HomeEntertainmentNBK 112: కొరటాల శివ మాస్ స్కెచ్... నందమూరి బాలకృష్ణకు విలన్‌గా రాజశేఖర్?

NBK 112: కొరటాల శివ మాస్ స్కెచ్… నందమూరి బాలకృష్ణకు విలన్‌గా రాజశేఖర్?

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం మొదలైంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమాలో బాలయ్యకు దీటైన ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం సీనియర్ హీరో, ‘యాంగ్రీ మ్యాన్’ డాక్టర్ రాజశేఖర్‌ను సంప్రదించినట్లు ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. మాస్ హీరో బాలయ్య, విలక్షణ నటుడు రాజశేఖర్ ముఖాముఖి తలపడే సన్నివేశాలు వెండితెరపై హై-వోల్టేజ్ అనుభూతిని అందిస్తాయని భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments