HomeBusiness48 ఏళ్లుగా నీళ్లు ముట్టుకోని ప్రపంచ కుబేరుడు..వారెన్ బఫెట్‌ డైట్‌ వెనుక అసలు కథ!

48 ఏళ్లుగా నీళ్లు ముట్టుకోని ప్రపంచ కుబేరుడు..వారెన్ బఫెట్‌ డైట్‌ వెనుక అసలు కథ!

Warren Buffett | ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఒకరు వారెన్ బఫెట్. పెట్టుబడుల విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరించే ఈ దిగ్గజ వ్యాపారవేత్తకు ఓ విచిత్రమైన అలవాటు ఉంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆయన నీళ్లు తాగడం లేదట! తన దాహాన్ని తీర్చుకోవడానికి చెర్రీ కోక్‌నే ఇష్టపడతారట. ఈ ఆసక్తికర విషయాన్ని మరో బిలియనీర్, హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్‌మన్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

48 ఏళ్లుగా నీళ్లు తాగలేదట!

కొన్నేళ్ల క్రితం వారెన్ బఫెట్ తన ఇంటికి డిన్నర్‌కు వచ్చిన సందర్భాన్ని బిల్ అక్‌మన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో బఫెట్‌కు నీళ్లు అందించగా ఆయన సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఆశ్చర్యపోయిన అక్‌మన్.. ‘మీరు నీళ్లు తాగరా?’ అని ప్రశ్నించారట. అందుకు బఫెట్.. ‘బిల్.. గత 48 ఏళ్లుగా నేను నీళ్లు తాగడం లేదు’ అని సమాధానమిచ్చినట్లు అక్‌మన్ తెలిపారు. దీంతో ఆయన కోసం ప్రత్యేకంగా చెర్రీ కోక్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు.

రోజుకు ఐదు క్యాన్ల కోక్‌!

కోకా-కోలా పట్ల తనకున్న అభిమానాన్ని బఫెట్ గతంలోనూ పలుమార్లు వెల్లడించారు. 2015లో ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రోజుకు సుమారు 2,700 కేలరీలు తీసుకుంటే.. అందులో నాలుగో వంతు కోకా-కోలా నుంచే వస్తుందని చెప్పారు. రోజుకు కనీసం ఐదు 12 ఔన్సుల క్యాన్ల కోక్ తాగుతానని వెల్లడించారు.

పెప్సీ అభిమానిగా మొదలై.. కోక్ ప్రియుడిగా!

అయితే బఫెట్ మొదటి నుంచీ కోకా-కోలా అభిమాని కాదు. దాదాపు 48 ఏళ్లపాటు ఆయన పెప్సీని ఇష్టంగా తాగేవారట. దీంతో ఆయన కుమారుడు హోవార్డ్ స్నేహితులు సరదాగా ‘పెప్సీ వారెన్’ అని పిలిచేవారని ఆయనకు సన్నిహితుడొకరు గుర్తుచేశారు.

అయితే 1986లో బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశం సందర్భంగా బఫెట్ తన పానీయపు అభిరుచిని మార్చుకున్నారు. ఆ సమావేశానికి అధికారిక పానీయంగా చెర్రీ కోక్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి కోకా-కోలాపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నారు.

పెట్టుబడుల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన వారెన్ బఫెట్.. వ్యక్తిగత అలవాట్ల విషయంలోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే నీళ్లకు బదులుగా శీతల పానీయాలపై ఆధారపడటం ఆరోగ్యానికి మంచిదని మాత్రం భావించకూడదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments