, ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ. 354 కోట్లకు పెరిగింది. ఫైనాన్స్ ఖర్చు 80 శాతం వరకు తగ్గడం కూడా కంపెనీ పనితీరు మెరుగుపడటానికి తోడ్పడింది.

SECL IPO: ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. కోల్ ఇండియా నుంచి మరో ఐపీఓ వచ్చేస్తుంది.. టార్గెట్ రూ. 7600 కోట్లు!

0
Coal India Subsidiary IPO: దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా నుంచి ఇటీవలి కాలంలో వరుసగా ఐపీఓలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఇప్పటికే రెండు ఐపీఓలు రాగా మరో రెండు ఐపీఓలు సిద్ధంగా ఉన్నాయి. కోల్ ఇండియా తన అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) ను మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు చూస్తోంది. ఈ ఐపీఓ ద్వారా 800 మిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది.

Hyderabad Ganesh Nimajjanam: ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం.. ఆనందంతో డ్యాన్స్ చేసిన సీపీ సజ్జనార్

0
పదకొండు రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న గణపతులు.. నిమజ్జనం ప్రక్రియ హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరగడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా శోభాయాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కలిసి సీపీ సజ్జనార్ డ్యాన్స్ చేశారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణపతి విగ్రహాలను మొత్తం 45 లక్షల మంది దర్శించుకున్నారు.

Khairatabad By election: ఖైరతాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పోటీ.. కవిత సంచలన ప్రకటన

0
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన (TRs) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బంజారాహిల్స్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌ వ్యవహారం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల మరణాల గణాంకాలను ప్రస్తావిస్తూ వైద్య రంగంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, దానం నాగేందర్ అనర్హతను హైకోర్టు ప్రకటించడం, ఆ తీర్పుపై ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

నేను పదిసార్లు ఓటేసిన నిజామాబాద్‌లో నా ఓటు తొలిగించే కుట్ర: టీపీసీసీ

0
SIR ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీ జరుగుతోందని, లౌకికవాదుల ఓట్లు తొలగించే ప్రయత్నాలు ఉన్నాయని ఆరోపించారు. నిజామాబాద్‌లో తన ఓటును తొలగించేందుకు కుట్ర చేశారని, తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎన్నికల సంఘంపై చర్యల కోసం మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. SIRకు వ్యతిరేకంగా సోమవారం అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Vemulawada Temple: రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆలయంలో డిజిటల్‌ చెల్లింపులు, ఇక నగదుతో పనిలేదు

0
Vemulawada Devotee Facilities: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం డిజిటల్‌ చెల్లింపులను విస్తరిస్తున్నారు. ఆలయ ప్రాంగణం, భీమేశ్వరసదన్‌లో కియోస్క్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. బుకింగ్‌ కౌంటర్‌, ప్రొటోకాల్‌ కార్యాలయం, విరాళాల కౌంటర్లలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లింపులు చేయవచ్చు. త్వరలో పీవోఎస్‌ మిషన్ల సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, వసతి గదులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. పారదర్శకత, భక్తులకు నగదు కష్టాలు లేకుండా చేయడమే లక్ష్యమని ఈవో రమాదేవి తెలిపారు.

Ganesh Immersion Police Dance: గణేశ్‌ నిమజ్జనంలో పోలీసుల డ్యాన్స్‌‌లు వైరల్‌.. స్టెప్పులతో అదరగొట్టిన ఖాకీలు..!

0
Hyderabad Ganesh Nimajjanam: హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో పోలీసుల డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనం సమయంలో కొందరు పోలీసుు నాగిని స్టెప్పులతో సందడి చేశారు. చుట్టూ ఉన్న పోలీసులు, భక్తులు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. మరో వీడియోలో ఇడియట్ సినిమాలోని పాటకు ఓ వ్యక్తి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. నిమజ్జన వేడుకల మధ్య ఈ సరదా దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.