Home Blog Page 122

ఏషియన్ గేమ్స్ 2026 క్వార్టర్స్‌లో టీమిండియా ప్రత్యర్థి ఖరారు..!

0
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో నేపాల్, జపాన్ మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ ఫలితంతో ఆతిథ్య జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, నేపాల్, అఫ్గానిస్థాన్ గ్రూప్-ఏ నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఈ ఫలితంతో క్వార్టర్ ఫైనల్స్‌లో రెండు మ్యాచులు ఖరారయ్యాయి. క్వార్టర్స్‌లో అఫ్గానిస్థాన్‌తో భారత్, శ్రీలంకతో నేపాల్ తలపడనున్నాయి. క్రితం ఏషియన్ గేమ్స్ ఫైనల్‌లో భారత్, అఫ్గానిస్థాన్ జట్లే తలపడటం గమనార్హం. ఈసారి ఈ రెండు జట్లు క్వార్టర్స్‌లో తలపడనున్నాయి.

కబడ్డీ కోర్టులో భారత్‌దే రాజ్యం.. ఇరాన్‌ను ఓడించి నాలుగోసారి ‘గోల్డ్’ కొట్టిన ఉమెన్స్ టీమ్!

0
ఐచి-నగోయా ఏషియన్ గేమ్స్ 2026 లో భారత మహిళల కబడ్డీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌ను 37-34 తేడాతో ఓడించి నాలుగోసారి ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. తొలి సగంలో 22-12తో భారీ ఆధిక్యంలో ఉన్న భారత్‌కు, మ్యాచ్ చివర్లో ఇరాన్ గట్టి పోటీ ఇచ్చింది. అయినప్పటికీ మన ప్లేయర్లు డిఫెన్స్‌లో నిలకడగా రాణించి విజయాన్ని ఖాయం చేశారు.

పాక్ క్రికెట్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. మహమ్మద్ రిజ్వాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు..!

0
పాకిస్తాన్ క్రికెట్‌లో మరో భారీ వివాదం రేగింది. లార్డ్స్ టెస్ట్ తర్వాత అర్ధరాత్రి 1 గంటకు స్టార్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ ఫోన్‌ను పాక్ దర్యాప్తు ఏజెన్సీలు సీజ్ చేశాయి. ఆన్‌లైన్ బెట్టింగ్, ఫిక్సింగ్ అనుమానాలతో ఎఫ్‌ఐఏ, ఎన్‌సీసీఐఏ విచారణ చేపడుతున్నాయి. ఎలాంటి వారెంట్ లేకుండా ఫోన్ తీసుకుని తనను వేధిస్తున్నారంటూ రిజ్వాన్ లాహోర్ హైకోర్టుకెళ్లగా, పిటిషన్ కొట్టివేసిన కోర్టు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. దీంతో రిజ్వాన్ క్రికెట్ కెరీర్ అనిశ్చితిలో పడింది.

Uttar Pradesh: టీచర్ ఉద్యోగం కోసం దాదాపు 30 ఏళ్ల పోరాటం.. 59 ఏళ్ల వయసులో సాధించాడు

0
టీచర్ ఉద్యోగం సాధించాలనేది ఆయన కల. పలుసార్లు రాత పరీక్షలో అర్హత సాధించి, ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యాడు. కానీ, అన్నిసార్లు అతడ్ని బ్యాడ్ లక్ వెంటాడింది. ఇలా ఒకటి రెండు సార్లు కాాదు ఏకంగా 8 సార్లు విఫలమైనా.. ప్రయివేట్ స్కూల్‌లో పనిచేస్తూ పరీక్షకు సిద్ధమయ్యేవాడు. చివరకు 59 ఏళ్ల వయసులో అతడి లక్ష్యం నెరవేరింది. యూపీకి చెందిన విజయ్ కుమార్ శర్మ.. సీఎం చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు.

జైలు నుంచి పారిపోయి.. కాంబోడియా వెళ్లి, అక్కడి మహిళతో సహజీవనం.. ఇప్పుడు పెరోల్ మీద బయటకొచ్చి పెళ్లి..!

0
హర్యానాలోని ఝజ్జర్ జిల్లా బద్లీ గ్రామానికి చెందిన మణ్‌పాల్ ధిల్లా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్. హత్య కేసుల్లో జీవిత శిక్ష అనుభవిస్తోన్న ధిల్లా.. 2018లో పెరోల్ మీద బయటకొచ్చి.. తప్పుడు డాక్యుమెంట్లతో దేశం విడిచి పారిపోయాడు. కంబోడియాలో తలదాచుకున్న ధిల్లా.. అక్కడే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో సహజీవనం చేసి నలుగురు పిల్లలను కన్నాడు. గత ఏడాది అతణ్ని భారత అధికారులు కంబోడియా నుంచి ఇండియాకు తీసుకొచ్చి జైల్లో వేశారు. ఇప్పుడు పెరోల్ మీద విడుదలైన అతడు తన ప్రేయసి పెళ్లాడి మళ్లీ జైలుకెళ్లాడు.

‘పగలు భద్రత అంటారు.. రాత్రివేళ తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతారు’ ఐరాసలో పాక్‌ తీరును ఎండగట్టిన భారత్

0
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదంపై మరోసారి సన్నాయి నొక్కులు నొక్కారు. కశ్మీర్ అంశంపై కూడా ప్రస్తావించడంతో భారత్ దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదానికి పాక్ బ్రాండ్ అంబాసిడర్ అని తూర్పారబట్టింది. అక్కడ మైనార్టీలపై జరుగుతున్న దాడులు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికి తెలుసనని మండిపడింది. అబద్దాన్ని పదే పదే చెబితే నిజం అయిపోదని ఐరాసలో భారత్ దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బెంగళూరులో ఉండిపోవడానికే డజను మందికిపైగా ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు.. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలతో దుమారం

0
బెంగళూరు పట్టణీకరణ, నగరంలో జనాభా పెరుగుదలపై కర్ణాటక శాసనసభలో రెండు రోజుల కిందట చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమాధానం ఇస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బెంగళూరు వచ్చేవాళ్లు తిరిగి వెళ్లడానికి ఇష్టపడరని, ఈ నగరంలోనే స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉండిపోవడానికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

నీకు 21 ఏళ్లు వచ్చాకే నీ ప్రియురాలిని పెళ్లి చేసుకో అన్నందుకు.. పోలీస్ ఆఫీసర్ అయిన తండ్రిని చంపిన కొడుకు

0
ఇప్పటికే ఓ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన ఓ టీనేజర్.. పోలీస్ ఆఫీసర్ అయిన తన తండ్రిని కాల్చి చంపాడు. ముఖ్యంగా కేవలం 18 ఏళ్ల వయసు మాత్రమే కల్గిన ఆయన ఇప్పుడే తన ప్రియురాలిని పెళ్లాడతానని, అందుకోసం డబ్బులు ఇవ్వాలని తండ్రిని వేధించాడు. కానీ చట్టబద్ధమైన 21 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆగాలని తండరి చెప్పడంతో.. తీవ్ర కోపోద్రిక్తుడైన కుమారుడు కన్నతండ్రినే నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఆపై కన్నతల్లిని కూడా చంపాలని ప్రయత్నించగా.. పారిపోయి ఆమె ప్రాణాలు కాపాడుకుంది.

ఏపీలోనే తొలిసారి.. కర్నూలులో ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్.. ఇక్కడే పైలట్ శిక్షణ పొందొచ్చు..!

కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమైంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్‌ ఇక్కడ ప్రారంభమైంది. ఈ పైలట్ ట్రైనింగ్ సెంటర్‌ను మంత్రులు ఘనంగా ప్రారంభించారు. అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ ఏవియేషన్ అకాడమీలో తొలుత విమాన పైలెట్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ఆ సంస్థ రెండు శిక్షణ విమానాలను కర్నూలుకు తీసుకొచ్చింది. ఈ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే రాష్ట్ర యువతకు ఇది మంచి అవకాశం కానుంది. శిక్షణ కోసం ఎక్కడకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఏపీ సత్తా.. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీకి స్కోచ్ గోల్డ్ పురస్కారం

ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరిసింది. ఏపీ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ‌కి గుడ్ గవర్నెన్స్ విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. ఆహార భద్రతలో విశిష్ట సేవలు అందించినందుకు ఈ పురస్కారం దక్కింది. ఎన్ జీ రంగా యూనివర్సిటీ స్కిల్ సెంటర్లు, డ్రోన్ సెంటర్లతో రైతులకు ఆధునిక సేవలు అందిస్తుంది.