Home Blog Page 42

నాగార్జున, బాలకృష్ణకి పోటీగా బరిలో దిగుతున్న కిరణ్ అబ్బవరం.. రియాలిటీతో రిస్క్ చేస్తున్నాడా?

2026 క్రిస్మస్ బాక్సాఫీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అక్కినేని నాగార్జున ‘కింగ్ 100’, నందమూరి బాలకృష్ణ ‘దాదా’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇప్పుడు యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా బరిలో దిగుతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రియాలిటీ’ చిత్రాన్ని డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీనియర్ స్టార్లతో పోటీకి రెడీ అయిన కిరణ్ అబ్బవరం.. కాస్త రిస్క్ చేస్తున్నారేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

NBK 112: కొరటాల శివ మాస్ స్కెచ్… నందమూరి బాలకృష్ణకు విలన్‌గా రాజశేఖర్?

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం మొదలైంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమాలో బాలయ్యకు దీటైన ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం సీనియర్ హీరో, ‘యాంగ్రీ మ్యాన్’ డాక్టర్ రాజశేఖర్‌ను సంప్రదించినట్లు ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. మాస్ హీరో బాలయ్య, విలక్షణ నటుడు రాజశేఖర్ ముఖాముఖి తలపడే సన్నివేశాలు వెండితెరపై హై-వోల్టేజ్ అనుభూతిని అందిస్తాయని భావిస్తున్నారు.

Mandaadi: ‘మండాడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్… నెల తిరక్కుండానే సూరి – సుహాస్ మాస్ మూవీ డిజిటల్ ఎంట్రీ

కోలీవుడ్ నటుడు సూరి, తెలుగు యువ నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ త్వరలోనే డిజిటల్ తెరపై సందడి చేయనుంది. సముద్రపు నేపథ్యం, సంప్రదాయ పడవల పందెం చుట్టూ సాగే ఈ చిత్రం థియేటర్లలో రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఘన విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 8 లేదా 9 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నెల రోజులు గడవకముందే ఇంతటి భారీ హిట్ సినిమా ఓటీటీ బాట పట్టడం సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

ఎవరూ నాకు ఆస్తులు గిఫ్ట్‌గా ఇవ్వలేదు… నిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు రాయొద్దు – రకుల్ ఆగ్రహం

బాలీవుడ్‌లో ఇటీవల జరిగిన ఐటీ సోదాల నేపథ్యంలో తనపై వస్తున్న నిరాధార కథనాలపై ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. తనకు ఎవరూ ఎలాంటి ఆస్తులను బహుమతిగా ఇవ్వలేదని, దేశంలోగానీ విదేశాల్లోగానీ తనకు ఎటువంటి బినామీ ఆస్తులు లేవని స్పష్టం చేశారు. అలాగే అక్రమ విదేశీ లావాదేవీలతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన తాను 20 ఏళ్ల వయస్సు నుంచే నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నానని తెలిపారు. రేటింగుల కోసం వాస్తవాలు నిర్ధారించుకోకుండా ఒకరి ప్రతిష్టను దిగజార్చేలా వార్తలు రాయడం సరికాదని, తప్పుడు కథనాలను ప్రచురించిన సంస్థలు వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు

సన్న బియ్యం vs స్టీమ్‌ రైస్‌.. బరువు తగ్గడానికి + షుగర్‌ ఉన్న వారికి ఏ బియ్యం మంచివి?

0
రకరకాల ఆహరపదార్థాలు తిన్నా కూడా అన్నం తింటేనే కానీ, కడుపు నిండిన ఫీలింగ్‌ రాదు కొందరికి. ముఖ్యంగా దక్షిణ భారతీయలకు ప్రతి రోజూ భోజనంలో అన్నం ఉండాల్సిందే. పప్పు, కూర, పులుసు, పెరుగు.. ఇలా రకరకాల వంటలతో అన్నాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. ఇంట్లో రోజూ అన్నం వండుతున్నా.. బియ్యం కొనేటప్పుడు మాత్రం చాలామందికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. సన్నగా, పొడవుగా కనిపించే బియ్యం ఒకవైపు.. కొద్దిగా భిన్నమైన రంగు, ఆకృతితో కనిపించే స్టీమ్‌ బియ్యం మరోవైపు.

రుచి, వాసన, అన్నం మెత్తగా ఉండటం, గింజలు విడివిడిగా రావడం.. ఇలా ఒక్కో బియ్యానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే కొందరు సన్న బియ్యాన్నే ఇష్టపడితే, మరికొందరు స్టీమ్‌ బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ రెండు రకాల బియ్యాన్ని తయారు చేసే విధానంలోనే అసలు తేడా ఉందా? వాటి పోషక విలువల్లో ఎంత మార్పు ఉంటుంది? అనే విషయం చాలామందికి పూర్తిగా తెలియదు. మరి సన్న బియ్యం, స్టీమ్‌ బియ్యం మధ్య ఉన్న అసలు తేడాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్‌ + గుండె జబ్బుల్ని తగ్గించే వెల్లుల్లి నిల్వ పచ్చడి తయారీ విధానం, పక్కా కొలతలతో!

0
ఆరోగ్యం అనగానే చప్పగా ఉండే ఆహారమే తినాలా, నోరూరించే పచ్చళ్లను పూర్తిగా దూరం పెట్టాలా అంటే అవసరం లేదనే చెప్పొచ్చు! మన వంటింట్లోని వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టే శక్తివంతమైన సహజ ఔషధం. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడే ఈ వెల్లుల్లిని రుచికరమైన పచ్చడిలా మారిస్తే? పక్కా కొలతలతో, నూనె, కారం సమపాళ్లలో వేసి చేస్తే రుచితో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది. మందుల అవసరం లేకుండా రక్తప్రసరణను మెరుగుపరిచే ఈ ఆయుర్వేద నిధి మీ ఇంటి భోజనంలోకి వస్తే.. ఇక రుచికి వంక లేదు.. ఆరోగ్యానికి తిరుగు లేదు.. ఆ ఫర్‌ఫెక్ట్ రెసిపీ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం..

మీ ఇంట్లో RO వాటర్‌ ప్యూరిఫయర్‌ ఉందా, నీళ్లలో TDS 25 కంటే తక్కువగా ఉంటే మంచిదా కాదా?

0
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ వాటర్‌ ఫిల్టరేషన్‌ కోసం రివర్స్ ఓస్మోసిస్ (RO) వాటర్ ప్యూరిఫైయర్లను ఉపయోగిస్తున్నారు. అందులో కనిపించే TDS నంబర్‌ తక్కువగా ఉంటే ‘నీరు చాలా ప్యూర్‌గా ఉంది’ అని అనుకుంటారు. కానీ TDS 25 కంటే కూడా తక్కువగా ఉంటే మాత్రం మరో సందేహం మొదలవుతుంది. ఇంత తక్కువ TDS ఉంటే నీటిలో అవసరమైన మినరల్స్‌ కూడా లేవా? అని. మరి ROలో TDS 25 కంటే తక్కువగా కనిపిస్తే దాని అర్థం ఏమిటి? మన ఆరోగ్యంపై దాని ప్రభావం ఏంటి? తెలుసుకుందాం.

పల్లీలు తిన్నాక నీరు తాగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదా, ఏం చేస్తే సమస్యలు రాకుండా ఉంటాయ్

0
​పల్లీలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. వీటిని తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. దీనికి కారణం పల్లీల్లోని మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్. వీటి వల్ల బ్లడ్ ప్రెజర్ మెరుగ్గా మారుతుంది. అంతేకాకుండా, పల్లీల్లోని ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉండడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువ సేపు ఆకలి అవ్వదు. పీనట్స్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే తినగానే వెంటనే బ్లడ్ షుగర్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు పెరగవు. ఇన్ని లాభాలున్న పల్లీలను తింటే ఏమైనా సమస్యలు వస్తాయా అంటే కొన్ని సందర్భాల్లో అలర్జీలు వస్తాయి. అంతేకాదు, పల్లీలు తిని నీరు తాగినా సమస్యలొస్తాయని చెబుతారు. ఇందులో నిజమెంత ఇప్పుడు చూద్దాం.

నటి అనన్య పాండే చెప్పిన బ్యూటీ సీక్రెట్‌.. మన ఇంట్లో ఉండే పసుపు + తేనె + పెరుగు చాలట!

0
సెలబ్రిటీలు బ్యూటీ కోసం ఏం చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఖరీదైన ఫేషియల్స్‌, విదేశీ బ్రాండ్ల స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ వాడుతారని అనుకుంటాం. కానీ నటి అనన్య పాండే చెప్పిన స్కిన్‌కేర్‌ సీక్రెట్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మన ఇంట్లో సులభంగా దొరికే పసుపు, తేనె, పెరుగు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు పదార్థాలను కలిపి ముఖానికి ఉపయోగిస్తారట. ఆ ఫేస్‌ ఫ్యాక్‌ ఏమిటో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

SBIలో రూ.1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. 1, 3, 5, 10 ఏళ్లలో చేతికి ఎంత వస్తుంది? లెక్కలు ఇవే!

0
SBI FD Calculator: స్థిరమైన రాబడి కోరుకునే వారిలో చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం రూ.1 లక్ష ఎఫ్‌డీ చేసినట్లయితే వచ్చే ఏడాది, 3, 5, 10 ఏళ్ల కాల వ్యవధులకు రాబడి ఎంత వస్తుంది? ప్రస్తుతం ఆయా కాల వ్యవధులపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఎఫ్‌డీ కాలిక్యులేటర్ ప్రకారం ఎంత వడ్డీ వస్తుంది? అనే లెక్కలు ఈ కథనంలో తెలుసుకుందాం.