Manne Krishank Police Surveillance: బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్టు చేశారు. తన ఇంటి వద్ద గత తొమ్మిది గంటలుగా ఇద్దరు పోలీసులు, మరికొందరు వ్యక్తులు నిఘా ఉంచినట్లు ఆయన ఆరోపించారు. తాను ఇంట్లోనే ఉంటూ గల్లీ క్రికెట్ ఆడుకుంటున్నానని, తన కోసం పోలీసులు సమయం, శ్రమ వృథా చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ ఈ పోస్టు పెట్టిన క్రిశాంక్.. పోలీసుల నిఘాపై వివరణ ఇవ్వాలని కోరారు.
Sircilla Eye Surgery: సిరిసిల్లలో వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు.. ఎడమ కంటికి బదులు కుడి కంటికి సర్జరీ..!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో కంటి సర్జరీ విషయంలో పొరపాటు జరిగిందంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఎంకమ్మ అనే వృద్ధురాలికి ఎడమ కంటికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు ముందుగా నిర్ధారించినప్పటికీ.. పొరపాటుగా కుడి కంటికి ఆపరేషన్ చేసినట్లు గుర్తించామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సర్జరీకి ముందు పేషెంట్ వివరాలు, ఆపరేషన్ చేయాల్సిన కంటిని వైద్య బృందం సరిగ్గా పరిశీలించిందా అనే అంశంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
LB Nagar Hayathnagar Double Decker Corridor: హైదరాబాద్‌లో కొత్త డబుల్ డెక్కర్ కారిడార్.. కేంద్రం సాయం కోరిన మంత్రి కోమటిరెడ్డి
Hyderabad new Double Decker Corridor: తెలంగాణలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరుగుతున్న చింతన్ శివిర్–2026లో ఇద్దరూ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణకు సంబంధించిన రహదారులు, జాతీయ రహదారులు, నిధులు, అనుమతులపై చర్చించారు. ఎల్‌బీనగర్–హయత్‌నగర్ మధ్య 6 కి.మీ. డబుల్ డెక్కర్ కారిడార్‌కు 2026–27లో మంజూరు ఇవ్వాలని కోరారు. అలాగే రూ.1,230 కోట్లతో ఐదు రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర అనుమతి, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాశిఫలాలు 06 అక్టోబర్ 2026: త్రికోణ యోగం ప్రభావంతో మేషం నుంచి మీనం వరకు ఏ రాశులకు మూడింతల ప్రయోజనాలు?
రాశిఫలాలు 05 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు త్రికోణ, సిద్ధ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శివయ్యకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున మీ జాతకంలో కుజ గ్రహ స్థానం బలపడొచ్చు ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం లభించొచ్చు. అంతేకాదు శత్రువులపై ఆధిపత్యం చెలాయించొచ్చు. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
ఇండియాలో ‘ఐఏఎస్ సింగం’.. తుకారాం ముండేను ‘రాక్‌స్టార్’ అంటూ ఆకాశానికెత్తేసిన న్యూయార్క్ టైమ్స్
తుకారాం ముండే.. ఈ పేరు వింటే చాలు మహారాష్ట్రలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాలు వణికిపోతున్నాయి. నిబంధనలను గాలికొదిలేసి.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుకునే రెస్టారెంట్లపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. కమిషనర్ తుకారాం ముండే ఆకస్మిక తనిఖీలు చేపట్టి, అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఆయనకు ఐఏఎస్ సింగం అనే పేరు వచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ముండే పేరు మార్మోగిపోవడం చెప్పుకోదగ్గ విశేషం.
‘సార్ పెళ్లిళ్లు కావడం లేదు ఐదు హామీలతో పాటు వధువుల పథకాన్ని తీసుకురండి’.. యువకుడి రిక్వెస్ట్‌తో షాకైన కర్ణాటక సీఎం
గ్రామాల్లో ముఖ్యంగా రైతు కుటుంబాలకు అమ్మాయిల్ని ఇచ్చి వివాహం చేయడానికి తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. దీంతో 35 ఏళ్లు దాటినా చాలా మందికి ఇంకా పెళ్లిళ్లు కావడం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు.. తన ఆవేదనను ముఖ్యమంత్రి వద్ద వెళ్లబోసుకున్నాడు. తమకు పిల్లను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, పెళ్లి కావడం లేదనే నిరాశ చెంది జీవితంపై విరక్తితో అనేక మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వాపోయాడు. ప్రభుత్వమే ఓ పథకం ప్రారంభించాలని అతడు కోరాడు.
నాన్‌వెజ్ ప్రియులకు అలర్ట్.. ఏపీకి బర్డ్ ఫ్లూ టెన్షన్.. వేలాది కోళ్లు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ బర్డ్‌ఫ్లూ పంజా విసిరింది. ప్రస్తుతం అనంతపురం జిల్లా సిద్దరాంపురంలోని ఓ ఫారంలో 2,500 కోళ్లు మృత్యవాతపడ్డాయి. నెల రోజుల వ్యవధిలో ఇన్ని కోళ్లు చనిపోయాయి. దీంతో సంబంధిత అధికారులు కోళ్లు బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు. అనంతరం ఆ గ్రామంలో బర్డ్‌ఫ్లూపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నిఘా చర్యలను కూడా చేపట్టారు. ఎవరిలోనైనా శ్వాసకోశ సమస్యలుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు.
న్యాయవ్యవస్థలో కీలక ఘట్టం.. ఏపీ హైకోర్టు కొత్త శాశ్వత న్యాయమూర్తులు వీరే.. ప్రమాణ స్వీకారం పూర్తి
న్యాయవ్యవస్థలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు కొత్త శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ తూట చంద్ర ధన శేఖర్, జస్టిస్ చల్లా గుణ రంజన్, జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఉన్నారు. వీరంతా ప్రముఖ యూనివర్సిటీల్లో లా డిగ్రీ పొందారు. అనంతరం లా ప్రాక్టీస్ చేసి, వివిధ హోదాల్లో కూడా పని చేశారు. శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన ఈ ఐదుగురిని సీజేతో పాటు పలువురు జడ్జ్‌లు, లాయర్లు అభినందించారు.

