కృష్ణా జిల్లా పెనమలూరులో మోసం బయటపడింది. ఎన్ఆర్ఐల భూములే టార్గెట్ చేస్తూ వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్గా విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన బిక్కిన సుబ్బారావుకు సంబంధించిన 800 గజాల భూమిని కొట్టేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేసి ముఠాను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో ఇంకొందరు పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు.. ఎన్ఆర్ఐల భూములే టార్గెట్.. పక్కా స్కెచ్‌తో భూ కబ్జా
RELATED ARTICLES


