2027 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆడటానికి సరిగ్గా ఇంకో ఏడాది సమయం మిగిలి ఉంది. కేప్‌టౌన్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా 2027 అక్టోబర్ 7న తలపడనుంది. ఒకవేళ అందరూ ఫిట్‌గా ఉండి నేడే జట్టును ఎంపిక చేస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కూడిన బ్యాటింగ్ విభాగం సిద్ధంగా ఉంది. హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, తిలక్ వర్మలకు ఈ 15 మంది సభ్యుల స్క్వాడ్‌లో చోటు లభించే అవకాశం ఉంది.


