ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా రాబోతున్న సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’ ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ సంచలనంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక షో అధికారిక ప్రోమోను తెరకెక్కించే బాధ్యతను కమర్షియల్ దర్శకుడు హరీష్ శంకర్ తీసుకున్నారు. నవంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ స్పెషల్ ప్రోమో షూటింగ్ భారీ హంగులతో జరగనుంది. ఇప్పటికే లోకనాయకుడు కమల్ హాసన్‌తో పాటు పలువురు తారలతో ఎపిసోడ్ల షూటింగ్ సాగుతుండగా, చిరు-పవన్-చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోయే ఎపిసోడ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. హరీష్ మార్క్ ఎలివేషన్లతో సిద్ధమవుతున్న ఈ ప్రోమోను నవంబర్ నెలాఖరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
‘మెగావర్స్’తో ఓటీటీలో చిరు సెన్సేషన్.. పవర్ఫుల్ ప్రోమో డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్
RELATED ARTICLES


