October Born People: హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ మాసం ఎంతో కీలకమైంది. ఇదే మాసంలోనే అశ్వీయుజ మాసం ప్రారంభం కానుంది. అంతేకాదు ఇదే సమయంలో శారదీయ నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి నెలా తనదైన ప్రత్యేక శక్తిని మరియు స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తులు ఇతరుల కన్నా భిన్నమైన వ్యక్తిత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో పుట్టిన సమయం, నక్షత్రాన్ని బట్టి వారు ఎలా ప్రవర్తిస్తారు? వీరిలో ఎలాంటి అలవాట్లు, అభిరుచులు ఉంటాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వన్డే ప్రపంచకప్ 2027.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది. గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. మూడు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్‌ను గెలవడమే కాక రోహిత్, కోహ్లీలకు ఘనమైన వీడ్కోలు అందించాలని భారత్ పట్టుదలతో ఉంది.
వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. భారత్ vs పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు ఈ టోర్నీ అలరించనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి. 14 జట్లను మొత్తంగా రెండు గ్రూపులుగా విభజించారు. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తొలి పోరు ఆడనుంది. అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్ వేదికగా పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
Maharashtra: విహారయాత్రలో తీవ్ర విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు మృతి
విద్యార్థుల విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. బీచ్‌కు వెళ్లిన విద్యార్థులు.. సముద్రంలో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా 8 మంది ఈ ఘటనలో మృతిచెందారు. హృదయవిదారక ఈ ఘటన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ కోచింగ్ సెంటర్‌కు చెందిన 45 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు మొత్తం 48 మంది దివేగర్ బీచ్‌కు వెళ్లారు. వీరిలో కొందరు లోతును అంచనా వేయకుండా సముద్రంలో దిగి కెరటాల తీవ్రతకు కొట్టుకుని పోయారు.
గ్రీన్ ఎనర్జీ భద్రతలో గేమ్ ఛేంజర్.. తక్కువ ధరకే విద్యుత్.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం ధార స్కీమ్
కేంద్ర క్యాబినెట్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-III పథకానికి బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1,86,405 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా కోసం అంతర్రాష్ట గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. ఈ పథకం గ్రీన్ ఎనర్జీకి ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. పర్యావరణపరంగా సుస్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడమే కాదు.. విద్యుత్ , తయారీ, నిర్మాణ రంగాల్లో పెద్దఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలను ఈ పథకం సృష్టిస్తుంది.
బిజినెస్ అనుకుంటే ఒక్క సెమినార్‌తో మారిపోయిన కెరీర్ ప్లాన్.. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ స్ఫూర్తిదాయక ప్రయాణం
టెక్స్టైల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ సెమినార్‌తో ఏవియేషన్ వైపు అడుగులేశారు కెప్టెన్ స్మిత్ మచ్ఛార్. న్యూజిలాండ్‌లో శిక్షణ తీసుకని, ఆ తర్వాత స్పైస్‌జెట్‌లో పైలట్‌గా కెరీర్ ప్రారంభంచి.. దశాబ్ద కాలానికి పైగా సాగిన తన అనుభవంతో, సమయస్ఫూర్తితో గాల్లో వందలాది ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచారు. ఆయన అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చారు. వాస్తవానికి తమ కుటుంబం టెక్స్టైల్ వ్యాపారం చేస్తుండటంతో అందులోనే తాను స్థిరపడాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగా ఆయన విద్యభ్యాసం సాగింది.
హాస్టల్ విద్యార్థులకు తీపి కబురు.. కొత్త మెనూ రెడీ.. ఇకపై రోజూ పాలు, పండ్లు, పోషకాహారం
హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన ఛార్జీలు అక్టోబర్ 1, 2026 అంటే గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా స్టూడెంట్స్‌కు కొత్త మెనూను ప్రభుత్వం రెడీ చేసింది. ఇందులో భాగంగా వారంలో ఆరు రోజులు గుడ్లు.. మూడు రోజులు చికెన్.. ప్రతిరోజూ పాలు, పండ్లు అందించేలా మెనూను రూపొందించడం జరిగింది. వీటితో పాటు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు పులిహోర, ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లు కూడా మెనూలో ఉన్నాయి. వీటితో పాటు రాగి లడ్డూ, మల్టీ మిల్లెట్ చిక్కీలు, పండ్లను కూడా మెనూలో పొందుపరిచారు.
వెనక్కి తగ్గేది లేదు.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కూటమి సర్కార్!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదరయ్యింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. బీసీలకు 34 శాతం కోటాపై ఇచ్చిన రెండు జీవోలను ఏపీ హైకోర్టు గురువారం కొట్టి వేసింది. అయితే దీనిపై వచ్చే సోమవారంలోపు పిటిషన్ వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ప్రభుత్వం వేసే పిటిషన్‌పై వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను నియమించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.
ఏపీలో 7 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం.. ఆ జిల్లాలో తీవ్ర లోటు..!
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. ఆ డేటా ప్రకారం ఏపీలో కేవలం 383.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏకంగా 34.9 శాతం లోటు వర్షపాతం రికార్డైంది. మొత్తం 28 జిల్లాల గణాంకాలను పరిశీలిస్తే కేవలం ఒక ఏడు జిల్లాల్లో మాత్రమే పరిస్థితి కాస్త బెటర్‌గా ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు , కాకినాడ కృష్ణా, గుంటూరు జిల్లాలో కాస్తా మంచి వర్షపాతం నమోదైంది. ఇక అన్నమయ్య జిల్లా సాధారణ వర్షపాతం 403.4 మిల్లి మీటర్లు ఉండగా, కేవలం 151.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది.
ఎగుమతుల్లో ఏపీ రికార్డ్.. రూ.1.76 లక్షల కోట్లతో సత్తా చాటిన రాష్ట్రం.. టాప్ లేపిన విశాఖ
విదేశాలకు ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటుకుంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ దేశాలకు అత్యధికంగా సరుకులు ఎగుమతి అయ్యాయి. రూ.1,76,503.37 కోట్ల విలువైన వివిధ రకాల ఉత్పత్తులను విదేశాలకు పంపింది. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కామర్స్ ఇంటెలిజెన్స్ గణాంకాలను రిలీజ్ చేసింది. ఆ లెక్కల ప్రకారం ఎగుమతుల్లో విశాఖపట్నం టాప్‌లో నిలిచింది. తూర్పుగోదావరి, చిత్తూరు, గుంటూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అలాగే రాష్ట్రం నుంచి ఎక్కువగా ఎగుమతైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి అత్యధికంగా మెరైన్ విదేశాలకు ఎక్స్పోర్ట్ అయింది.

