Home Blog Page 123

విజయవాడ: దసరాకు దుర్గమ్మ దర్శనం అందరికీ ఉచిత దర్శనం.. ఆ దర్శన టికెట్లన్నీరద్దు, వారికి మాత్రం స్పెషల్​ టికెట్లు​

Vijayawada Temple Dasara Darshan Details: విజయవాడ దుర్గ గుడిలో ఈసారి దసరా ఉత్సవాల సమయంలో భక్తుల దర్శనాలపై ఆలయ అధికారులు ఫోకస్ పెట్టారు. దసరా సమయంలో ‘భవానీ ప్రత్యేక దర్శనం’ పేరుతో టికెట్లు జారీ చేసి.. ఒక ప్రత్యేక క్యూలైన్​ను ఏర్పాటు చేయనున్నారు. సామాన్య భక్తులందరికి ఉచితంగా దర్శనం కల్పిస్తారు. ఐదు లైన్లలో సాధారణ భక్తుల్ని దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఈ భవానీ ప్రత్యేక దర్శన టికెట్లను ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు, అధికారిక సిఫార్సులపై వచ్చేవారికి మాత్రమే కేటాయిస్తారు.

ఏపీలో మై హోం ఇండస్ట్రీస్ రూ.3వేల కోట్ల పెట్టుబడి.. పల్నాడు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ, ప్రభుత్వం ప్రోత్సాహకాలు

My Home Cement Factory In Andhra PradesH: ఏపీలో పెట్టుబడులు పెట్టనున్న వివిధ సంస్థలకు టైలర్‌మేడ్‌ విధానంలో ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎస్‌ఐపీబీ ద్వారా హోం ఇండస్ట్రీ, హిందుస్థాన్‌ కోకాకోలా, గోవా షిప్‌యార్డుతో పాటు పలు సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదం తెలిపింది. మై హోం ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఏపీ ఇండిస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ కింద స్థిర మూలధన పెట్టుబడిపై రూ.1,129.36 కోట్ల మేర ప్రోత్సాహకాల రూపంలో చెల్లించనుంది.

టీడీపీకి ఏడాదిలో రూ.58 కోట్ల విరాళాలు వచ్చాయి.. అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిన విరాళాలు

TDP Recevied Rs 58 Crores Donations: టీడీపీకి ఏడాదిలో రూ.58 కోట్లు విరాళాలు అందాయి.. 2025-2026లో ఈ విరాళాలు పార్టీకి అందజేశారు. విచిత్రంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విరాళాలు తగ్గడం ఆసక్తికరంగా మారింది. 2023-2024లో రూ.100 కోట్లు విరాళాలు రాగా.. 2024-2025లో రూ.83 కోట్లు విరాళాలు అందాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రూ.100 కోట్లు రాగా.. ఇప్పుడు రూ.58 కోట్లు మాత్రమే వచ్చాయి. విరాళాలకు సంబంధించిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్డేట్.. రూ.30,491 కోట్లు నాలుగు ప్యాకేజీలుగా, కృష్ణా నదిపై రెండు బ్రిడ్జిలు

Amaravati Outer Ring Road Four Packages: అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను నాలుగు ప్యాకేజీలుగా నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ప్రతిపాదనలు పంపారు. కృష్ణా నదిపై రెండు వంతెనలు, మూడు సొరంగాలు కూడా నిర్మిస్తారు. 189.93 కి.మీ. ఓఆర్‌ఆర్, 5.20 కి.మీ. అనుసంధాన రహదారి కలిపి మొత్తం 195.13 కిలోమీటర్లు ఉంటుంది. సివిల్‌ పనుల అంచనా రూ.10,595 కోట్లు అంచనాను రూపొందించారు. ఔటర్ రింగు రోడ్డుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చెత్త తీసుకొచ్చి ఇస్తే కుక్కర్ గెలుచుకోవచ్చు.. ప్రజలు అద్భుత అవకాశం

AP Swachh Ratham Pressure Cooker Draw: ఏపీలో స్వచ్ఛ రథాల ద్వారా పొడి చెత్తను సేకరిస్తున్నారు. ప్రజలు పొడి చెత్తను తీసుకొచ్చి ఇస్తే సరుకులు అందజేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛ రథాల దగ్గరకు చెత్త తీసుకొచ్చి ఇచ్చి సరుకులు తీసుకెళుతున్నారు. తాజాగా ఈ దసరాకు స్వచ్ఛ రథాల ద్వారా చెత్తను సేకరించి లక్కీ డ్రా తీయనున్నారు. చెత్తను తీసుకొచ్చిన వారికి ఓ కూపన్ ఇస్తారు.. నెలపాటూ వీటిని అందజేస్తారు. అక్టోబర్ 25న లక్కీ డ్రా నిర్వహించి కుక్కర్లు బహుమతిగా అందిస్తారు.

ఏపీ డిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవచ్చు.. ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరిశీలించుకోవచ్చు

AP Govt Certificates Verification Through Digiverify Platform: ఏపీలో డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఏపీడిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు పరిశీలనచేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరిశీలించుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు సర్టిఫికెట్లను డిజీవెరిఫైలో భద్రపరిచారు. ప్రధానంగా విద్యార్థులకు ఇబ్బందు లేకుండా పోతాయని అధికారులు చెబుతున్నారు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సులభంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల శుభవార్త.. ప్రమోషన్లపై డీపీసీ షెడ్యూల్‌ విడుదల

AP Govt Employees Promotions DPC: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు డీపీసీ షెడ్యూల్‌ విడుదలైంది. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ప్యానల్‌ సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా ఈ-డీపీసీ నిర్వహిస్తారు. ఈ నెల 30లోగా అంచనా ఖాళీలు, సీనియార్టీ, జామితాన రివ్యూ పూర్తి చేయనున్నారు. అక్టోబరు 21లోపు తుది దశలో ప్రమోషన్లకు సంబంధించి ఖాళీల అంచనాను ఖరారు చేస్తారు.. ఈ మేరకు షెడ్యూల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో దసరా వేడుకలకు వెళుతున్నారా.. ఆర్జిత సేవల టికెట్ల విడుదల, బుక్ చేస్కోండి

Vijayawada Durga Temple Dussehra Celebrations 2026 Tickets Released: దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఆర్జిత సేవల టికెట్లు విడుదలయ్యాయి. వర్చువల్‌ లింక్‌ ద్వారా భక్తులకు ప్రత్యేక పరోక్షవీక్షణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్జిత సేవ రుసుము ఒక రోజుకు రూ.1500, పది రోజుల ప్యాకేజీ రూ.11,116గా నిర్ణయించారు. దేవాదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ , మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ నంబరు 95523 00009 ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీశైలం అక్టోబర్ నెల దర్శనం టికెట్లు విడుదల.. దసరా సమయంలో స్పర్శ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

Srisailam Darshan Tickets Rooms October 2026: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం అక్టోబరు నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మనమిత్ర యాప్‌ (95523 00009) ద్వారా 80 శాతం టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చని ఆలయ ఛైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అలాగే tms.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా 20 శాతం టికెట్లను బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. ఈ మేరకు మొత్తం 14 రకాల ఆర్జిత సేవలను బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఏపీలో హోంగార్డులకు శుభవార్త.. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో 10శాతం రిజర్వేషన్

AP Stipendiary Constable Posts 10 Percent Reservation: ఆంధ్రప్రదేశ్‌‌లో హోంగార్డులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. పోలీస్ శాఖలో స్టిపెండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల నియామకాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గతంలో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను (జీవో) సవరిస్తూ ఆదే శాలు విడుదల చేశారు.పోలీస్ రవాణా సంస్థ (ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్) పరిధిలో 198 స్టైపెండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.