టీచర్ ఉద్యోగం సాధించాలనేది ఆయన కల. పలుసార్లు రాత పరీక్షలో అర్హత సాధించి, ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యాడు. కానీ, అన్నిసార్లు అతడ్ని బ్యాడ్ లక్ వెంటాడింది. ఇలా ఒకటి రెండు సార్లు కాాదు ఏకంగా 8 సార్లు విఫలమైనా.. ప్రయివేట్ స్కూల్‌లో పనిచేస్తూ పరీక్షకు సిద్ధమయ్యేవాడు. చివరకు 59 ఏళ్ల వయసులో అతడి లక్ష్యం నెరవేరింది. యూపీకి చెందిన విజయ్ కుమార్ శర్మ.. సీఎం చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు.


