ఎప్పుడూ నీరసంగా అనిపించడం, చిన్న పని చేసినా అలసిపోవడం, తరచూ తల తిరగడం, ఏ పని చేయాలన్నా శక్తి లేనట్టుగా ఉండటం.. మెట్లు ఎక్కితే త్వరగా అలసిపోవడం.. ఇవన్నీ చాలామంది సాధారణ బలహీనతగా భావిస్తుంటారు. కానీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనినే రక్తహీనత లేదా అనీమియా అంటారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఐరన్ లోపం, మారిన జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు.
శరీరకణాలకు ఆక్సిజన్‌ను అందించే హిమోగ్లోబిన్ లోపించడం వల్ల తరచుగా నీరసం, అలసట, తల తిరగడం, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశలోనే దీనిని గుర్తించి మన వంటింట్లో లేదా మనకు ఊరిలో సులభంగా అందుబాటులో ఉండే పోషకాహాం, మూలికలను ఉపయోగిస్తే ఐరన్ స్థాయిలను వేగంగా పెంచుకోవచ్చు. మరి రక్తహీనత ఉన్నప్పుడు ఆహారంలో ఏం చేర్చుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


