నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తనకు ఎలాంటి హోదాలు, అధికారాలపై వ్యామోహం లేదని స్పష్టం చేశారు. అనవసర వివాదాల్లోకి తన పేరును లాగొద్దని, లేనిపోని వార్తలతో ఇబ్బంది పెట్టవద్దని కోరుతూ తనపై వస్తున్న పొలిటికల్ రూమర్లకు చెక్ పెట్టారు. తన పేరు మీద రాజకీయాలు చేయొద్దని, తన పేరును రాజకీయాలకు ఉపయోగించవద్దని రిక్వెస్ట్ చేశారు. పుకార్లకు, గాలి వార్తలకు స్పందించకుండా సంయమనం పాటిస్తున్నాని పేర్కొన్నారు.
Bloody Romeo: ‘ఇలాంటి సినిమా ఇంతవరకూ రాలేదు.. వైలెన్స్ ఉంటుంది కానీ’.. ‘బ్లడీ రోమియో’పై నాని క్రేజీ కామెంట్స్
సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా ‘బ్లడీ రోమియో’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి నాని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో వైలెన్స్ ఉన్నప్పటికీ అది పరిమితిలోనే ఉంటుందని, సుజీత్ ఒక ట్విస్ట్ ఇచ్చారని, స్టైలిష్ యాక్షన్‌తో ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. తెలుగులో ఇంతవరకు ఈ జానర్‌లో ఇలాంటి సినిమా రాలేదని, తన పాత్ర చాలా చమత్కారంగా ఉంటుందని నాని చెప్పారు.
దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రకంపనలు.. ఓట్ల లెక్కతో మొదలైన సరికొత్త జాతీయ రాజకీయం!
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విపక్ష పార్లమెంటు సభ్యుల ర్యాలీతో వీధులన్నీ మారుమోగాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తప్పించాలన్న డిమాండ్‌తో విపక్ష ఎంపీలు ర్యాలీ చేయడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడంతోపాటు మొబైల్ డేటాను పని చేయకుండా చేశారు. పార్లమెంటు భవనం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం భవనం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పోలీసులతో రాహుల్, ప్రియాంక వాగ్వాదానికి దిగారు. బస్సులో నుంచి దిగడానికి రాహుల్, ప్రియాంక ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఇద్దరినీ వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని… SIR రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఉదయం నుంచి ఇండియా కూటమి ఎంపీలు మధ్యాహ్నం వరకు నిరసన ప్రదర్శించారు. మధ్యాహ్నం నుంచి ఆకాశవాణి భవణ్ దగ్గర బైఠాయించారు. అసలు SIR పై విపక్షాలు ఎందుకు నిరసన చేపట్టాయో… అధికార బీజేపీ దీన్ని ఎలా చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం…
మీ షాంపూ ఒకసారి చెక్ చేసుకోండి, హెయిర్ కలర్ వేసిన జుట్టుకు ఎలాంటి షాంపూ వాడాలి?
షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు గట్టిగా, పొడిగా లేదా ఫ్రిజ్జీగా అనిపిస్తుందా? అయితే మీరు ఉపయోగిస్తున్న షాంపూను ఒకసారి గమనించాల్సిందే. జుట్టులోని దుమ్ము, చెమట, నూనె, హెయిర్ ప్రొడక్ట్స్‌ను తొలగించడానికి షాంపూలోని సర్ఫాక్టెంట్లు సహాయపడతాయి. వీటిలో సల్ఫేట్స్ కూడా ఒక రకం. ఇవి జుట్టును బాగా శుభ్రం చేస్తాయి. కానీ అదే సమయంలో జుట్టుకు సహజంగా ఉండే నూనెలు, లిపిడ్స్‌ను కూడా ఎక్కువగా తొలగించే అవకాశం ఉంటుంది.
దీంతో కొందరికి జుట్టు డ్రైగా, గరుకుగా అనిపించవచ్చు. ఈ మధ్య కాలంలో సల్ఫేట్ ఫ్రీ షాంపూలపై అవగాహన పెరిగి వాటిని వాడటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. మరి ఈ సల్ఫేట్ ఆధారిత షాంపూలను పక్కన పెట్టి, సల్ఫేట్ ఫ్రీ షాంపూలపై మారితే మీ జుట్టులో ఎలాంటి అద్భుతమైన మార్పులు జరుగుతాయో సవివరంగా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్యాస్ లీకేజీని ముందుగానే కనిపెట్టొచ్చు, కొన్ని విషయాలని గమనిస్తే లీకేజీని ఆపొచ్చు, అవేంటంటే
గ్యాస్ వాడినప్పుడు సిలిండర్, రెగ్యులేటర్, పైప్, స్టౌ కనెక్షన్ ఇలా అన్నింటినీ ముందుగా గమనించాలి. వీటిలో ఏ ఒక్కదానిలో సమస్య ఉన్నా అది పెద్దగా మారి పెద్ద పెద్ద సమస్యలకి దారితీస్తుంది. కొన్నిసార్లు ముందునుంచీ కొన్ని సమస్య తాలుకూ అంశాలు కనిపిస్తే మరికొన్నిసార్లు ఎలాంటి సూచన ఉండకుండానే గ్యాస్ లీక్‌తో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇంట్లో పెద్దవారు, చిన్నపిల్లలు ఉంటారు. కాబట్టి, ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా ముందునుంచీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం అసలు గ్యాస్ లీక్ కాకుండా ఎలాంటి విషయాలని గమనించాలి, సమస్య ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
Bonus Shares: లక్ అంటే వీరిదే.. ఏడాదిలో 637 శాతం లాభం.. ఇప్పుడు 100 షేర్లకు 1000 షేర్లు బోనస్ ఇస్తున్న PH క్యాపిటల్!
Bonus Shares: ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్టార్‌లోని స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ P H క్యాపిటల్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ కంపెనీ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై తమ షేర్ హోల్డర్లకు 10:1 రేషియోలో బోనస్ షేర్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన రికార్డు డేట్ అక్టోబర్ 7గా నిర్ణయించారు. అంతే కాదు ఈ స్టాక్ గత ఏడాది కాలంలో ఏకంగా 637 శాతం మేర లాభాలు అందించింది. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
HDFC నుంచి మరో కొత్త స్కీమ్.. NFO సబ్‌స్క్రిప్షన్ షురూ.. రూ.100 ఉన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు!
HDFC NFO: ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నుంచి న్యూ ఫండ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ప్లస్ 8- 13 ఇయర్స్ జీ-సెక్ 70:30 ఇండెక్స్ ఫండ్ పేరుతో ఈ కొత్త స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 5వ తేదీ నుంచే మొదలవుతోంది. మరి ఈ న్యూ ఫండ్ ఆఫర్ స్కీమ్ గురించి వివరాలు తెలుసుకుందాం.
Jio యూజర్లూ.. ఒకే రీఛార్జ్‌తో వైఫై + 1000 TV ఛానళ్లు + 12 OTT యాప్స్.. వివరాలు ఇవే!
Jio 3 In 1 Plan: రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ‘జియో హోమ్ 3-ఇన్-1’ ప్లాన్ ప్రకటించింది. ఒకే రీఛార్జ్‌తో అపరిమిత ఇంటర్నెట్, వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 12కు పైగా ఓటీటీ యాప్స్ లభిస్తాయి. విడి విడిగా టీవీ, వై-ఫై ప్యాక్‌లను సైతం పరిచయం చేసింది. ఈ ఆఫర్ జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
విదేశీ విద్యార్థులకు ట్రంప్ యంత్రాంగం భారీ షాక్.. ఓపీటీ ప్రోగ్రామ్‌కి 70 వేల డాలర్లు ఫీజు
అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అక్కడ ఉపాధి వెతుక్కోడానికి అవసాశం కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌పై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. అమెరికా వర్క్‌ఫోర్స్‌లోకి దొడ్డదారిన తక్కువ వేతనంతో ఉద్యోగులను తీసుకోవడాన్ని నిరోధించేందుకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. తొలిసారి 70 వేల డాలర్లు ఫీజు కింద విధించనున్నట్టు తెలిపింది. స్టెమ్ సహా తదుపరి ప్రతి ఓటీపీకి అదనంగా 30 వేల డాలర్లు చెల్లించాల్సిందేనని పేర్కొంది.
Gaza War: ఇరాన్ ప్రాక్సీలు మళ్లీ బలపడుతున్నాయా? యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలంగా పుంజుకుందా?
అక్టోబరు 7 2023న ఇజ్రాయెల్‌లో హమాస్ మెరుపు దాడితో యావత్తు ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ముష్కరులు..దొరికినవాళ్లను దొరికినట్టు ఊచకోత కోశారు. ఇది ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన నిఘా వైఫల్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ దాడికి ప్రతీకారంగా గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. రెండేళ్ల పాటు కొనసాగిన యుద్ధంలో హమాస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందా? ఇరాన్ దాని ప్రాక్సీలు బలహీనపడ్డాయా? అంటే సమాధానం లేదు.

