HomeTELANGANAతెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు ఆమోదం

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు ఆమోదం

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, రైతులు, విద్యుత్, వర్షాభావ పరిస్థితులు, డిజిటల్ మీడియా సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న 2 డీఏలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీఏల అమలుతో రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలో 17 శాతం వర్షపాతం లోటు, 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. కరువు సాయంపై కేంద్రాన్ని కోరాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు, 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ సామర్థ్యం, కోహెడ ఫ్రూట్ మార్కెట్, 10 ఈపీసీ ప్రాజెక్టులపై కూడా నిర్ణయాలు తీసుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments