HomeEntertainmentAK47: రెండో రోజు కాస్త పుంజుకున్న 'ఆదర్శ కుటుంబం'… అయినా టార్గెట్ రీచ్ అవ్వడం...

AK47: రెండో రోజు కాస్త పుంజుకున్న ‘ఆదర్శ కుటుంబం’… అయినా టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యమేనా?

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ (AK 47) బాక్సాఫీస్ వద్ద రెండో రోజు పుంజుకుంది. తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.9.75 కోట్ల నెట్ రాబట్టగా, శనివారం 6.7 శాతం వృద్ధితో రూ.10.40 కోట్ల నెట్ సాధించింది. దీంతో రెండు రోజుల్లో ఇండియా నెట్ రూ.20.15 కోట్లకు (గ్రాస్ రూ.23.60 కోట్లు), ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.33.95 కోట్లకు చేరింది. మూడో రోజైన ఆదివారం దేశవ్యాప్త గ్రాస్ రూ.26.24 కోట్లకు చేరినప్పటికీ, సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.120 కోట్ల గ్రాస్ అందుకోవాలి. డివైడ్ టాక్ నడుమ నవంబర్ 5 నుంచి కొత్త చిత్రాలు బరిలోకి దిగుతుండటంతో ఈ భారీ టార్గెట్‌ను దాటడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments