ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు ఈ టోర్నీ అలరించనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి. 14 జట్లను మొత్తంగా రెండు గ్రూపులుగా విభజించారు. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తొలి పోరు ఆడనుంది. అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్ వేదికగా పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.


