పాకిస్థాన్‌లో తయారైన అనధికారిక కాస్మోటిక్స్ హైదరాబాద్‌లో విక్రయించడం తీవ్ర కలకలం రేపుతోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.7 లక్షల విలువైన క్రీములు, సబ్బులు, ఇతర బ్యూటీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి భారత్‌లోకి దిగుమతి చేసుకునేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ లేదని అధికారులు తెలిపారు. ఈ పాకిస్థాన్ కాస్మోటిక్స్ సరఫరా వెనుక ముంబైకి చెందిన డీలర్ ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


