HomeEntertainmentAadarsha Kutumbam: సోషల్ మీడియా ట్రోల్స్‌కి భయపడుతున్నాం.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకి కారణం ఇదే: నాగవంశీ

Aadarsha Kutumbam: సోషల్ మీడియా ట్రోల్స్‌కి భయపడుతున్నాం.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకి కారణం ఇదే: నాగవంశీ

Aadarsha Kutumbam Postponed: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ చిత్రం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 9న రావాల్సిన ఈ సినిమా విడుదల ఆలస్యం కానుందని నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్‌ పెట్టి మరీ ధ్రువీకరించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నాలుగైదు రోజుల ముందు ఈ విషయం చెప్పినందుకు క్షమించమని కోరారు. ఎప్పుడొచ్చినా ఈ సినిమా వెంకీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని నాగవంశీ అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments