Toyota Innova Ethanol Car: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై చర్చ నడుస్తున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరో కీలక ప్రకటన చేశారు. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారును తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవా అక్టోబరులో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఇంకా నడుస్తున్న సమయంలో విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు.


