Home Blog Page 84

​రక్తహీనత తగ్గాలంటే మన ఊరిలో సులభంగా దొరికే మునగాకు + పాలకూర+ నువ్వులు బెస్ట్‌ ఛాయిస్‌!

0
ఎప్పుడూ నీరసంగా అనిపించడం, చిన్న పని చేసినా అలసిపోవడం, తరచూ తల తిరగడం, ఏ పని చేయాలన్నా శక్తి లేనట్టుగా ఉండటం.. మెట్లు ఎక్కితే త్వరగా అలసిపోవడం.. ఇవన్నీ చాలామంది సాధారణ బలహీనతగా భావిస్తుంటారు. కానీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనినే రక్తహీనత లేదా అనీమియా అంటారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఐరన్ లోపం, మారిన జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు.

శరీరకణాలకు ఆక్సిజన్‌ను అందించే హిమోగ్లోబిన్ లోపించడం వల్ల తరచుగా నీరసం, అలసట, తల తిరగడం, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశలోనే దీనిని గుర్తించి మన వంటింట్లో లేదా మనకు ఊరిలో సులభంగా అందుబాటులో ఉండే పోషకాహాం, మూలికలను ఉపయోగిస్తే ఐరన్ స్థాయిలను వేగంగా పెంచుకోవచ్చు. మరి రక్తహీనత ఉన్నప్పుడు ఆహారంలో ఏం చేర్చుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Price Outlook: రూ.1.25 లక్షల దిగువకు బంగారం ధర.. అమెరికన్ బ్యాంక్ షాకింగ్ అంచనా.. కానీ 2027 నాటికి భారీ జంప్!

0
Gold Price Outlook: బంగారం ధరలు గత కొద్ది రోజుల నుంచి వరుసగా పడిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొద్ది రోజుల్లోనే తులం బంగారం రేటు రూ.1.25 లక్షల దిగువకు పడిపోతుందని అమెరికన్ బ్యాంక్ అంచనా వేసింది. అయితే, కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడం వంటి కారణాలతో 2026 చివరి నాటికి ఔన్స్ బంగారం రేటు 5000 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

ఉద్యోగుల తొలగింపులో ఏఐ వినియోగం పూర్తిగా నిషేధం.. కాలిఫోర్నియా గవర్నర్ సంచలన చట్టం

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సంస్థలు తమ ఉద్యోగులను తొలగింపునకు ఏఐ వ్యవస్థలను వినియోగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని సంస్థలు.. ఉద్యోగుల తొలగింపునకు ఏఐను వాడకుండా నిషేధించింది. తప్పనిసరిగా మానవ పర్యవేక్షణ, పరిశీలన తర్వాతే తొలగించాలని తాజాగా తీసుకొచ్చిన చట్టంలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఉద్యోగ, కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మోటిక్స్ విక్రయాలు.. రూ.7 లక్షల ఉత్పత్తులు సీజ్, ముంబై లింక్‌పై దర్యాప్తు

0
పాకిస్థాన్‌లో తయారైన అనధికారిక కాస్మోటిక్స్ హైదరాబాద్‌లో విక్రయించడం తీవ్ర కలకలం రేపుతోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.7 లక్షల విలువైన క్రీములు, సబ్బులు, ఇతర బ్యూటీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి భారత్‌లోకి దిగుమతి చేసుకునేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ లేదని అధికారులు తెలిపారు. ఈ పాకిస్థాన్ కాస్మోటిక్స్ సరఫరా వెనుక ముంబైకి చెందిన డీలర్ ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు ఆమోదం

0
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, రైతులు, విద్యుత్, వర్షాభావ పరిస్థితులు, డిజిటల్ మీడియా సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న 2 డీఏలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీఏల అమలుతో రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలో 17 శాతం వర్షపాతం లోటు, 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. కరువు సాయంపై కేంద్రాన్ని కోరాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు, 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ సామర్థ్యం, కోహెడ ఫ్రూట్ మార్కెట్, 10 ఈపీసీ ప్రాజెక్టులపై కూడా నిర్ణయాలు తీసుకుంది.

చెక్‌పవర్‌ విషయంలో సర్కార్ ఆదేశాలు.. ఉపసర్పంచ్ సంతకం చేయకపోతే EO, MPDO చేయొచ్చు..!

0
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య విభేదాల కారణంగా చెక్కులపై సంతకాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. తగిన కారణం లేకుండా ఉప సర్పంచ్ 7 రోజులకు మించి చెక్కులపై సంతకం చేయకుండా జాప్యం చేస్తే జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టనున్నారు. ఉద్దేశపూర్వకంగా చెల్లింపులను అడ్డుకున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ లేదా ఎంపీడీవోలో ఒకరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఖైరతాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లే.. ఆ లెక్క తేలాల్సిందే.. ఈసీ కీలక నిర్ణయం!

0
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి విజయం సాధించగా.. విజయారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. దానం నాగేందర్ అనర్హతకు గురై సీటు ఖాళీ కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే విజయారెడ్డి పిటిషన్‌తో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. హైకోర్టు తుది తీర్పు తర్వాతే తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది వర్షాలే కాదు, చలి కూడా తక్కువే.. వాతావరణశాఖ కీలక ప్రకటన

0
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అక్టోబర్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముంది. తెలంగాణలో 615.5 మిల్లీమీటర్ల వర్షపాతంతో 17 శాతం లోటు నమోదైంది.

రాశిఫలాలు 02 అక్టోబర్ 2026: పరియన్ యోగం వేళ మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ఆశీస్సులు!

రాశిఫలాలు 02 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు వ్యతిపాత, వరియన్ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున శుక్రుడి స్థానం బలపడే అవకాశం ఉంది. ఈ శుభ సమయంలో మిథునం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 02 October 2026: ఈరోజు నక్షత్రం, తిథి, యోగం, శుభ ముహుర్తాలు, రాహుకాలం వివరాలివే

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని షష్ఠి తిథి నాడు, శుక్రవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.