Home Blog Page 23

బీర్ల ఉత్పత్తికి శ్రీశైలం నీటిని ఉపయోగించాలని ఎక్కడా చెప్పలేదు.. హరీశ్‌రావుకు మంత్రి జూపల్లి కౌంటర్

0
తెలంగాణలో శ్రీశైలం నీటి వినియోగం, డిండి ప్రాజెక్టు, మద్యం ఉత్పత్తి, ఎక్సైజ్‌ ఆదాయంపై తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు చేసిన విమర్శలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగించాలని తాను చెప్పలేదని.. డిండి ప్రాజెక్టుకు శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను తీసుకురావాలని మాత్రమే సూచించానని స్పష్టం చేశారు. ఎల్‌నినోను మద్యం అమ్మకాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. తెలంగాణలో మద్యం ఆదాయం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే భారీగా పెరిగిందని ఆరోపించిన జూపల్లి.. తమ ప్రభుత్వ హయాంలో ఆదాయం పెరుగుదలపై లెక్కలు వెల్లడించారు.

హైదరాబాద్‌లో అమెరికా యూనివర్సిటీ క్యాంపస్.. UGC గ్రీన్ సిగ్నల్, 2027లో తొలి బ్యాచ్!

0
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు.. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్‌కు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భారత్‌లో క్యాంపస్ ఏర్పాటుకు అనుమతులు పొందిన తొలి అమెరికన్ పబ్లిక్ యూనివర్సిటీగా.. తెలంగాణలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్న తొలి విదేశీ యూనివర్సిటీగా నిలవనుంది. 2027 ఆగస్టులో తొలి బ్యాచ్‌ను ప్రారంభించాలని ఆ యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. బిజినెస్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, అనలిటిక్స్‌లో కోర్సులు ప్రారంభించనుంది.

రాశిఫలాలు 08 అక్టోబర్ 2026: శుక్ల యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశులకు అనేక రంగాల్లో విజయావకాశాలు

రాశిఫలాలు 08 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వ ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు శుక్ల, బ్రహ్మ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీ జాతకంలో గురు గ్రహ స్థానం బలపడుతుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 08 October 2026: ఈరోజు నక్షత్రం, తిథి, యోగం, శుభ ముహుర్తాలు, రాహుకాలం వివరాలివే

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని త్రయోదశి తిథి నాడు, గురువారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Sun Nakshatra Transit: చిత్రా నక్షత్రంలో సూర్యుడి సంచారంతో రాబోయే రెండు వారాలు ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు!

Sun Nakshatra Transit: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఆత్మవిశ్వాసం, నాయకత్వం, గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సూర్యుడు అక్టోబర్ 11న సూర్యుడు తన మిత్ర గ్రహమైన కుజుని ఆధ్వర్యంలో ఉన్న చిత్రా నక్షత్రంలో ప్రవేశించి, అక్టోబర్ 24వ తేదీ వరకు అక్కడే నివాసం ఉండనున్నాడు. ఈ శుభ సమయంలో కొన్ని రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో ఉద్యోగం, వ్యాపారం మరియు పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. ఈ సందర్భంగా సూర్యుని స్థానంలో జరిగే ఈ మార్పు వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Shani Nakshatra Transit 2026: శని దేవుని నక్షత్ర మార్పు వేళ ఈ 6 రాశులకు రాబోయే 83 రోజుల పాటు అదృష్టం కలిసొచ్చే అవకాశం

Shani Nakshatra Transit 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని దేవుడిని న్యాయానికి, కర్మలకు అధిపతిగా పరిగణిస్తారు. అందుకే శని గమనంలో వచ్చే చిన్న మార్పు కూడా జ్యోతిష్యపరంగా చాలా కీలకమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న శుక్రవారం రోజున సాయంత్రం 7:28 గంటలకు శని దేవుడు రేవతి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించనున్నారు. ఇదే నక్షత్రంలో ఈ ఏడాది చివరి వరకు అంటే దాదాపు 83 రోజుల పాటు నివాసం ఉండనున్నారు. ఈ నక్షత్రానికి శనీశ్వరుడే అధిపతిగా ఉంటాడు.

ఈ సమయంలో 12 రాశుల వారిని శనిదేవుడు ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో ఐదు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. శని దేవుని అనుగ్రహంతో మీ కష్టానికి తగిన ఫలితం రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగులో ఉన్న మీ పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. ఈ సందర్భంగా శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించడం వల్ల రాబోయే 83 రోజుల పాటు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2027 వన్డే వరల్డ్ కప్‌కు ఇంకో ఏడాదే గడువు.. నేడే జట్టును ఎంపిక చేస్తే గిల్ సేన ఎలా ఉంటుందంటే!

0
2027 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆడటానికి సరిగ్గా ఇంకో ఏడాది సమయం మిగిలి ఉంది. కేప్‌టౌన్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా 2027 అక్టోబర్ 7న తలపడనుంది. ఒకవేళ అందరూ ఫిట్‌గా ఉండి నేడే జట్టును ఎంపిక చేస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కూడిన బ్యాటింగ్ విభాగం సిద్ధంగా ఉంది. హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, తిలక్ వర్మలకు ఈ 15 మంది సభ్యుల స్క్వాడ్‌లో చోటు లభించే అవకాశం ఉంది.

చీఫ్ సెలక్టర్‌గా ముగిసిన అగార్కర్ అధ్యాయం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన గంభీర్..!

0
భారత పురుషుల క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ ప్రయాణం ముగిసింది. జులై 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్, అక్టోబర్ 4తో ముగిసిన తన కాంట్రాక్ట్‌ను పొడిగించుకోలేదు. ఈ మూడేళ్లలో అంటే అగార్కర్ హయాంలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలతో పాటు రెండు ఆసియా కప్‌లను గెలుచుకుంది. అగార్కర్ సేవలను కొనియాడుతూ బీసీసీఐతో పాటు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

భారత్, ఇజ్రాయెల్‌‌కు కొత్తతరహా ఉగ్రవాదం ముప్పు రాబోతోంది.. ఇజ్రాయెల్ రాయబారి హెచ్చరిక

0
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటన ప్రపంచానికి ఓ హెచ్చరిక. కొత్తతరహా ఉగ్రవాదానికి ఇది సంకేతమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా, భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఇజ్రాయెల్‌కు కొత్త తరహా ఉగ్రవాదం నుంచి పెను ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాద సమూహాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని పహల్గామ్‌లో జరిగిన దాడికి ఇందుకు ఉదహారణ అని ఆయన వ్యాఖ్యానించారు.

సీఈసీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆందోళనపై మాజీ మిత్రపక్షం డీఎంకే యూటర్న్.. 24 గంటల్లోనే

0
దేశవ్యాప్తంగా ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా ఉందని, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. దీనికి బాధ్యుడు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై మాజీ మిత్రపక్షం డీఎంకే.. విమర్శలు గుప్పించింది. తమిళనాడులో ఎస్ఐఆర్ గురించి ఆయన మాట్లాడటం లేదని ప్రశ్నించింది. ఇది జరిగిన 24 గంటలైనా కాలేదు ద్రవిడ పార్టీ వెనక్కి తగ్గడం గమనార్హం.