తనదైన కామెడీ, మాటతీరు, హావభావాలతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అగ్గిపెట్టె మచ్చ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యూత్ చాలా పొల్యూట్ అయ్యారు.. ఇలాంటి టైంలో ‘హనుమాన్ అంశ్’ సొసైటీకి అవసరం: మైత్రీ రవి శంకర్ కీలక వ్యాఖ్యలు
Hanuman Ansh Telugu Press Meet: ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా, ఏఐ సాంకేతికత దుర్వినియోగం వల్ల యువత పొల్యూట్ అవుతున్నారని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నీమ్ కరోలి బాబా బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. దేవుడిపై భక్తి, భయాన్ని పెంచి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాలు ఇప్పుడు చాలా అవసరమని పేర్కొన్నారు.
మెగా ప్రాజెక్ట్‌కు బ్రేకులు.. శ్రీకాంత్ ఓదెలను చిరు పక్కన పెట్టడానికి కారణమిదేనా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఈ సినిమా ఇప్పట్లో ఉండబోదని స్వయంగా నాని స్పష్టం చేశారు. ఓదెల శైలిలో ఉండే మితిమీరిన రక్తపాతం, హింస తన ఇమేజ్‌కు సరిపడవని చిరంజీవి పునరాలోచనలో పడటం, సెట్స్‌లో దర్శకుడి వ్యవహార శైలిపై వచ్చిన ఫీడ్‌బ్యాకే ఇందుకు కారణమని టాక్. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చేస్తున్న చిరంజీవి, ఆ తర్వాత ఓదెలకు అవకాశం ఇవ్వడం లేదని సమాచారం. అయితే భవిష్యత్తులో ఎప్పటికైనా చిరంజీవితో భారీ చిత్రాన్ని నిర్మించాలనే పట్టుదలతో నాని ఉన్నారు.
Poonam Kaur: ‘ఆదర్శం లేని దర్శకుడు.. హనీ ట్రాప్‌తోనే జీవితం గడుపుతున్నాడు.. AK మరొక అజ్ఞాతవాసి’.. పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్
నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన క్రిప్టిక్ పోస్టులు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. “ఆదర్శం లేని ఓ దర్శకుడు హనీ ట్రాప్, మూఢనమ్మకాల ట్రాపింగ్‌తోనే జీవితం గడుపుతున్నాడు.. ‘AK’ మరొక ‘అజ్ఞాతవాసి’ అవుతుంది” అని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఇక్కడ పేర్లు ప్రస్తావించనప్పటికీ, ఇటీవల వాయిదా పడిన త్రివిక్రమ్ సినిమా ‘ఆదర్శ కుటుంబం AK 47’ను ఉద్దేశించే పూనమ్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.
మళ్లీ తల్లికాబోతున్న కియారా అద్వానీ.. క్యూట్ పిక్‌తో గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ కపుల్
బాలీవుడ్ ప్రముఖ నటి కియారా అద్వానీ తాను రెండోసారి గర్భం దాల్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారి బట్టలతో కూడిన ప్రత్యేకమైన ఫోటోను పంచుకుంటూ వెల్లడించారు. “మరోసారి జీవితంలో అత్యంత గొప్ప బహుమతిని అందుకోబోతున్నాం” అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారాలకు 2023లో వివాహం జరగ్గా, 2025 జూలైలో మొదటి సంతానంగా ‘సారాయా’ అనే కుమార్తె జన్మించింది. ఆమె ఇప్పటికే ప్రసవించినట్లు ఇటీవల వచ్చిన వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం ఆమె రెండోసారి గర్భవతి అని ఈ పోస్ట్‌తో స్పష్టమైంది.

