తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఆర్టీఐపై కీలక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పబ్లిక్ విభాగాన్ని ఆర్టీఐ పరిధి నుంచి మినహాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసింది. పబ్లిక్ విభాగాన్ని ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌గా గుర్తిస్తూ మినహాయింపు ఇచ్చారు. దీంతో పోలీసు కాల్పులు, కస్టడీ మరణాలు, పోలీసుల చిత్రహింసలు, సామాజిక-కుల ఘర్షణలు, రాజకీయ, విద్యార్థి, రైతుల ఆందోళనలకు సంబంధించిన సమాచారంపై ఆర్టీఐ ద్వారా పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తాయి. ప్రతిపక్షాలతోపాటు అధికార కూటమి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో తాజా ఉత్తర్వులతో పాత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.


