Home Blog Page 86

ఎగుమతుల్లో ఏపీ రికార్డ్.. రూ.1.76 లక్షల కోట్లతో సత్తా చాటిన రాష్ట్రం.. టాప్‌ లేపిన విశాఖ

విదేశాలకు ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటుకుంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ దేశాలకు అత్యధికంగా సరుకులు ఎగుమతి అయ్యాయి. రూ.1,76,503.37 కోట్ల విలువైన వివిధ రకాల ఉత్పత్తులను విదేశాలకు పంపింది. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కామర్స్ ఇంటెలిజెన్స్ గణాంకాలను రిలీజ్ చేసింది. ఆ లెక్కల ప్రకారం ఎగుమతుల్లో విశాఖపట్నం టాప్‌లో నిలిచింది. తూర్పుగోదావరి, చిత్తూరు, గుంటూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అలాగే రాష్ట్రం నుంచి ఎక్కువగా ఎగుమతైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి అత్యధికంగా మెరైన్ విదేశాలకు ఎక్స్‌పోర్ట్ అయింది.

క్రికెటర్లు మ్యాచ్ మధ్యలో నీళ్లు ఎందుకు ఎక్కువ తాగుతారు?

క్రికెటర్లు మ్యాచ్ మధ్యలో ఎక్కువగా నీళ్లు తాగుతారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

స్కిన్‌మలిజం vs 10 స్టెప్‌ స్కిన్‌ కేర్ మీ చర్మానికి ఏది బెటర్‌?

ప్రస్తుతం అందం కోసం ప్రతి ఒక్కరూ అనేక ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. కొంతమంది స్కిన్‌మలిజం ఫాలో అయితే మరికొంత మంది 10 స్టెప్‌ స్కిన్‌ కేర్ ఫాలో అవుతున్నారు. రెండిటీలో ఎది బెస్ట్‌ అనేది ఇక్కడ వివరించాం.

మీ ఇల్లు రిచ్‌గా కనిపించేలా చేసే మార్గాలు

మీ ఇల్లు చీప్ లుక్‌తో కనపడుతుందా. దీనికి మీరు ఇంట్లో వాడే ఈ వస్తువులు, సర్దడమే కారణం. అవేంటో తెలుసుకుని చూడండి.

ఇత్తడి వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచాలి?

ఇంట్లో ఇత్తడి వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఇత్తడి వినాయక విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచాలో ఇక్కడ వివరించాం.

వాతావరణం మారినపుడు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

సీజన్ మారినపుడు అనారోగ్యం బారినపడటం సహజమే. అయితే ఈ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

The Paradise: అన్నీ మన చేతుల్లో ఉండవు.. ‘ది ప్యారడైజ్’ నెగెటివ్ టాక్‌పై ‘సమ్మక్క’ సోనాలి స్పందన

The Paradise Movie: నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో ‘సమ్మక్క’ పాత్రలో నటించారు బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి. ఈ మూవీ నెగెటివ్ టాక్, మిక్స్‌డ్ రివ్యూలపై ఆమె తాజాగా స్పందించారు. నటీనటులు ఎంత అంకితభావంతో కష్టపడి పనిచేసినా తుది ఫలితం మన చేతుల్లో ఉండదని ఆమె పేర్కొన్నారు. ప్రతి సినిమాకు ఒకేలాంటి ఫలితం రాదని, రిజల్ట్ గురించి ఆలోచించకుండా నటులు తమ పనిపై దృష్టి పెట్టాలని సూచించారు.

Mohan Babu: ‘ది ప్యారడైజ్’ విషయంలో శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు కామెంట్స్

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ చిత్రంలో మోహన్‌ బాబు ‘శిఖంజా మాలిక్‌’ అనే విలన్ పాత్రలో మెప్పించారు. తాజాగా చిట్ చాట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ తనను మోసం చేశాడని సరదాగా అన్నారు. కథ చెప్పేటప్పుడు తన పాత్రకు భార్య ఉంటుందని కొన్ని సన్నివేశాలు వివరించారని, కానీ షూటింగ్ సమయంలో ఆ పాత్రను తొలగించామని చెప్పి భార్య లేకుండా చేశారని నవ్వుతూ వ్యాఖ్యానించారు మోహన్ బాబు.

Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ ప్రీమియర్స్ లేవు.. ఈసారి ఎలాంటి డౌట్స్ వద్దు: నాగవంశీ

Venkatesh & Trivikram’s Aadarsha Kutumbam: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రీమియర్ షోలు వేయడం లేదని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. అక్టోబర్ 6న ట్రైలర్ విడుదల చేసి, 7 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సందేహాలు లేకుండా చెప్పిన తేదీకే సినిమా వస్తోందని, ఫ్యామిలీస్ అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని నాగవంశీ కోరారు.

Geethanjali Re Release: నాగార్జున కల్ట్ క్లాసిక్ మూవీ మళ్లీ థియేటర్లలోకి.. ‘గీతాంజలి’ రీ-రిలీజ్ ఎప్పుడంటే?

అక్కినేని నాగార్జున, మణిరత్నం కలయికలో వచ్చిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలో అలరించడానికి రెడీ అయింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. గతంలో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 28న విడుదల చేయాలని భావించినప్పటికీ వాయిదా పడింది. ఇప్పుడు నవంబర్ 13న మరోసారి థియేటర్లలో ప్రేక్షకులకు మ్యాజికల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది.