Home Blog Page 41

‘సార్ పెళ్లిళ్లు కావడం లేదు ఐదు హామీలతో పాటు వధువుల పథకాన్ని తీసుకురండి’.. యువకుడి రిక్వెస్ట్‌తో షాకైన కర్ణాటక సీఎం

0
గ్రామాల్లో ముఖ్యంగా రైతు కుటుంబాలకు అమ్మాయిల్ని ఇచ్చి వివాహం చేయడానికి తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. దీంతో 35 ఏళ్లు దాటినా చాలా మందికి ఇంకా పెళ్లిళ్లు కావడం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు.. తన ఆవేదనను ముఖ్యమంత్రి వద్ద వెళ్లబోసుకున్నాడు. తమకు పిల్లను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, పెళ్లి కావడం లేదనే నిరాశ చెంది జీవితంపై విరక్తితో అనేక మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వాపోయాడు. ప్రభుత్వమే ఓ పథకం ప్రారంభించాలని అతడు కోరాడు.

నాన్‌వెజ్‌ ప్రియులకు అలర్ట్.. ఏపీకి బర్డ్ ఫ్లూ టెన్షన్.. వేలాది కోళ్లు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ బర్డ్‌ఫ్లూ పంజా విసిరింది. ప్రస్తుతం అనంతపురం జిల్లా సిద్దరాంపురంలోని ఓ ఫారంలో 2,500 కోళ్లు మృత్యవాతపడ్డాయి. నెల రోజుల వ్యవధిలో ఇన్ని కోళ్లు చనిపోయాయి. దీంతో సంబంధిత అధికారులు కోళ్లు బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు. అనంతరం ఆ గ్రామంలో బర్డ్‌ఫ్లూ‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నిఘా చర్యలను కూడా చేపట్టారు. ఎవరిలోనైనా శ్వాసకోశ సమస్యలుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు.

న్యాయవ్యవస్థలో కీలక ఘట్టం.. ఏపీ హైకోర్టు కొత్త శాశ్వత న్యాయమూర్తులు వీరే.. ప్రమాణ స్వీకారం పూర్తి

న్యాయవ్యవస్థలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు కొత్త శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన వారిలో జస్టిస్‌ తూట చంద్ర ధన శేఖర్‌, జస్టిస్ చల్లా గుణ రంజన్, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు ఉన్నారు. వీరంతా ప్రముఖ యూనివర్సిటీల్లో లా డిగ్రీ పొందారు. అనంతరం లా ప్రాక్టీస్ చేసి, వివిధ హోదాల్లో కూడా పని చేశారు. శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన ఈ ఐదుగురిని సీజేతో పాటు పలువురు జడ్జ్‌లు, లాయర్లు అభినందించారు.

ఎసిడిటీ పెరగడానికి కారణమయ్యే అలవాట్లు

తినగానే ఛాతిలో మంట, నోటిలో పుల్లటి తేన్పులు వస్తున్నాయా. అయితే ఇది ఎసిడిటీ. దీనికి మీరు పాటించే కొన్ని అలవాట్లే కారణం. అవేంటో తెలుసుకోండి.

మీ జాబ్‌ స్కిల్స్‌ పాతబడిపోతున్నాయని చెప్పే సంకేతాలు

సాంకేతికత పెరుగుతున్న ఈ కాలంలో మీకున్న స్కిల్స్‌ను ఎప్పటికప్పడు అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. స్కిల్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మీ స్కిల్స్‌ పాతబడిపోవడం వల్ల ఎదుగుదల ఉండదు.

రాత్రిపూట ఓవర్‌థింకింగ్‌కు కారణాలు

పగలు బాగానే ఉంటారు. కానీ రాత్రయితే చాలు ఒకటే ఆలోచనలు. నిద్ర పట్టక ఇలా గంటలపాటు ఆలోచిస్తునే ఉంటారు. దీనికి గల కారణాలు, తగ్గించే పద్ధతులు తెలుసుకుందాం.

అక్టోబర్‌ హీట్‌ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

తెలంగాణలో అక్టోబర్‌ సమయంలో వేడి ఎక్కువగా ఉంటుంది. రుతుపవనాల నిష్క్రమణ వల్ల వాతావరణంలో వేడి ఎక్కువ అవుతుంది. దీన్నే అక్టోబర్‌ హీట్‌ అంటారు. అక్టోబర్‌ హీట్‌ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ వివరించాం.

ప్రోటీన్ అధికంగా ఉండే సౌత్ ఇండియన్ ఫుడ్స్

ప్రోటీన్ కోసం కోడిగుడ్లు, చికెన్, ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు. మన అమ్మమ్మలు వండే సౌత్ ఇండియన్ ఫుడ్స్‌లోనే ఎంతో ప్రోటీన్ ఉంటుంది. అలాంటి ఆహారాలు ఏంటో చూద్దాం.

Aadarsha Kutumbam: సోషల్ మీడియా ట్రోల్స్‌కి భయపడుతున్నాం.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకి కారణం ఇదే: నాగవంశీ

Aadarsha Kutumbam Postponed: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ చిత్రం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 9న రావాల్సిన ఈ సినిమా విడుదల ఆలస్యం కానుందని నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్‌ పెట్టి మరీ ధ్రువీకరించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నాలుగైదు రోజుల ముందు ఈ విషయం చెప్పినందుకు క్షమించమని కోరారు. ఎప్పుడొచ్చినా ఈ సినిమా వెంకీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని నాగవంశీ అన్నారు.

నాగార్జున, బాలకృష్ణకి పోటీగా బరిలో దిగుతున్న కిరణ్ అబ్బవరం.. రియాలిటీతో రిస్క్ చేస్తున్నాడా?

2026 క్రిస్మస్ బాక్సాఫీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అక్కినేని నాగార్జున ‘కింగ్ 100’, నందమూరి బాలకృష్ణ ‘దాదా’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇప్పుడు యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా బరిలో దిగుతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రియాలిటీ’ చిత్రాన్ని డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీనియర్ స్టార్లతో పోటీకి రెడీ అయిన కిరణ్ అబ్బవరం.. కాస్త రిస్క్ చేస్తున్నారేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.